Shuru
Apke Nagar Ki App…
డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్ అండ్ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
Reporter Pen Ppwer
డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్ అండ్ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్ అండ్ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.2
- శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్ అన్నమయ్య జిల్లా. పుంగనూరు. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్ పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు. పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.3
- పలమనేరులో మొట్టమొదటిసారిగా,, నార్త్ ఇండియాలో జరిగేలా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. *పలమనేరు పట్టణంలో దసరా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నార్త్ ఇండియాలో జరిగే దసరా వేడుకల తరహాలో నయా ట్రెండ్‌కు తెరలేపుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.*1
- *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.1
- ఇంజనీరింగ్ విద్యార్థి పై కత్తులతో దాడి.. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్ వి సి ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి పై తిరుపతి ఎంఆర్ పల్లికు చెందిన బయట వ్యక్తులు కాలేజీ ఎదుట కత్తులతో దాడికి తెగబడ్డారు... తీవ్రంగా గాయపడిన తరుణ్ నీ సహ విద్యార్థులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.1
- పుంగనూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పుంగనూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు, పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన మొత్తం రూ.4,76,168 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.1
- బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు4