Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాలువ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి దిశగా రాజకీయాలలో తనదైన పేరును గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శుభాకాంక్షలు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం 15 ఏళ్ల పాటు జనసేనాని నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
PHANI JOURNALIST
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాలువ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి దిశగా రాజకీయాలలో తనదైన పేరును గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శుభాకాంక్షలు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం 15 ఏళ్ల పాటు జనసేనాని నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసంలో జగన్ను అంబటి సురేశ్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి వివరించారు. అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.1
- *జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణంలోని 16వ వార్డు భీంనగర్‌లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యం పై స్థానికులు అగ్రహం* గద్వాల పట్టణంలోని 16వ వార్డు భీంనగర్ ఏరియాలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు తీవ్రరూపం దాల్చాయి రోడ్లనుసందులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక నివాసితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.మున్సిపాలిటీకి సంబంధించిన 10% మరియు 5% భూములు ఆక్రమణకు గురి అవుతున్నాయని స్థానిక భీంనగర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 3 షెడ్లు నిర్మించి ప్రభుత్వ స్థలాన్ని,రోడ్డును ఆక్ర మించుకున్నారని వార్డు ప్రజలు తెలిపారు మున్సిపల్ కమిషనర్ పరిశీలించినాస్పందన శూన్యం అన్నారు ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మున్సిపల్ కమిషనర్‌కు నేరుగా ఫిర్యాదు చేయడం జరిగిందన్ని కమిషనర్ స్వయంగా వచ్చి పరిశీలించి,ఇది 100% అక్రమ నిర్మాణమని వీటిని వెంటనే తొలగిస్తా మని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కమిషనర్ హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు గడిచినా మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాక్టీసింగ్ హైస్కూల్ శివాలయం ముందు ఉన్న ప్రాంతాలతో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు కూడా రోడ్లను రెవెన్యూ సందులను ఆక్రమించి కట్టడాలు, షెడ్లు, కార్ పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేశారు గద్వాల మున్సిపాలిటీలోనే అత్యధిక రెవెన్యూ తెచ్చిపెట్టే భీంనగర్ ప్రాంతంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు,కలెక్టర్ స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో 16వ వార్డు ప్రజలు, కౌన్సిలర్ మద్దతుతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.1
- బ్రేకింగ్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం నాగల్ ధిన్నే నదిలో ముసలి కలకలం, గ్రామస్థులు పట్టుకొవడం జరిగింది.1
- ఆత్మకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు: వైయస్సార్ చేసిన సేవలు మరువలేనివి ఆత్మకూరు మండలం నల్ల కాలువలో దివంగత నేత డాక్టర్ వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం శ్రీశైలం నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ శృతి వనంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1
- పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.1
- ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.1
- మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.2