logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తగ్గిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.81,700, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.78,900, విఐపి దర్శనాల ద్వారా రూ.1,16,850, కార్ పార్కింగ్ ద్వారా రూ.2,14,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,40,390 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,58,891 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.

4 hrs ago
user_P.srinu
P.srinu
యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
4 hrs ago

తగ్గిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.81,700, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.78,900, విఐపి దర్శనాల ద్వారా రూ.1,16,850, కార్ పార్కింగ్ ద్వారా రూ.2,14,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,40,390 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,58,891 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తగ్గిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.81,700, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.78,900, విఐపి దర్శనాల ద్వారా రూ.1,16,850, కార్ పార్కింగ్ ద్వారా రూ.2,14,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,40,390 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,58,891 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    1
    తగ్గిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.81,700, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.78,900, విఐపి దర్శనాల ద్వారా రూ.1,16,850, కార్ పార్కింగ్ ద్వారా రూ.2,14,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,40,390 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,58,891 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    4 hrs ago
  • రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
    1
    రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు
రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
    user_SHEKHAR
    SHEKHAR
    రాజపేట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న సాక్షిగా చెబుతున్న దేవరకద్ర కోటపై ఎగిరేది PRP జెండానే : తీన్మార్ మల్లన్న *పోరాట యోధుడు,ఎర్ర సత్యమన్న సాక్షిగా చెప్తున్నా...* ఎన్నాళ్లు సాగుతుంది ఈ రెడ్ల రాజ్యం.? ఎన్నాళ్లు భరిస్తాం ఈ దోపిడీలు.? దేవరకద్రలో దోపిడీదారుల కాలం చెల్లింది... రెడ్ల గుడారాలు కదులుతున్నాయి.! 2028లో దేవరకద్ర కోటపై ఎగిరేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే... 2028లో గెలవబోయేది మన ముదిరాజ్ బిడ్డే.! *-టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    1
    పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న సాక్షిగా చెబుతున్న దేవరకద్ర కోటపై ఎగిరేది PRP జెండానే : తీన్మార్ మల్లన్న
*పోరాట యోధుడు,ఎర్ర సత్యమన్న సాక్షిగా చెప్తున్నా...*
ఎన్నాళ్లు సాగుతుంది ఈ రెడ్ల రాజ్యం.? ఎన్నాళ్లు భరిస్తాం ఈ దోపిడీలు.?
దేవరకద్రలో దోపిడీదారుల కాలం చెల్లింది... రెడ్ల గుడారాలు కదులుతున్నాయి.!
2028లో దేవరకద్ర కోటపై ఎగిరేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే... 
2028లో గెలవబోయేది మన ముదిరాజ్ బిడ్డే.!
*-టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party
    1
    JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA 
TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు* *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు* గజ్వేల్ జగదేవ్‌పూర్, ప్రజా తెలంగాణ న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
    2
    *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు*
 *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు*
గజ్వేల్ జగదేవ్‌పూర్, ప్రజా తెలంగాణ న్యూస్  : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే
పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్–మిర్జల్‌గూడలో వర్షపు నీటి ముప్పు మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్, మిర్జల్‌గూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో దిగువ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని వారు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్–మిర్జల్‌గూడలో వర్షపు నీటి ముప్పు

మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్, మిర్జల్‌గూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అదే సమయంలో దిగువ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని వారు పేర్కొన్నారు.
వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.