logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డిలో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ" నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, యువత సాధికారత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

12 hrs ago
user_Routhu srikanth
Routhu srikanth
నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
12 hrs ago

కామారెడ్డిలో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ" నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, యువత సాధికారత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కామారెడ్డిలో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ" నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, యువత సాధికారత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
    1
    కామారెడ్డిలో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా
హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ" నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, యువత సాధికారత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసు విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో సుమారు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేసింది.దేవస్థానం రికార్డుల ప్రకారం, వేములవాడ బ్రహ్మంగారి వీధికి చెందిన బై విద్యాసాగర్, సురేఖ దంపతులు సోమవారం స్వామి వారికి ఈ రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. దేవస్థానం అధికారులు ఈ గొలుసు బరువు 37 గ్రాములు, విలువ సుమారు రూ.3,50,000గా నమోదు చేశారు.ఈ సందర్భంగా దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవికి బంగారు గొలుసును అందజేయగా, దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) నవీన్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో అందించే విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించబడుతున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.
    1
    శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసు విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో సుమారు రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును విరాళంగా అందజేసింది.దేవస్థానం రికార్డుల ప్రకారం, వేములవాడ బ్రహ్మంగారి  వీధికి చెందిన బై విద్యాసాగర్, సురేఖ దంపతులు సోమవారం స్వామి వారికి ఈ రాళ్లతో కూడిన మిశ్రమ బంగారు గొలుసును కానుకగా సమర్పించారు. దేవస్థానం అధికారులు ఈ గొలుసు బరువు 37 గ్రాములు, విలువ సుమారు రూ.3,50,000గా నమోదు చేశారు.ఈ సందర్భంగా దాతలు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవికి బంగారు గొలుసును అందజేయగా, దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) నవీన్ కుమార్, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
దేవస్థానం అధికారులు దాతల సేవాభావాన్ని అభినందిస్తూ, శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో అందించే విరాళాలు దేవస్థానం అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, అలాగే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించబడుతున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    1
    కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • అక్రమ గ్యాస్ రీఫిలింగ్‌పై ఉక్కుపాదం.. సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు, రీఫిలింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నరసింహులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ రీఫిలింగ్ కారణంగా అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు లేదా రీఫిలింగ్ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    1
    అక్రమ గ్యాస్ రీఫిలింగ్‌పై ఉక్కుపాదం.. సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు
అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు, రీఫిలింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నరసింహులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ రీఫిలింగ్ కారణంగా అగ్నిప్రమాదాలు, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్ల నిల్వలు లేదా రీఫిలింగ్ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki. Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di. Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha. PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai. Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?
    1
    BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak
Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki.
Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di.
Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha.
PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai.
Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • బోధన్‌లో అర్ధరాత్రి మేకల ఫారంపై బుల్డోజర్ చర్య ఆరోపణలు బోధన్: వార్డు నం. 8లోని ఓ స్థలంలో ఉన్న మేకల ఫారాన్ని అర్ధరాత్రి మూడు JCBలతో కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఫారంలోని పలువురు మేకలు కనిపించకుండా పోయాయని తెలిపారు. బాధితుల ప్రకారం, ఘటనాస్థలికి చేరుకునే సరికి JCBలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు లేదా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
    1
    బోధన్‌లో అర్ధరాత్రి మేకల ఫారంపై బుల్డోజర్ చర్య ఆరోపణలు
బోధన్: వార్డు నం. 8లోని ఓ స్థలంలో ఉన్న మేకల ఫారాన్ని అర్ధరాత్రి మూడు JCBలతో కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఫారంలోని పలువురు మేకలు కనిపించకుండా పోయాయని తెలిపారు.
బాధితుల ప్రకారం, ఘటనాస్థలికి చేరుకునే సరికి JCBలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు లేదా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రోడ్డు రోడ్డు పనులను తక్షణమే పూర్తిచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ బెజ్జంకి మండల ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బెజ్జంకి – బేగంపేట – గూడెం – చీమలకుంటపల్లి – కొండపూర్ మార్గంలో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేయడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. బెజ్జంకి మండలం నుంచి తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సుమారు రూ.8 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఆర్&బి శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పనుల్లో గుగ్గిల్ల బ్రిడ్జి పూర్తయిందని, అలాగే బెజ్జంకి నుంచి బేగంపేట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డాంబర్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సింగిల్ రోడ్డుగా మంజూరైన ఈ పనిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీ-ఎస్టిమేట్ చేసి డబుల్ రోడ్డుగా మార్చడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఎర్త్‌వర్క్, కంకర పనులు, మధ్యంతర పనులు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న సుమారు 10 శాతం బీటీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఆ పని ఎక్కడ ఆగిందో అక్కడే ఉందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని మండల అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి, ఆర్&బి శాఖకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, బేగంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బెజ్జంకి వరకు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇటీవల బెజ్జంకి మండలానికి చెందిన ఒక విలేకరి ఈ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారని, అలాగే బేగంపేటకు చెందిన పత్తి వ్యాపారి మహేందర్ రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి తదితరులు కూడా ప్రమాదాల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందువల్ల ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి, కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిపి, మిగిలిన రోడ్డు పనులను పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నామని పాకాల మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి పది రోజులలోపు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు మరియు వివిధ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రోడ్డు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పాకాల మహిపాల్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎల శేఖర్ బాబు, రామ్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రోడ్డు రోడ్డు పనులను తక్షణమే పూర్తిచేయాలని బీఆర్ఎస్ డిమాండ్
బెజ్జంకి మండల ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బెజ్జంకి – బేగంపేట – గూడెం – చీమలకుంటపల్లి – కొండపూర్ మార్గంలో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేయడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు.
బెజ్జంకి మండలం నుంచి తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సుమారు రూ.8 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఆర్&బి శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ఈ పనుల్లో గుగ్గిల్ల బ్రిడ్జి పూర్తయిందని, అలాగే బెజ్జంకి నుంచి బేగంపేట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డాంబర్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సింగిల్ రోడ్డుగా మంజూరైన ఈ పనిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీ-ఎస్టిమేట్ చేసి డబుల్ రోడ్డుగా మార్చడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఎర్త్‌వర్క్, కంకర పనులు, మధ్యంతర పనులు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న సుమారు 10 శాతం బీటీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు.
2023 డిసెంబర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఆ పని ఎక్కడ ఆగిందో అక్కడే ఉందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని మండల అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి, ఆర్&బి శాఖకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, బేగంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బెజ్జంకి వరకు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.
ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇటీవల బెజ్జంకి మండలానికి చెందిన ఒక విలేకరి ఈ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారని, అలాగే బేగంపేటకు చెందిన పత్తి వ్యాపారి మహేందర్ రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి తదితరులు కూడా ప్రమాదాల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అందువల్ల ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి, కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిపి, మిగిలిన రోడ్డు పనులను పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నామని పాకాల మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ రోజు నుంచి పది రోజులలోపు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు మరియు వివిధ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రోడ్డు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పాకాల మహిపాల్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎల శేఖర్ బాబు, రామ్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
    2
    సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఈవో
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా దర్శనం ముగించుకుని వస్తున్న ఓ దివ్యాంగ భక్తిని పలకరించి, దర్శనం సక్రమంగా జరిగిందా, ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఆరా తీశారు. భక్తులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.అనంతరం ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాలు వెలిగించే కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులు తదితర ప్రాంతాలను పరిశీలించారు. కోడె టికెట్ల జారీ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఆలయ ప్రాంగణంలో భక్తులు కొబ్బరి కాయలు కొట్టిన అనంతరం వాటి పెంకులు, చిన్న ముక్కలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల ఇతర భక్తుల కాళ్లకు గుచ్చుకుని గాయాలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ఈవో తెలిపారు. కొబ్బరి వ్యర్థాలను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లలో వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని నిర్వహిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.మొత్తం ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఈవో రమాదేవి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.