Shuru
Apke Nagar Ki App…
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత గురువారం భక్తులకు దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంబుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాది ఆలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీర నది జిల్లాలతో అభిషేకం పంచామృతాభిషేకం పట్టు వస్త్రలంకరణ పసుపు కుంకుమలతో అలంకరించారు. కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దివ్యదర్శనం కలిగించారు
మెదక్ న్యూస్
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత గురువారం భక్తులకు దివ్యదర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంబుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాది ఆలయంలో గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో మంజీర నది జిల్లాలతో అభిషేకం పంచామృతాభిషేకం పట్టు వస్త్రలంకరణ పసుపు కుంకుమలతో అలంకరించారు. కుంకుమార్చన సహస్రనామార్చిన అనంతరం మంగళహారతి ఇచ్చారు ఆ తర్వాత భక్తులకు దివ్యదర్శనం కలిగించారు
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనుల నిధుల కై రాష్ట్ర ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ ని కలిసి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించి నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్, షేరు,రామ్మోహన్,కళ్లెం సత్యం,కాళ్ళ గణేష్,అంజద్,భాస్కర్ గౌడ్,వాజీద్,గ్యార సాయిలు,యూనుస్,సిద్ధిఖ్,అన్వర్,చిట్టి బాబు,జావీద్,మోతి లాల్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు గురువారం నిర్వహించారు. జెసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. కార్యాలయంలోని ఉద్యోగులను ఏసేపి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.1
- ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .1
- ముధోల్ ప్రాజెక్ట్ లో ముదురుతున్న అంగన్వాడి టీచర్స్ వివాదం... " ముధోల్ అంగన్వాడి స్కామ్" CVR NEWS కథనం పై స్పందించిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్లు... బాసర అంగన్వాడీ సెక్టర్ లోని సూరెల్లి గ్రామ అంగన్వాడి ఆయమ్మ చనిపోతే మేమంతా డబ్బులు జమచేసి కుటుంబాన్ని ఆదుకున్నాం.. అది అవినీతి ఎలా అవుతుంది..?? కొందరు అంగన్వాడి టీచర్స్ లను కలుపుకుని కావాలనే మాపై పని గట్టుకుని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శ... కార్మిక సంఘం నేతల ఆదేశాలు పాటించకుంటే, మీటింగ్ లకు హాజరు కాకుంటే ఫైన్ లు వేస్తున్నారని..! మేము ఎలాంటి కార్మిక సంఘాలలో లేమని తేల్చి చెప్పిన ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్... కలసి కట్టుగా పనిచేసి అవినీతి కి తావు లేకుండా, అంగన్వాడి లను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని తెలిపిన అంగన్వాడి టీచర్స్... జిల్లా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ అధికారిణి కి తమ వినతి పత్రాన్ని అందించిన సుమారు 170 మంది ముధోల్ ప్రాజెక్ట్ అంగన్వాడి టీచర్స్...4
- तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం : మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చి ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తీరును నిరసిస్తూ అడ్లూరు ఎల్లారెడ్డి మాజీ వార్డు సభ్యుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ (అబ్బు రెడ్డి ) ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్ జీవోను రద్దు చేస్తానని ప్రగల్బాలు పలికిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాట తప్పేరన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఎమ్మెల్యే కు ఎన్ని సార్లు విన్నవించిన పెడచెవిన పెడుతున్నారన్నారు . ఓట్ల కోసం ఎమ్మెల్యే తాను గెలవడానికి ఈ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్లను రద్దు చేస్తానని కపట ప్రేమ చూపించారన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి సాక్షిగా ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే జీవో రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు మాస్టర్ ప్లాన్, ఇండస్ట్రియల్ జోన్ రద్దు పై అసెంబ్లీలో చర్చించని ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్త శుద్ధి ఉంటే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసి జీవో అందజేయలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఎమ్మెల్యే రైతుల పాలిట శాపంగా మారారని, ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.1