logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్కూల్ బస్సును వెనకనుంచి ఢీ కొట్టిన లారీ... పలువురు విద్యార్థులకు గాయాలు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

4 hrs ago
user_Raju Paragati
Raju Paragati
పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

స్కూల్ బస్సును వెనకనుంచి ఢీ కొట్టిన లారీ... పలువురు విద్యార్థులకు గాయాలు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More news from Andhra Pradesh and nearby areas
  • సెయింట్ ఆన్స్ గర్ల్స్ షెల్టర్ హోమ్‌ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గుంటూరు (సెప్టెంబర్ 2): గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు గుంటూరు స్తంభాలగరువులోని 'సెయింట్ ఆన్స్ ఓపెన్ షెల్టర్ హోమ్ ఫర్ గర్ల్స్'ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హోమ్‌లోని బాలికలతో మాట్లాడిన ఆయన, వారికి అందుతున్న ఆహారం, వైద్యం, విద్యా సదుపాయాల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలియనితనంతో తప్పటడుగులు వేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, క్రమశిక్షణతో బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్, హోమ్ ఇన్‌ఛార్జ్ వరలక్ష్మి, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వాలంటీర్ గీతాంజలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    సెయింట్ ఆన్స్ గర్ల్స్ షెల్టర్ హోమ్‌ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
గుంటూరు (సెప్టెంబర్ 2): గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు గుంటూరు స్తంభాలగరువులోని 'సెయింట్ ఆన్స్ ఓపెన్ షెల్టర్ హోమ్ ఫర్ గర్ల్స్'ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హోమ్‌లోని బాలికలతో మాట్లాడిన ఆయన, వారికి అందుతున్న ఆహారం, వైద్యం, విద్యా సదుపాయాల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలియనితనంతో తప్పటడుగులు వేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, క్రమశిక్షణతో బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్, హోమ్ ఇన్‌ఛార్జ్ వరలక్ష్మి, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వాలంటీర్ గీతాంజలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    4 hrs ago
  • వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐 జోహార్ వైస్సార్
    1
    వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జోగి, అప్పిడి. 
ఎన్టీఆర్ జిల్లా మైలవరం. 
దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతిని మైలవరంలో బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. 
మైలవరం లోని లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద, మూడు బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
అనంతరం లక్కిరెడ్డి హనీమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.💐💐
జోహార్ వైస్సార్
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మైలవరం జనసేన పార్టీ ర్యాలీ రంగ రంగ వైభవంగా నిర్వహించారు మైలవరం జనసేన పార్టీ కార్యాలయం నుండి ఘనంగామైలవరం పుర వీధుల గుండా లాకిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నుండి మైలవరం బైపాస్ రోడ్డు నుండి నూజివీడు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి జనసేన కార్యకర్త తన షాపు వద్ద ఏర్పాటు కేకును కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామపంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామ శివారులో ఉన్న మారుతి కళ్యాణమండపం నందు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మరియు మైలవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య అధ్యక్షతన బైకులతో ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు మరియు జనసైనికులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు
    4
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మైలవరం జనసేన పార్టీ ర్యాలీ రంగ రంగ వైభవంగా నిర్వహించారు మైలవరం జనసేన పార్టీ కార్యాలయం నుండి ఘనంగామైలవరం  పుర వీధుల గుండా లాకిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నుండి మైలవరం బైపాస్ రోడ్డు నుండి నూజివీడు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి జనసేన కార్యకర్త తన షాపు వద్ద ఏర్పాటు కేకును కట్ చేసిన అనంతరం   మైలవరం గ్రామపంచాయితీ వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన అనంతరం మైలవరం గ్రామ శివారులో ఉన్న మారుతి కళ్యాణమండపం నందు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మరియు మైలవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య అధ్యక్షతన బైకులతో ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్  అక్కల రామ్మోహనరావు మరియు జనసైనికులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పాయకరావుపేటలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాయకరావు పేట క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు పోలవరం ఎడమ కాలువలోనే నిల్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు.గోదావరి జలాలకు పుష్పాలు సమర్పించి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్ తదితరులు పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకుని అందరికీ చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    1
    పాయకరావుపేటలో  ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 
పాయకరావు పేట క్రాస్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న గోదావరి జలాలకు పోలవరం ఎడమ కాలువలోనే నిల్చుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రత్యేక పూజలు చేశారు.గోదావరి జలాలకు పుష్పాలు సమర్పించి జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ, అచ్చెన్నాయుడు, కొలుసు పార్ధసారధి, ఎంపీలు విజయ్, సీఎం రమేశ్ తదితరులు పవిత్ర గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకుని అందరికీ చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • చెరుకుపల్లి మండలంలో దంచి కొడుతున్న వర్షం. రైతులకి ఉపశమనం. చెరుకుపల్లి మండలంలో బుధవారం భారీ వర్షం దంచి కొట్టింది. గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. చాలా రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ వర్షం అమృతంతో సమానంగా మారింది. ముఖ్యంగా నారుమడులు వేసి, వరి నాట్లు ప్రారంభించిన రైతులకు ఈ వాన ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో ఎండిపోతున్న పైర్లకు జీవం పోసినట్లయిందని, రాబోయే రోజుల్లో నాట్లు వేయడానికి నేల అనుకూలంగా మారుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ వర్షాభావ పరిస్థితులతో దిగులు చెందిన రైతాంగం, ఈ వర్షంతో పొలం పనులను మరింత వేగవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
    2
    చెరుకుపల్లి మండలంలో దంచి కొడుతున్న వర్షం. రైతులకి ఉపశమనం.
చెరుకుపల్లి మండలంలో బుధవారం భారీ వర్షం దంచి కొట్టింది. గడిచిన కొన్ని రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. చాలా రోజుల విరామం తర్వాత ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.ప్రస్తుతం సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు ఈ వర్షం అమృతంతో సమానంగా మారింది. ముఖ్యంగా నారుమడులు వేసి, వరి నాట్లు ప్రారంభించిన రైతులకు ఈ వాన ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరతతో ఎండిపోతున్న పైర్లకు జీవం పోసినట్లయిందని, రాబోయే రోజుల్లో నాట్లు వేయడానికి నేల అనుకూలంగా మారుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లూ వర్షాభావ పరిస్థితులతో దిగులు చెందిన రైతాంగం, ఈ వర్షంతో పొలం పనులను మరింత వేగవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    6 hrs ago
  • 1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ  MLA కందాళ ఉపేందర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 19వ డివిజన్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మినీ లారీ స్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కిలారి రోశయ్య, మేకల రవీంద్ర, చందనపు నాగరాజు, సయ్యద్ షర్బుద్ధిన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 19వ డివిజన్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మినీ లారీ స్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు కిలారి రోశయ్య, మేకల రవీంద్ర, చందనపు నాగరాజు, సయ్యద్ షర్బుద్ధిన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    5 hrs ago
  • స్కూల్ బస్సును వెనకనుంచి ఢీ కొట్టిన లారీ... పలువురు విద్యార్థులకు గాయాలు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    2
    స్కూల్ బస్సును వెనకనుంచి ఢీ కొట్టిన లారీ... పలువురు విద్యార్థులకు గాయాలు.
పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది.
మర్రిచెట్టుపాలెం నుంచి విప్పర్ల వైపు వెళ్తున్న సిబిఐటి స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.