Shuru
Apke Nagar Ki App…
SBI లో 60 ఉద్యోగాలు 🔥 జీతం ₹1,05,820 వరకు 😱 | SBI Jobs 2026 Telugu #Shorts #govtjobs #sbijobs #apply
Chandraiah Pochampally
SBI లో 60 ఉద్యోగాలు 🔥 జీతం ₹1,05,820 వరకు 😱 | SBI Jobs 2026 Telugu #Shorts #govtjobs #sbijobs #apply
More news from Jayashankar Bhupalapally and nearby areas
- 10+2 తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు1
- అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........ ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.1
- ప్రజావాణిలో ప్రజల వినతులపై పరిష్కార చర్యలు చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్లు ములుగు జిల్లాలో ప్రజావాణిలో అందిన ప్రజల వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు తెలిపిన సమస్యలను విని, వారి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీలను సంబంధిత శాఖలవారీగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ అవసరమైన వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 19 అర్జీలు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2, పింఛన్లకు సంబంధించి 2, ఉద్యోగానికి సంబంధించి ఒకటి, ఇతర సమస్యలపై 4 అర్జీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.4
- నల్లబెల్లి: తరాలు మారినా తరగని సంప్రదాయం.. కేదారేశ్వర నోము ప్రత్యేకత! కుటుంబ బంధాలకు వేదికగా దీపావళి.. పూజలు, టపాసుల సందడి.. సామూహిక భోజనాలతో పల్లెల్లో పండుగ శోభ!q నల్లబెల్లి, నవంబర్ 9:పండుగలు మారుతున్నాయి.. జీవనశైలి మారుతోంది.. ఆధునికత పరుగుల్లో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా తెలంగాణ పల్లెల్లో మాత్రం కేదారేశ్వర వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గడం లేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని మరుసటి రోజు నిర్వహించే ఈ వ్రతం తరతరాల కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతోంది. కేవలం పూజా కార్యక్రమంగానే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయత, ఐక్యతను చాటిచెప్పే వేడుకగా నిలుస్తోంది. ఈ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు జరిగే సమయంలో ఆస్తులతో పాటు కేదారేశ్వర నోము ఎవరి ఇంట్లో కొనసాగాలనే అంశం కూడా చర్చకు వస్తుంటుంది. కొన్నిచోట్ల ఈ నోము తమకే దక్కాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడం ఈ సంప్రదాయంపై వారికున్న మమకారానికి నిదర్శనం. కుటుంబంలో ఎన్ని మనస్పర్థలు, గొడవలు ఉన్నా కేదారేశ్వర వ్రతం రోజు మాత్రం వాటన్నింటినీ పక్కనపెట్టి అందరూ ఒకచోట చేరి పూజలు నిర్వహించడం విశేషం. పూజలతోనే వేడుక ముగియదు.. దీపావళి ఆనందోత్సవాల సందడిలో భాగంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అనంతరం అందరూ ఒకచోట చేరి సామూహిక భోజనాలు చేస్తూ ఆప్యాయతలను పంచుకుంటారు. దూర ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు సైతం ఈ పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత. పురాణ విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. ఈ వ్రతంలో 21 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో 21 పోగులతో తోరం తయారు చేసి పూజించడం, నైవేద్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి కేదారేశ్వర నోము అంటే కేవలం దేవుడి పూజ మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల కలయికకు, బంధుత్వాల బలానికి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక. ఆస్తులు తరతరాలుగా చేతులు మారినా.. మనసులను కలిపే ఈ నోము మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కాలం మారినా.. కుటుంబ బంధాలను కలిపే కేదారేశ్వర సంప్రదాయం మాత్రం చెరిగిపోవడం లేదు!4
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.1
- సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.. ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.1
- నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.1
- SBI లో 60 ఉద్యోగాలు 🔥 జీతం ₹1,05,820 వరకు 😱 | SBI Jobs 2026 Telugu #Shorts #govtjobs #sbijobs #apply1