ఆయుష్ మందుల నాణ్యత, సరఫరాపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు. అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా, బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఆయుష్ మందుల నాణ్యత, సరఫరాపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్
వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు. అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్
(NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం
చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా, బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి
ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
- ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.6
- వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం చంద్రగిరితండాలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయా బానోత్ అనురాధ సెలవు కోరగా, అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఆమె అంగన్వాడీ కేంద్రంలోనే విధులకు హాజరవుతూ సెలైన్ పెట్టించుకున్నారు. జబ్బుపడినా కనికరించకుండా విధులకు ఆదేశించడంపై స్థానికులు ఆగ్రహం.ఈ దృశ్యాలు సామాజిక మద్యంలో వైరల్ గా మారాయి.1
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు విచ్చేసి.తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం యజమాన్యం మంత్రి కొండా సురేఖ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన. మంత్రి ఎమ్మెల్యే లు జోయలుక్కస్ గోల్డ్ షోరూం నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జోయలుక్కస్ యజమాన్యం సిబ్బంది పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.1
- మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.1
- వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు. అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా, బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.5