logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో గంజాయి కేసులో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు...370 గ్రాముల గంజాయి 4 సెల్ ఫోన్ లు స్వాదీనం భూ వివాదంలో మిత్రునికి మేలు చేసేందుకు ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు యత్నించి కరీంనగర్ జిల్లాలో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ గంజాయి కేసులో ఇరుక్కుని కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు సంబంధించిన వివరాలను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రూరల్ ఏసిపి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్‌ కు మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస రెడ్డి కి మద్య భూ వివాదం ఉంది. ఈ వివాదంలో ఈగల్ టీమ్ లో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు తన మిత్రుడైన శ్రీనివాస్ కు మేలు చేసేందుకు ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలని సంకల్పించాడు. పథకం ప్రకారం గంజాయి కేసులో ఇరికించాలని తనకు తెలిసిన ఆకాష్, ఆనంద్, సదానందంతో కలిసి వరంగల్ నుంచి కిలో గంజాయి తెప్పించి అందులో కొంత శ్రీనివాస రెడ్డికి చెందిన ఇందూర్తిలోని ఫర్టిలైజర్ షాపులో పెట్టించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు పర్టిలైజర్ షాప్ లో సోదాలు నిర్వహించి అరకిలో గంజాయిని పట్టుకుని శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. గంజాయికి తనకు సంబంధం లేదని, అసలు పర్టిలైజర్ షాపులోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులతో వాదనకు దిగాడు. బిజేపికి చెందిన శ్రీనివాస రెడ్డి గట్టిగానే ఫైట్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని పోలీస్ అధికారులను కోరాడు. పోలీసులు లోతుగా విచారణ జరపగా ఈగల్ టీమ్ నాగరాజు నాటకం బయటపడిందని, సీతారాంపూర్ లోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 370 గ్రాముల గంజాయి సైతం దొరికిందని ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. నాగరాజుతో పాటు ఆయన మిత్రులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు.

5 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago

కరీంనగర్ లో గంజాయి కేసులో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు...370 గ్రాముల గంజాయి 4 సెల్ ఫోన్ లు స్వాదీనం భూ వివాదంలో మిత్రునికి మేలు చేసేందుకు ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు యత్నించి కరీంనగర్ జిల్లాలో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ గంజాయి కేసులో ఇరుక్కుని కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు సంబంధించిన వివరాలను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రూరల్ ఏసిపి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్‌ కు మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస రెడ్డి కి మద్య భూ వివాదం ఉంది. ఈ వివాదంలో ఈగల్ టీమ్ లో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు తన మిత్రుడైన శ్రీనివాస్ కు మేలు చేసేందుకు ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలని సంకల్పించాడు. పథకం ప్రకారం గంజాయి కేసులో ఇరికించాలని తనకు తెలిసిన ఆకాష్,

ఆనంద్, సదానందంతో కలిసి వరంగల్ నుంచి కిలో గంజాయి తెప్పించి అందులో కొంత శ్రీనివాస రెడ్డికి చెందిన ఇందూర్తిలోని ఫర్టిలైజర్ షాపులో పెట్టించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు పర్టిలైజర్ షాప్ లో సోదాలు నిర్వహించి అరకిలో గంజాయిని పట్టుకుని శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. గంజాయికి తనకు సంబంధం లేదని, అసలు పర్టిలైజర్ షాపులోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులతో వాదనకు దిగాడు. బిజేపికి చెందిన శ్రీనివాస రెడ్డి గట్టిగానే ఫైట్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని పోలీస్ అధికారులను కోరాడు. పోలీసులు లోతుగా విచారణ జరపగా ఈగల్ టీమ్ నాగరాజు నాటకం బయటపడిందని, సీతారాంపూర్ లోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 370 గ్రాముల గంజాయి సైతం దొరికిందని ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. నాగరాజుతో పాటు ఆయన మిత్రులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు.

More news from తెలంగాణ and nearby areas
  • మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
    2
    మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు
బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు.
"మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పటేల్MLC, TRP పార్టీ అధ్యక్షుడు నారాయణ విద్యాసంస్థల విద్యార్థుల ర్యాంకుల అడ్వటైజ్మెంట్ పై ప్రశ్నిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది చాలా బాధాకరం MLC పదవిలో ఉన్నారు మీరు కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య మరియు నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా శాసనమండలిలో నియమ నిబంధనలతో కఠిన చట్టాలను అమలు ఆచరణలోకి తీసుకొచ్చేలా ప్రశ్నించు యుద్ధం చెయ్ ప్రభుత్వం పైన శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఎదగడానికి కోసమో ప్రయత్నించకండి దయచేసి. తిట్టడం వల్ల బెదిరించడం వల్ల తాత్కాలిక ఉపశమనం కూడా దొరకదు.
    1
    నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పటేల్MLC, TRP పార్టీ అధ్యక్షుడు నారాయణ విద్యాసంస్థల విద్యార్థుల ర్యాంకుల అడ్వటైజ్మెంట్ పై ప్రశ్నిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించడం జరిగింది. ఇది చాలా బాధాకరం MLC పదవిలో ఉన్నారు మీరు కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య మరియు నారాయణ ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల అన్యాయంగా అక్రమ దోపిడీలను అరికట్టాలంటే బాధ్యతగా చట్టబద్ధంగా శాసనమండలిలో నియమ నిబంధనలతో కఠిన చట్టాలను అమలు ఆచరణలోకి తీసుకొచ్చేలా ప్రశ్నించు యుద్ధం చెయ్ ప్రభుత్వం పైన శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఎదగడానికి కోసమో ప్రయత్నించకండి దయచేసి. తిట్టడం వల్ల బెదిరించడం వల్ల తాత్కాలిక ఉపశమనం కూడా దొరకదు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    23 hrs ago
  • ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఎమ్మెల్యే గంగుల కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విమర్శించారు.బీఆర్‌ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు,రూ.5 లక్షల ఉచిత ప్రమాద భీమా,చలాన్ల రద్దు అందించామని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రకటించిన రూ.12 వేల సాయం,రూ.1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు.
    2
    ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: ఎమ్మెల్యే గంగుల
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో విమర్శించారు.బీఆర్‌ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు,రూ.5 లక్షల ఉచిత ప్రమాద భీమా,చలాన్ల రద్దు అందించామని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రకటించిన రూ.12 వేల సాయం,రూ.1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
  • అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    2
    అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు.
ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.
    user_P S REDDY
    P S REDDY
    Food Processing Company కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
  • గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..! కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    గంజాయి కేసులో టీజీఎస్‌పీ కానిస్టేబుల్ అరెస్ట్..!

కుట్రను ఛేదించిన కొత్తపల్లి పోలీసులు

భూ తగాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిని అక్రమంగా ఇరికించేందుకు కుట్ర పన్ని, సొంతంగా గంజాయి దాచి కేసు పెట్టించిన ఘటనలో కరీంనగర్ ఈగల్ టీం టీజీఎస్‌పీ కానిస్టేబుల్ మెడబోయిన నాగరాజు (35)ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, కరీంనగర్ సీతారాంపూర్ లో నివాసముంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. తోడేటి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ సివిల్ పంచాయితీ తెగకపోవడంతో, శ్రీనివాస్ రెడ్డిపై ఎలాగైనా క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపాలనే ఉద్దేశంతో తోడేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్‌లతో కలిసి కానిస్టేబుల్ నాగరాజు ఒక కుట్ర పూరిత పథకం వేశాడు. ఇందులో భాగంగా వరంగల్ నుండి గంజాయిని తెప్పించి, శ్రీనివాస్ రెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం (ఫెర్టిలైజర్ షాప్) లో సుమారు ఒక కిలో గంజాయిని దాచిపెట్టారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ రెడ్డిపై గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే, శ్రీనివాస్ రెడ్డిని ఇరికించడానికి తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని కానిస్టేబుల్ నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ విషయమై కొత్తపల్లి పోలీసులకు నమ్మదగిన సమాచారం అందడంతో, వారు కానిస్టేబుల్ నివాసంపై దాడి చేసి అతనిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 370.96 గ్రాముల గంజాయితో పాటు ఇన్ఫినిక్స్ (కాఫీ కలర్), వివో టి1ఎక్స్ (స్కై బ్లూ), రియల్ మీ 7, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 3 5జీ (స్కై బ్లూ) మోడళ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద క్రైమ్ నెంబర్ 469/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బిల్ల కోటేశ్వర్, ఎస్సై సంబమూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరవళ్ళు తొక్కుతున్న మూలవాగు...నిమ్మపల్లి ప్రాజెక్ట్ జలకళ...ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండి, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ...
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరవళ్ళు తొక్కుతున్న మూలవాగు...నిమ్మపల్లి ప్రాజెక్ట్ జలకళ...ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన  వర్షాలకు ప్రాజెక్టులకు కొత్త జీవం పోస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద ఉన్న మూలవాగు జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండి, మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి దూకుతూ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్ట్ నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. దీంతో ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు వేములవాడ మూలవాగు గుండా ప్రవహిస్తూ చివరకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రాజెక్ట్ వద్దకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్తడి ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
...
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ లో గంజాయి కేసులో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు...370 గ్రాముల గంజాయి 4 సెల్ ఫోన్ లు స్వాదీనం భూ వివాదంలో మిత్రునికి మేలు చేసేందుకు ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు యత్నించి కరీంనగర్ జిల్లాలో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ గంజాయి కేసులో ఇరుక్కుని కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు సంబంధించిన వివరాలను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రూరల్ ఏసిపి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్‌ కు మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస రెడ్డి కి మద్య భూ వివాదం ఉంది. ఈ వివాదంలో ఈగల్ టీమ్ లో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు తన మిత్రుడైన శ్రీనివాస్ కు మేలు చేసేందుకు ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలని సంకల్పించాడు. పథకం ప్రకారం గంజాయి కేసులో ఇరికించాలని తనకు తెలిసిన ఆకాష్, ఆనంద్, సదానందంతో కలిసి వరంగల్ నుంచి కిలో గంజాయి తెప్పించి అందులో కొంత శ్రీనివాస రెడ్డికి చెందిన ఇందూర్తిలోని ఫర్టిలైజర్ షాపులో పెట్టించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు పర్టిలైజర్ షాప్ లో సోదాలు నిర్వహించి అరకిలో గంజాయిని పట్టుకుని శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. గంజాయికి తనకు సంబంధం లేదని, అసలు పర్టిలైజర్ షాపులోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులతో వాదనకు దిగాడు. బిజేపికి చెందిన శ్రీనివాస రెడ్డి గట్టిగానే ఫైట్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని పోలీస్ అధికారులను కోరాడు. పోలీసులు లోతుగా విచారణ జరపగా ఈగల్ టీమ్ నాగరాజు నాటకం బయటపడిందని, సీతారాంపూర్ లోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 370 గ్రాముల గంజాయి సైతం దొరికిందని ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. నాగరాజుతో పాటు ఆయన మిత్రులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు.
    2
    కరీంనగర్ లో గంజాయి కేసులో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు...370 గ్రాముల గంజాయి 4 సెల్ ఫోన్ లు స్వాదీనం
భూ వివాదంలో మిత్రునికి మేలు చేసేందుకు ప్రత్యర్థిని గంజాయి కేసులో ఇరికించేందుకు యత్నించి కరీంనగర్ జిల్లాలో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ గంజాయి కేసులో ఇరుక్కుని కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు సంబంధించిన వివరాలను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రూరల్ ఏసిపి విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 
తోడేటి శ్రీనివాస్‌ కు మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస రెడ్డి కి మద్య భూ వివాదం ఉంది. ఈ వివాదంలో ఈగల్ టీమ్ లో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు తన మిత్రుడైన శ్రీనివాస్ కు మేలు చేసేందుకు ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలని సంకల్పించాడు. పథకం ప్రకారం గంజాయి కేసులో ఇరికించాలని తనకు తెలిసిన ఆకాష్, ఆనంద్, సదానందంతో కలిసి వరంగల్ నుంచి కిలో గంజాయి తెప్పించి అందులో కొంత శ్రీనివాస రెడ్డికి చెందిన ఇందూర్తిలోని ఫర్టిలైజర్ షాపులో పెట్టించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు పర్టిలైజర్ షాప్ లో  సోదాలు నిర్వహించి అరకిలో గంజాయిని పట్టుకుని శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. గంజాయికి తనకు సంబంధం లేదని, అసలు పర్టిలైజర్ షాపులోకి గంజాయి ఎలా వచ్చిందని  పోలీసులతో వాదనకు దిగాడు. బిజేపికి చెందిన శ్రీనివాస రెడ్డి గట్టిగానే ఫైట్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని పోలీస్ అధికారులను కోరాడు. పోలీసులు లోతుగా విచారణ జరపగా ఈగల్ టీమ్ నాగరాజు నాటకం బయటపడిందని, సీతారాంపూర్ లోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 370 గ్రాముల గంజాయి సైతం దొరికిందని ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. నాగరాజుతో పాటు ఆయన మిత్రులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.