కొదురుపాక మిడ్ మానేరు జనాశయంలో 8.338 టీఎంసీల నీరు నిలువ ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఈరోజు ఉదయం 06:00 గంటలకు నీటిమట్టం వివరాలు విడుదలయ్యాయి. రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ స్థిరంగా కొనసాగుతోంది. రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం +307.80 మీటర్లు కాగా, పూర్తి స్థాయి 318 మీటర్లుగా ఉంది. మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.338 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైప్రవాహాల నుండి ఈ సమయంలో ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ లేదా ఇతర వాగుల నుండి కూడా నీటి ప్రవాహం లేదు. మానేరు, మూలవాగు మరియు ఇతర ఫ్లడ్ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీరు రాకపోవడం గమనార్హం. అయితే రిజర్వాయర్ నుండి మొత్తం 1135 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో రైట్ సైడ్ కాల్వలకు 500 క్యూసెక్కులు, రిజర్వాయర్ మెయింటెనెన్స్/కెనాల్ సిస్టమ్‌కు 450 క్యూసెక్కులు, ప్యాకేజ్-9, ప్యాకేజ్-10, GCLS వంటి వాటికి నీటి విడుదల నమోదు కాలేదు. ఆవిరి రూపంలో 135 క్యూసెక్కులు, మైనర్ బ్రాంచ్‌లకు 45 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కొదురుపాక మిడ్ మానేరు జనాశయంలో 8.338 టీఎంసీల నీరు నిలువ ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఈరోజు ఉదయం 06:00 గంటలకు నీటిమట్టం వివరాలు విడుదలయ్యాయి. రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ స్థిరంగా కొనసాగుతోంది. రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం +307.80 మీటర్లు కాగా, పూర్తి స్థాయి 318 మీటర్లుగా ఉంది. మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.338 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైప్రవాహాల నుండి ఈ సమయంలో ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ లేదా ఇతర వాగుల నుండి కూడా నీటి ప్రవాహం లేదు. మానేరు, మూలవాగు మరియు ఇతర ఫ్లడ్ ఇన్‌లెట్ల ద్వారా కూడా నీరు రాకపోవడం గమనార్హం. అయితే రిజర్వాయర్ నుండి మొత్తం 1135 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో రైట్ సైడ్ కాల్వలకు 500 క్యూసెక్కులు, రిజర్వాయర్ మెయింటెనెన్స్/కెనాల్ సిస్టమ్‌కు 450 క్యూసెక్కులు, ప్యాకేజ్-9, ప్యాకేజ్-10, GCLS వంటి వాటికి నీటి విడుదల నమోదు కాలేదు. ఆవిరి రూపంలో 135 క్యూసెక్కులు, మైనర్ బ్రాంచ్‌లకు 45 క్యూసెక్కులు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ జగిత్యాల జిల్లాలో చూపుతుంది. కొడిమ్యాల మండలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ రాజీనామా చేశారు. కొడిమ్యాల మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు రాజీనామా చేసినట్లు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరిని నిరసిస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తాము స్వంత ఖర్చులతో పనిచేశామని, కానీ గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడగలేదని, ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం మాత్రమే న్యాయం కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ, పార్టీలో కష్టపడ్డ వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పూడూరు ఖాదీ భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, చేనేత కార్మికులకు న్యాయం చేస్తానని అప్పట్లో గెలవక ముందు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదని, ప్రస్తుతం అదే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అనుసరించి మారే వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరాలనే విషయంపై త్వరలోనే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుని వెల్లడించారు. ఈనెల 20న జగిత్యాలలో జరిగే కెసిఆర్ సభలో జీవన్ రెడ్డి తో కలిసి బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందాని స్థానికులు తెలిపారు.2
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు, వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.1
- Post by Solanke Ravi4
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోసి పొలం నుండి వడ్లు జార గోడుతుండగా ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ రోడ్డు క్రిందకు పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ సీట్లో ఉన్న యువరైతు కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పంట చేతికందిన సమయంలో సంతోషించాల్సిన రైతు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.2