శేకాపూర్ శివారాలోని ఒక మొక్కజొన్న పొలంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా మదనూరు మండలం శాఖాపూర్ గ్రామం బుధవారం రాత్రి శివరలోని ఒక మొక్కజొన్న పొలంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించి, మొక్కజొన్న పంట మొత్తం కాలిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. స్థానిక తహసీల్దార్లు వెంటనే స్పందించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి, మరింత నష్టం జరగకుండా నివారించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. వేసవిలో పంట వ్యర్థాలను కాల్చవద్దని, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ ఎం. డి. ముజీబ్ రైతులకు సూచించారు. గిర్దావర్ శంకర్, సర్పంచ్ తుకారాం, సీనియర్ అసిస్టెంట్ రవి, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
శేకాపూర్ శివారాలోని ఒక మొక్కజొన్న పొలంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా మదనూరు మండలం శాఖాపూర్ గ్రామం బుధవారం రాత్రి శివరలోని ఒక మొక్కజొన్న పొలంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించి, మొక్కజొన్న పంట మొత్తం కాలిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. స్థానిక తహసీల్దార్లు వెంటనే స్పందించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి, మరింత నష్టం జరగకుండా నివారించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. వేసవిలో పంట వ్యర్థాలను కాల్చవద్దని, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ ఎం. డి. ముజీబ్ రైతులకు సూచించారు. గిర్దావర్ శంకర్, సర్పంచ్ తుకారాం, సీనియర్ అసిస్టెంట్ రవి, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానం వీడ్కోలు పలికారు.సిబ్బంది తన పై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనయ్ కంట తడి పెట్టారు.అది చూసి సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు.రెండు సంవత్సరాల సమయంలోనే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యక్తి ని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యను తన సమస్యగా స్పందించారు కిరణ్మయి.దీంతో ఈ ప్రాంతం లో ఆమె తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందారు.కార్యాలయం నుండి ఆమె బయటకు వెళ్లేంతవరకు సిబ్బంది పూల వర్షం చల్లుతూ ఘనంగా వీడ్కోలు పలికారు.1
- ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం... " ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు... బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..?? కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ... కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్... కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్... జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...4
- అన్నదాత ఆవేదన...1
- కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనుల నిధుల కై రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ ని కలిసి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, షేరు,రామ్మోహన్,కళ్లెం సత్యం,కాళ్ళ గణేష్,అంజద్,భాస్కర్ గౌడ్,వాజీద్,గ్యార సాయిలు,యూనుస్,సిద్ధిఖ్,అన్వర్,చిట్టి బాబు,జావీద్,మోతి లాల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Solanke Ravi1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంబుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాది ఆలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీర నది జిల్లాలతో అభిషేకం పంచామృతాభిషేకం పట్టు వస్త్రలంకరణ పసుపు కుంకుమలతో అలంకరించారు. కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దివ్యదర్శనం కలిగించారు1
- సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు గురువారం నిర్వహించారు. జెసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. కార్యాలయంలోని ఉద్యోగులను ఏసేపి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం : మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చి ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తీరును నిరసిస్తూ అడ్లూరు ఎల్లారెడ్డి మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ (అబ్బు రెడ్డి ) ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేస్తానని ప్రగల్బాలు పలికిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాట తప్పేరన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఎమ్మెల్యే కు ఎన్ని సార్లు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారన్నారు . ఓట్ల కోసం ఎమ్మెల్యే తాను గెలవడానికి ఈ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్లను రద్దు చేస్తానని కపట ప్రేమ చూపించారన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి సాక్షిగా ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే జీవో రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు మాస్టర్ ప్లాన్, ఇండస్ట్రియల్ జోన్ రద్దు పై అసెంబ్లీలో చర్చించని ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్త శుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి జీవో అందజేయలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఎమ్మెల్యే రైతుల పాలిట శాపంగా మారారని, ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.1