logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బ్రేకింగ్ న్యూస్ నరసరావుపేట నుండి వేములూరుపాడు ఇంటికి వచ్చేలోపు ఐదు లక్షల మాయం ఉల్లిపాయలు కోసం దుకాణంలోకి వెళితే ఐదు లక్షల రూపాయల చోరీ... నరసరావుపేట బైపాస్ జొన్నలగడ్డ హోల్ సేల్ ఉల్లిపాయ దుకాణంలో.. ఉల్లిపాయల కొందామని లోపలికి వెళ్లి వచ్చేలోపు స్కూటీ లో ఉన్న ఐదు లక్షల చోరీ చేసిన దుండగుడు సీసీ కెమెరాల లో నమోదైన చోరి దృశ్యాలు

7 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
7 hrs ago

బ్రేకింగ్ న్యూస్ నరసరావుపేట నుండి వేములూరుపాడు ఇంటికి వచ్చేలోపు ఐదు లక్షల మాయం ఉల్లిపాయలు కోసం దుకాణంలోకి వెళితే ఐదు లక్షల రూపాయల చోరీ... నరసరావుపేట బైపాస్ జొన్నలగడ్డ హోల్ సేల్ ఉల్లిపాయ దుకాణంలో.. ఉల్లిపాయల కొందామని లోపలికి వెళ్లి వచ్చేలోపు స్కూటీ లో ఉన్న ఐదు లక్షల చోరీ చేసిన దుండగుడు సీసీ కెమెరాల లో నమోదైన చోరి దృశ్యాలు

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    7 hrs ago
  • యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి... రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంగళగిరి : యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించ వచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు పెద్దపీట దేశ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 22 నెలల కాలంలోనే ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. తక్షణ అనుమతులకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా నిలుస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత డీపీఆర్ లతో ముందుకొస్తే, చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు. యువతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం... ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఒక రోజు సదస్సును ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే భారత దేశ బలమని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు అన్నింటా యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల కంటే పారిశ్రామికవేత్తలుగా తోటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ, అగ్ర కులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన తొమ్మిది స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం.విశ్వ, వీసీ గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.
    1
    యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి...
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
మంగళగిరి : 
యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.  నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, అనంతరం మంత్రి సవిత ప్రసంగించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుపై 	అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు మేలు కలుగజేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంతకుముందు ప్రకృతి వ్యవసాయంతో ఎలా లాభాలు ఆర్జించ వచ్చో అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఉపాధి కల్పనపై మరో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయుల పేదరికాన్ని పారదోలడానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.  
ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు పెద్దపీట
దేశ పారిశ్రామిక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టడానికి సీఎ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 22 నెలల కాలంలోనే ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే పెట్టుబడి దారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందన్నారు. తక్షణ అనుమతులకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా నిలుస్తామన్నారు. ఆసక్తి కలిగిన యువత డీపీఆర్ లతో ముందుకొస్తే, చిన్న,మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు  సబ్సిడీ రుణాలు, ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తామని మంత్రి సవిత తెలిపారు.
యువతకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం...
ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఒక రోజు సదస్సును ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే భారత దేశ బలమని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబు అన్నింటా యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల కంటే పారిశ్రామికవేత్తలుగా తోటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత తెలిపారు.  రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ, అగ్ర కులాల్లో పేదరికంతో బాధపడే వారిని ఆర్థికంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు ఆడిటోరియంలో వివిధ సంస్థలకు చెందిన తొమ్మిది స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు వారు అందిస్తున్న తోడ్పాటును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ సీఈవో ఎం.విశ్వ, వీసీ గంగాధర్ రావు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డైరెక్టర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    49 min ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు
    1
    స్థానికులకు 50 మందికి ఉద్యోగాలు ఇస్తానన్న వేదాంత యాజమాన్య వైఖరి నిరసిస్తూ నిరుద్యోగులు ప్లాంట్ వద్ద నిరసన చేపట్టారు. ఉప్పలగుప్తo మండలం ఎస్ యానం ప్లాంట్ వద్ద  అన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మొదలుపెట్టిన నిరసన కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతూనే ఉంది వేదాంత యాజమాన్యం స్పందించకపోవడంతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని నిరుద్యోగులు నినాదాలు చేశారు  యాజమాన్యం నుండి స్పష్టమైన హామీలు వచ్చే వరకు ఉద్యమం విరమించేది లేదని వారు స్పష్టం చేశారు
    user_కాశీ చక్రి
    కాశీ చక్రి
    Salesperson కాట్రేనికోన, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ​నకిరేకల్: రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యేనే అన్నదాతలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత సిగ్గుచేటని, ఇది అహంకారానికి పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నార్కట్‌పల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఓ రైతు తాను పండించిన సన్న వడ్లు కొనుగోలు చేయాలని కోరినందుకు సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, అందరూ చూస్తుండగానే సదరు రైతుపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టడం దురదృష్టకరమన్నారు. అంతటితో ఆగకుండా, తనను ఎందుకు కొట్టావని ప్రశ్నించేందుకు కారు వద్దకు వచ్చిన రైతుపై రెండోసారి దాడికి యత్నించి, కాలుతో తన్నబోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై అక్కడున్న రైతులు ఒక్కసారిగా తిరగబడటంతో ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారని (పలాయనం చిత్తగించారని) లింగయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు అడిగిన రైతులపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రైతులపై దాడికి పాల్పడిన వీరేశంను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ ధోరణులను అరికట్టి రైతులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండ్యం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, పల్లె విజయ్, గుర్రం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యేనే అన్నదాతలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత సిగ్గుచేటని, ఇది అహంకారానికి పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నార్కట్‌పల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఓ రైతు తాను పండించిన సన్న వడ్లు కొనుగోలు చేయాలని కోరినందుకు సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, అందరూ చూస్తుండగానే సదరు రైతుపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టడం దురదృష్టకరమన్నారు. అంతటితో ఆగకుండా, తనను ఎందుకు కొట్టావని ప్రశ్నించేందుకు కారు వద్దకు వచ్చిన రైతుపై రెండోసారి దాడికి యత్నించి, కాలుతో తన్నబోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై అక్కడున్న రైతులు ఒక్కసారిగా తిరగబడటంతో ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారని (పలాయనం చిత్తగించారని) లింగయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు అడిగిన రైతులపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రైతులపై దాడికి పాల్పడిన వీరేశంను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ ధోరణులను అరికట్టి రైతులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండ్యం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, పల్లె విజయ్, గుర్రం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    26 min ago
  • మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్‌కు గౌరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2020 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారా తో దాడి చేసి హత్య చేసి, అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్సై శ్రీ బి. సతీష్ , వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం మరియు పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్‌ను గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. తదుపరి, ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో కేసముద్రం సీఐ సత్యనారాయణ మరియు ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు. గౌరవ కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.30,000/- జరిమానా విధించింది. ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హరీష్‌పై అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం మరియు మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ కేసముద్రం సీఐ సత్యనారాయణ , ఎస్సై క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్‌కు గౌరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.
2020 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారా తో దాడి చేసి హత్య చేసి, అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు.
ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్సై శ్రీ బి. సతీష్ , వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం మరియు  పి. రవికుమార్  ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్‌ను గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు.
తదుపరి, ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్  ఆదేశాల మేరకు, డీఎస్పీ  తిరుపతి రావు  పర్యవేక్షణలో కేసముద్రం సీఐ  సత్యనారాయణ  మరియు ఎస్సైలు  క్రాంతి కిరణ్,  నరేష్  కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి  సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్  కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు.
గౌరవ కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.30,000/- జరిమానా విధించింది.
ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హరీష్‌పై అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం మరియు మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు.
కానీ కేసముద్రం సీఐ  సత్యనారాయణ , ఎస్సై  క్రాంతి కిరణ్  బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు.
ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • అచ్చంపేట : మండలంలో పడవ నడుపుకునేందుకు అచ్చంపేట మాదిపాడు, గింజుపల్లి, తాడువాయి, చింతపల్లి, చామర్రు గ్రామాల నుంచి పాటదారులు పాల్గొన్నారు. గుంటూరు జడ్పీహెచ్ సెక్షన్ అధికారులు టెండర్ దారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు టెండర్ ప్రక్రియ ఉంటుందని అనంతరం ఓపెన్ టెండర్ ఉంటుందని సెక్షన్ అధికారులు తెలిపారు.
    1
    అచ్చంపేట : మండలంలో పడవ నడుపుకునేందుకు అచ్చంపేట మాదిపాడు, గింజుపల్లి, తాడువాయి, చింతపల్లి, చామర్రు గ్రామాల నుంచి పాటదారులు పాల్గొన్నారు. గుంటూరు జడ్పీహెచ్ సెక్షన్ అధికారులు టెండర్ దారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు టెండర్ ప్రక్రియ ఉంటుందని అనంతరం ఓపెన్ టెండర్ ఉంటుందని సెక్షన్ అధికారులు తెలిపారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.