Shuru
Apke Nagar Ki App…
అపరిశుభ్ర వాతావరణం ఉంటే చర్యలు జన్నారం మండల కేంద్రంలోని హోటల్లు, బేకరీలలో అపరిశుభ్ర వాతావరణము ఉంటే చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసు రామ్ హెచ్చరించారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని పలు హోటలను, బేకరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాలను ఆయన పరిశీలించారు. హోటల్లు, బేకరీలకు ప్రజలు ఎక్కువగా వస్తుంటారని, అక్కడ నాణ్యమైన తినుబండారాలను తయారు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Gourinatha p.g
అపరిశుభ్ర వాతావరణం ఉంటే చర్యలు జన్నారం మండల కేంద్రంలోని హోటల్లు, బేకరీలలో అపరిశుభ్ర వాతావరణము ఉంటే చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసు రామ్ హెచ్చరించారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని పలు హోటలను, బేకరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిసరాలను ఆయన పరిశీలించారు. హోటల్లు, బేకరీలకు ప్రజలు ఎక్కువగా వస్తుంటారని, అక్కడ నాణ్యమైన తినుబండారాలను తయారు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- యువత క్రీడలలో రాణించాలి యువత క్రీడలలో రాణించాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు, విద్యార్థులు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను నిర్వహిస్తారన్నారు.1
- भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- Post by Ravi Poreddy1
- నాను మహారాజ్1
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు1
- ట్రాక్టర్ ఆటో ఢీకొని ఒకరు మృతి బాన్సువాడ ప్రతినిధి రెవిన్యూ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా ఒకేసారి రెండు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక తరలించడానికి అనుమతులు ఇవ్వడంతో, వారు అట్టివేగంగా ట్రాక్టర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పటికే ఇసుక ట్రాక్టర్ల వల్ల, ఇసుక లారీల వల్ల బీర్కూర్, కిష్టాపూర్, కొల్లూర్, దామరించ, చించోల్లి బిచ్కుంద, జూకల్, పిట్లం, నిజం సాగర్, మద్నూర్ మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఒకటే రోజు చించొల్లి, కిష్టాపూర్ గ్రామాల మంజీరా నది నుంచి ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇవ్వడంతో, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నారు. ఎక్కువగా ఇసుక ట్రిప్పులు జరుగుతే ఎక్కువగా డబ్బులు వస్తాయని ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అతివేగంగా ట్రాక్టర్లను నడుపుతూ ప్రాణాలను తీస్తున్నారు. గురువారం రాత్రి బుడిమి నుంచి నాగారం గ్రామంలో వరి నాట్లు వేయడానికి వచ్చి తిరిగి వెళుతుండగా కొల్లూరు శివారులోని రైస్ మిల్ వద్ద 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ను అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకేసారి ఆటో బోల్తా పడి రుక్మిణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది, తీవ్ర గాయాలు కుకురైన కూలీలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నారు. ఏ గ్రామానికి చెందిన ట్రాక్టర్, డ్రైవర్ ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.2
- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్ లేదన్న సిబ్బంది ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎల్లహోడ్ తోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులకు కనీస బెడ్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు, ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని వైద్య సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ సౌకర్యం అందించడం లేదని వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అధికారులను వేడుకుంటున్నారు.1