రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు.. పసుపు రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాలతో పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన పసుపును కోతలు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను హెచ్చరించారు. మార్కెట్ యార్డు అధికారులు రైతులను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి తుమ్మల వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు వచ్చిందన్నారు. 4,500 కుప్పలు (27,400 బస్తాలు) యార్డుకు చేరిందన్నారు. 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉందని చెప్పిన మంత్రి.. పసుపు రక్షణకు 1,500 టార్పాలిన్‌లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గాలులు, వర్షాలతో 70 - 80 కుప్పలు తడిశాయన్నారు. దీని కారణంగా దాదాపు 40 మంది రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన పసుపును పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డ్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.1
- నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.3
- మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- Post by V Ramarao1