logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చెరుకుపల్లి లో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం. వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ తిరుపతిరావు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచమని చెరుకుపల్లి ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు అన్నారు. చెరుకుపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి శిరోరక్ష – ప్రాణ రక్ష పేరుతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో జరిగే మరణాల్లో అత్యధికం తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, నాణ్యమైన హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. సరదా కోసం లేదా పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా, సొంత కుటుంబ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు.ప్రాణం చాలా విలువైనదని ఒక్క చిన్న అలసత్వం కుటుంబాలనే రోడ్డున పడేస్తుందన్నారు.కార్యక్రమంలో కానిస్టేబుళ్లు కారంకి సురేష్, నాగేశ్వరరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

3 hrs ago
user_M.Vijay Kishore
M.Vijay Kishore
Cherukupalle H/O Arumbaka, Bapatla•
3 hrs ago
efcc91da-6b8f-4c29-a261-9db2bdb83237

చెరుకుపల్లి లో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం. వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ తిరుపతిరావు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచమని చెరుకుపల్లి ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు అన్నారు. చెరుకుపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి శిరోరక్ష – ప్రాణ రక్ష పేరుతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో జరిగే మరణాల్లో అత్యధికం తలకు తీవ్ర

గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, నాణ్యమైన హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. సరదా కోసం లేదా పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా, సొంత కుటుంబ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు.ప్రాణం చాలా విలువైనదని ఒక్క చిన్న అలసత్వం కుటుంబాలనే రోడ్డున పడేస్తుందన్నారు.కార్యక్రమంలో కానిస్టేబుళ్లు కారంకి సురేష్, నాగేశ్వరరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

More news from Bapatla and nearby areas
  • చెరుకుపల్లి లో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం. వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ తిరుపతిరావు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచమని చెరుకుపల్లి ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు అన్నారు. చెరుకుపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి శిరోరక్ష – ప్రాణ రక్ష పేరుతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో జరిగే మరణాల్లో అత్యధికం తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, నాణ్యమైన హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. సరదా కోసం లేదా పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా, సొంత కుటుంబ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు.ప్రాణం చాలా విలువైనదని ఒక్క చిన్న అలసత్వం కుటుంబాలనే రోడ్డున పడేస్తుందన్నారు.కార్యక్రమంలో కానిస్టేబుళ్లు కారంకి సురేష్, నాగేశ్వరరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    2
    చెరుకుపల్లి లో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం. వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ తిరుపతిరావు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచమని చెరుకుపల్లి ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు అన్నారు. చెరుకుపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి శిరోరక్ష – ప్రాణ రక్ష  పేరుతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో జరిగే మరణాల్లో అత్యధికం తలకు తీవ్ర గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, నాణ్యమైన హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల బారిన పడకుండా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. సరదా కోసం లేదా పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా, సొంత కుటుంబ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు.ప్రాణం చాలా విలువైనదని ఒక్క చిన్న అలసత్వం కుటుంబాలనే రోడ్డున పడేస్తుందన్నారు.కార్యక్రమంలో కానిస్టేబుళ్లు కారంకి సురేష్, నాగేశ్వరరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    3 hrs ago
  • గుంటూరులో ఆటోల ఆగడాలు.బస్టాండ్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు పైనే తిష్ట గుంటూరులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. పోలీసులను కూడా లెక్క చేయడం లేదు. గుంటూరు బస్టాండు నుంచి విజయవాడ పోయేటప్పుడు మనపురం బ్రిడ్జి పాయింట్ వద్ద.... ఓల్డ్ క్లబ్ నుండి వచ్చే వాహనాలు నుంచి వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ ఆటోవాలాలు రోడ్డుకు అడ్డంపెట్టిన వీడియోలు మీరు చూడవచ్చు.. అక్కడ ఆటో లు నిలుపుద చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    గుంటూరులో ఆటోల ఆగడాలు.బస్టాండ్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు పైనే తిష్ట 
గుంటూరులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. పోలీసులను కూడా లెక్క చేయడం లేదు. గుంటూరు బస్టాండు నుంచి విజయవాడ పోయేటప్పుడు మనపురం బ్రిడ్జి పాయింట్ వద్ద.... ఓల్డ్ క్లబ్ నుండి వచ్చే వాహనాలు నుంచి వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ ఆటోవాలాలు రోడ్డుకు అడ్డంపెట్టిన వీడియోలు మీరు చూడవచ్చు.. అక్కడ ఆటో లు నిలుపుద 
చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    5 hrs ago
  • పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.
    1
    పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు
మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పుల్లారెడ్డి చెరువు కట్టపై వ్యర్థాల డంపింగ్............ సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట మాంసాహార వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వ్యర్థాలను వెంటనే తొలగించి, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
    1
    పుల్లారెడ్డి చెరువు కట్టపై వ్యర్థాల డంపింగ్............
సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట మాంసాహార వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వ్యర్థాలను వెంటనే తొలగించి, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    11 hrs ago
  • మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు శ్రీ లంక లితిష్ గారితో సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు.
    1
    మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు శ్రీ లంక లితిష్ గారితో  సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు.
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.