పంద్రాగస్టు వేడుకలు పాత యూనిఫాంలో నేనా* ? *ఓకే రాష్ట్రం ఓకే యూనిఫామ్ ఎక్కడ* ? *రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు* . రాష్ట్ర ప్రభుత్వం 2026 - 27 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కొత్త యూనిఫాం అందిస్తామని గత BRS ప్రభుత్వం అందించిన యూనిఫామ్ నాణ్యత లేదని ఈ సంవత్సరం యూనిఫామ్స్ యొక్క కలర్ మార్చి ఒకే స్కూల్ ఓకే యూనిఫామ్ అనే విధానాన్ని తీసుకొస్తామని ఎన్నో గొప్పలు చెప్పుకున్న ఆచరణలో మాత్రం పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుపుతున్నా కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం ఏకైక లక్ష్యంతో విద్య శాఖను ముఖ్యమంత్రి స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పి 2026 - 2027 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాం అందజేస్తామని గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కానీ కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందాయని ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కొత్త యూనిఫార్మ్స్ అందలేదని పంద్రాగస్టు కు పాత బట్టలతో విద్యార్థులు వేడుకలు జరుపుకోవాల అని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు సుమారు 26 లక్షల మంది ఉన్నారని రామగుండం మండలంలో దాదాపుగా 4586 వేల మంది విద్యార్థులు ఉన్నారని ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే దానికి ప్రధాన కారణమని వారు మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆర్థిక భారం వారిపై పడకుండా 21 రకాల వస్తువుల కిట్ వారికి అందజేస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ వరకు విద్యార్థులకు ఎందుకు కిట్ అందజేయలేదు సమాధానం చెప్పాలన్నారు. పాఠశాలల విద్యార్థుల సమస్యలు ఈ విధంగా ఉంటే కళాశాల విద్యార్థులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అందజేయడంలో విఫలమైంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని విడి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఆగస్టు 15 లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందే విధంగా యుద్ధ ప్రాతిపాదించిన చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

- తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్... టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి.. దాడిలో కుడి కన్నుకు గాయాలు... గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం.. విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం.. గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం.. స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.2
- బండి సంజయ్ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు. కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం.. క్రెడిట్ కోసం బీఆర్‌ఎస్ ఆరాటం.. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ కరీంనగర్ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నేతలు ఆ క్రెడిట్ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.1
- మూఢనమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలి: జన్నారం పోలీసులు..... మూఢ నమ్మకాలకు ప్రజలు దూరంగా ఉండాలని జన్నారం మండల పోలీసులు సూచించారు. మండలంలోని కామన్ పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో చేతబడి చేశారని గుర్తించిన చెట్టును బుధవారం రాత్రి వారు పరిశీలించారు. అనారోగ్యం, తదితర కారణాలతో దయ్యాలు, భూతాల పేర్లతో భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత రోజులలో మూఢనమ్మకాలను నమ్మవద్దని వారు సూచించారు. ప్రజలు చైతన్యవంతులై మోసాలకు గురికాకుండా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కామన్ పల్లి గ్రామ సర్పంచ్ పి.శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- గుండ్లపల్లి స్టేజ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ......... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు "వందే మాతరం.. భారత్ మాతా కీ జై" అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- ప్రారంభమైన మదన పోచమ్మ దేవాలయం పైకప్పు నిర్మాణం * కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ గోదావరిఖని : మార్కండేయ కాలనీ రాజేష్ దియేటర్ ముందు నెలకొల్పిన మదన పోచమ్మ దేవాలయం మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటి నేతృత్వంలో జరుగుతున్న ఆలయ పైకప్పు (స్లాబ్) నిర్మాణానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కి తన తోడ్పాటు ఉంటుందన్నారు. అమ్మ వారు నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. అలాగే ఈ కార్యమానికి స్థానిక ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, ఆలయ కమిటి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.1
- అమావాస్య సందర్భంగా కలిసుందాం రా మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ... కరీంనగర్ జిల్లాలోని కమాన్ సర్కిల్ సమీపంలో గల సప్తగిరి ఆయిల్ స్టోర్అమావాస్య సందర్భంగా ఆనందకరి అక్షయపాత్ర, కలిసుందాం రా మిత్ర బృందం, ఎలుగూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.3
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్, గంగుల డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.2
- రామగుండం లో నలుగురు దొంగలు అరెస్టు...28 తులాల బంగారం ఏడు వేల నగదు స్వాధీనం పెద్దపల్లి జిల్లా రామగుండం మజీద్ కార్నర్ కు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7వేల స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తెలిపారు. ఈ మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి ముగ్గురు మైనర్లు, ఒక వ్యక్తి ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి, ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. ఇటీవల బసంత్ నగర్ లోని ఓ వైన్ షాప్ లో చోరీ చేసి పట్టుబడినట్లు తెలిపారు. కాగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని రామగుండం లో అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మైనర్లు కాగా ఒకరు మేజర్ ఉన్నారు. అయితే చిన్ననాటి నుండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.2