logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కొత్తగూడెం రోడ్డు బైపాస్ నందు సింగరేణి లారీల బొగ్గుని రోడ్లపై విరజిల్లుకుంటూ పోతున్నారు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకొని సింగరేణి యాజమాన్యం రోడ్డుపై బొగ్గు పడటం వలన టూ వీలర్స్ కు వాహనదారులకు ఇబ్బందిగా తయారైంది అధికారులు దీనిపై దృష్టి సాధిస్తే బాగుంటుందని ప్రజలు వాపోతున్నారు

2 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago
45e0bf8c-a033-4734-90f9-cd92606e9db4

ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కొత్తగూడెం రోడ్డు బైపాస్ నందు సింగరేణి లారీల బొగ్గుని రోడ్లపై విరజిల్లుకుంటూ పోతున్నారు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకొని సింగరేణి యాజమాన్యం రోడ్డుపై బొగ్గు పడటం వలన టూ వీలర్స్ కు వాహనదారులకు ఇబ్బందిగా తయారైంది అధికారులు దీనిపై దృష్టి సాధిస్తే బాగుంటుందని ప్రజలు వాపోతున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • అమరావతి:కృష్ణానది పరివాహక ప్రాంతంలో దిడుగు నుంచి ఏటూరు పడవ నడిపేందుకు టెండర్ ప్రక్రియ బుధవారం జడ్పీలో పూర్తయింది.అచ్చంపేట అమరావతి మండలాల్లో టెండర్లు వేసేందుకు పదుల సంఖ్యలో ప్రజలు వచ్చారు.ఫిట్నెస్,సారంగు, ఇన్సూరెన్స్,లైసెన్స్ సంబంధిత పత్రాలు ఉన్నవారే టెండరుకు అర్హులని తెలిపారు.దిడుగు గ్రామంలో నుంచి చంద్రశేఖర్ ఒక్కరు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ అందించడంతో టెండరు దక్కించుకున్నారు.
    1
    అమరావతి:కృష్ణానది పరివాహక ప్రాంతంలో దిడుగు నుంచి ఏటూరు పడవ నడిపేందుకు టెండర్ ప్రక్రియ బుధవారం జడ్పీలో పూర్తయింది.అచ్చంపేట అమరావతి మండలాల్లో టెండర్లు వేసేందుకు పదుల సంఖ్యలో ప్రజలు వచ్చారు.ఫిట్నెస్,సారంగు, ఇన్సూరెన్స్,లైసెన్స్ సంబంధిత పత్రాలు ఉన్నవారే టెండరుకు అర్హులని తెలిపారు.దిడుగు గ్రామంలో నుంచి చంద్రశేఖర్ ఒక్కరు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ అందించడంతో టెండరు దక్కించుకున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • rampachodavaram girijana quarry workers co operative i legal by kandukur mla in rampachodavaram
    2
    rampachodavaram girijana quarry workers co operative i legal by kandukur mla in rampachodavaram
    user_Amaraneni surendra
    Amaraneni surendra
    రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా, నర్సంపేటలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలనే డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు దిగారు. రిజల్ట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విధానంలో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ నుంచి పర్మినెంట్‌గా మార్పు ప్రక్రియను పారదర్శకంగా, విద్యార్హతలకు అనుగుణంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    2
    వరంగల్ జిల్లా, నర్సంపేటలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలనే డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు దిగారు. రిజల్ట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.
కాంట్రాక్ట్ విధానంలో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ నుంచి పర్మినెంట్‌గా మార్పు ప్రక్రియను పారదర్శకంగా, విద్యార్హతలకు అనుగుణంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    1
    గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు.
రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 day ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    11 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలో తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట కార్మికులు విధుల బహిష్కరణ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఛైర్మన్ మాట్ల ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సరైన పదోన్నతులు, ప్రయోజనాలు అందలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలో తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట కార్మికులు విధుల బహిష్కరణ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డివిజన్ ఛైర్మన్ మాట్ల ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సరైన పదోన్నతులు, ప్రయోజనాలు అందలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి... రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంగళగిరి : యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించ వచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు పెద్దపీట దేశ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 22 నెలల కాలంలోనే ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. తక్షణ అనుమతులకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా నిలుస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత డీపీఆర్ లతో ముందుకొస్తే, చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు. యువతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం... ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఒక రోజు సదస్సును ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే భారత దేశ బలమని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు అన్నింటా యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల కంటే పారిశ్రామికవేత్తలుగా తోటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ, అగ్ర కులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన తొమ్మిది స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం.విశ్వ, వీసీ గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.
    1
    యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి...
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
మంగళగిరి : 
యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.  నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై 	అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించ వచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.  
ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు పెద్దపీట
దేశ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 22 నెలల కాలంలోనే ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. తక్షణ అనుమతులకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా నిలుస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత డీపీఆర్ లతో ముందుకొస్తే, చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు  సబ్సిడీ రుణాలు, ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు.
యువతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం...
ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఒక రోజు సదస్సును ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే భారత దేశ బలమని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు అన్నింటా యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల కంటే పారిశ్రామికవేత్తలుగా తోటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత తెలిపారు.  రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ, అగ్ర కులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన తొమ్మిది స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం.విశ్వ, వీసీ గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.