*మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి* *అనాది నుంచి అన్నదమ్ముల వలె మెలుగుతున్న వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం* *కొండపల్లి స్మశాన వాటిక పై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు తగదు* కొండపల్లి 5వ వార్డు కౌన్సిలర్ దయ సాగర్ *అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన,అన్ని కులాల, మతాల, వర్గాల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు* ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆలిండియా బిషప్ అసోసియేషన్, పాస్టర్స్ ఫెలోషిప్ కొండపల్లి పట్టణం కొండపల్లిలో అనాది నుండి అన్నదమ్ముల వలె మెలుగుతున్న వారి మధ్య ఉద్దేశపూర్వకంగా కొండపల్లి ప్రజల మధ్య మత విద్వేషాలు రచ్చ గొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొండపల్లి 5వ వార్డు కౌన్సిలర్ దయ సాగర్.కొండపల్లి స్మశాన వాటిక పై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం బి కాలనీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అన్ని కులాల, మతాల, వర్గాల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దయాసాగర్ మీడియాతో మాట్లాడుతూ కొండపల్లిలో అన్ని వర్గాలకు చెందిన స్మశాన వాటిక అన్ని వర్ణాలకు చెందినదిగా లీఖిత పూర్వక ఆధారాలు ఉన్నాయని అన్నారు. దీనిపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, అందులో భాగంగా కొండపల్లి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో చరిత్ర కలిగిన కొండపల్లి ప్రజల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు వైరస్ లా వ్యాపించే ప్రమాదం ఉందని దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. కేవలం కొన్ని వర్గాలను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు ఖనన కార్యక్రమాలు నిర్వహించుకుంటానన్నారు. దానిని వద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అన్నారు. పబ్బతి వారి చెరువులో 15 ఎకరాలు ఉండగా అక్రమాలకు గురయ్యాయని వాటిపై ప్రశ్నించాలని సూచించారు. ఒక వర్గం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

- జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, హెల్త్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు, ప్రభుత్వం కల్పించే పక్కా డైట్ మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ భోజనం, టిఫిన్స్, స్నాక్స్ సిద్ధం చేయాలని, పిల్లలకు, వసతి గృహాలు పాఠశాలలో భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి అట్టి నివేదికలను సమర్పించాలని సంబంధిత వార్డెన్, ప్రిన్సిపల్ను ఆదేశించారు, ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్ సమయాలలో సందర్శించి వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు, ప్రతి విద్యా సంస్థ వసతి గృహాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన కి సంబంధిత శాఖ ప్రధాన అధికారి లేదా ప్రత్యేక అధికారి వద్దనే ఉండాలని, భోజనం, సౌకర్యం తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లను, సౌకర్యాలను కల్పించాలని తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ,సానిటేషన్ లపై పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, పిల్లల యొక్క హాజరు శాతం పూర్తిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, నూతన టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తరగతులను నిర్వహించి ఉత్తమ ఫలితాలను సాధించుటకు కృషి చేయాలని తెలిపారు, పిల్లల యొక్క మానసిక, ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యత ఉండే విధంగా ప్రతి విభాగం టీచర్ ముందుకు సాగాలన్నారు, అనంతరం అప్పర్ ప్రైమర్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ ను సందర్శించి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు, మందుల స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను తనిఖీ చేశారు, హాస్పిటల్ పరిధిలోని సబ్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు, వైద్యం కోసం వచ్చే వారికి సేవలు అందించడం కోసం డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండాలని, వేసవి ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మాత, శిశు మరణాలను జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది పోలీస్ సంబంధిత విభాగాలు నిత్యం ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టాలని ఆదేశించారు, అక్రమ స్కానింగ్ లు, లింగ నిర్ధారణ పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ధైర్యం భరోసా కల్పించాలని తమ పరిధిలో ఉన్నటువంటి సేవలను వేగంగా అందించాలని సూచించారు, ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ వార్డు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయాలని, గర్భిణీ స్త్రీలను, చిన్న పిల్లలను ఇతర వ్యాధిగ్రస్తులను గమనిస్తూ ఉండాలని, సూచించారు,1
- ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని చెవిలో తమ కోరికలను చెప్పుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా: పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, సూపర్డెంట్, ఆర్‌ఎంఓలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ బలోపేతం చేయాలని తెలిపారు. ఆస్పత్రిలో ఔషధాల కొరత లేకుండా టెండర్ ప్రక్రియ చేపట్టాలని, పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు.1
- అమ్మవారిని దర్శించుకున్న వానరం కాట్రేనికోన గ్రామపంచాయతీ కాట్రేనికోనలో మంగళవారం శ్రీ బాగిత్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక వానరం వచ్చింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిందని, అనంతరం గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందని ఒక భక్తుడు చెప్పాడు. తాను తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.1
- Post by Tagore1
- మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం గ్రామ సమీపంలో పాలేరు లింకు కెనాల్ సర్వే ఉద్రిక్తతకు దారి తీసింది. మున్నేరు జలసాధన కమిటీ సభ్యులను తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సర్వేను అడ్డుకోవాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు సర్వే కొనసాగించగా, తమ భూములు ఎడారిగా మారుతాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. అనంతరం గార్ల పట్టణంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.1
- డా బీ ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన లో ఈ మధ్యకాలం లో రాత్రివెలలో దొంగలు తిరుగుతున్నారు 2-4-26 తేదినా రాత్రి 11.30 నిముషాలకు తోపుడు బండినీ దొంగలు అపహారించారు దీనిపై కాట్రేనికోన పోలీషస్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీస్ వారు దర్యాప్తు చెప్పటారు1
- జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో అనేక లోపాలు, అవకతవకలు బయటపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల పనితీరు తేటతెల్లం అయింది. 10 గంటల పాటు కొనసాగిన ఏసిబి అధికారుల తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని ఏసిబి ఇన్ స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. పన్నుల వసూళ్ళలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఏటా 14 కోట్ల 76 లక్షల ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా 50 శాతం మాత్రమే వసూలు చేశారని, హోర్డింగ్ ల పన్ను జీరోగా ఉందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా షాప్ ల ప్రాపర్టీ టాక్స్ పూర్తి స్థాయిలో వసూలు చేయలేదని, మున్సిపల్ కు చెందిన అద్దె భవనాల విషయంలో గత 18 సంవత్సరాలుగా రీ టెండర్ నిర్వహించలేదని తేలిందన్నారు. పారిశుద్ధ వాహనాల డీజీల్, రిపేర్ బిల్లుల విషయంలో అవకతవకలు జరిగాయని, మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు 5 సంవత్సరాల క్రితం మాయంకాగ, ఆ వాహనాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికి కార్యాలయంలో లేదని తెలిపారు. టౌన్ ప్లానింగ్ కు సంబంధించి LRS, బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని, జగిత్యాల టౌన్ తోపాటు శివారు గ్రామాల్లో ఫాగింగ్ సంబంధించిన బిల్లుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. కార్యాలయంకు సంబంధించిన జిఎస్టీ బిల్లుల్లో తేడాలున్నాయని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది ఫోన్ పే గూగుల్ పే లావాదేవీలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎసిబి సిఐ పూర్ణచందర్ తెలిపారు. *16 మంది కమీషనర్ లు బదిలీ* 2019 నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటి వరకు 16 మంది కమీషన్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలపై 8 మంది ఉద్యోగులు జైలు కెళ్లారు. గతంలోనూ రెండు సార్లు ఏసీబీ, రెండు సార్లు విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఏసీబీ అధికారుల సోదాలతో మరోసారి జగిత్యాల మున్సిపల్ కార్యాలయం వార్తల్లో నిలిచింది.4