Shuru
Apke Nagar Ki App…
మన్యం జిల్లాలో కుండపోత వర్షం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో భారీగా వర్షం కురుస్తోంది.సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందివర్షంతోపట్టణంలోని రహదారులుతడిసిముద్దయ్యాయి.స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Duppada Anandarao
మన్యం జిల్లాలో కుండపోత వర్షం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో భారీగా వర్షం కురుస్తోంది.సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందివర్షంతోపట్టణంలోని రహదారులుతడిసిముద్దయ్యాయి.స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- Post by Rock star1
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్న వేల చల్లని కబురు అందించిన వరుణుడు వాతావరణం ఈరోజు నుండి చల్లదనాన్ని ఇవ్వడం పర్యటాకులకు ఎంతో అహాల్లదాన్ని నింపనుంది.1
- అనపర్తి గ్రామ దేవత బాపనమ్మ తల్లి అమ్మవారి హరిద్రాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఉగాది పురస్కరించుకుని గ్రామంలో మహిళలు కలశాలతో నదీ జలాలు సేకరించి స్వయంగా అమ్మవారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏప్రిల్ 1నుంచి మూడు రోజులపాటు అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు నిర్వహించనున్నారు.1
- పండుగల అన్నిటికీ ఆది "ఉగాది" పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమినాడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడని ధర్మ గ్రంధాలు చెబుతున్నాయి. ఆ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే వసంత రుతువు ప్రారంభమవుతుంది. అంతా కొత్త పకృతి.. కొత్త కాలం.. సరికొత్త భవిష్యత్తు. అప్పుడే చిగురించిన ఆకులు, పూల సంపదలతో అలరారే చెట్లు రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. సంవత్సరం అంతా ఎక్కడ నివసిస్తాయో ఆచూకీ తెలియక మూగగా జీవించే కోయిల లు వసంత రుతువు ఆరంభమవుతుందన గానే తన తీయని గొంతు విప్పి కమ్మని రాగాలు ఆలపిస్తాయి. పచ్చని చెట్లు పూలతో... కోయిలల కుహూ కుహూ రాగాలతో వసంత రుతువులోని వాతావరణం మనసును ఆహ్లాద పరుస్తుంది. *తెలుగు సంవత్సరాలు అరవై* ఉగాదిని సంవత్సరాది,యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ప్రభావనామ సంవత్సరం నుండి క్షయ నామ సంవత్సర వరకు మొత్తం 60 సంవత్సరాలు. ప్రస్తుతం ఉన్న శ్రీ విశ్వావసు నామ సంవత్సరం బుధవారంతో ముగిసింది. గురువారం నుండి శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నాడు సంతోషంగా ఉంటే ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటామని తెలుగువారి నమ్మకం. కొత్త పనులకు ఈరోజు శ్రీకారం చుడితే అవి నిర్విఘ్నంగా పూర్తవుతాయన్నది ప్రతి ఒక్కరి విశ్వాసం. ఉగాది పండుగ రోజు ఇంటి గుమ్మాలకు మావిడాకులు కట్టి, కొత్త బట్టలు ధరించి, విఘ్నేశ్వరుని, శారదా దేవిని, గురుదేవుని, సంవత్సరాధిపతిని పూజిస్తారు. ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత తింటారు. *షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి* తీపి, కారం, పులుపు, చేదు, ఒగరు, ఉప్పు ఈ ఆరు రుచుల కలయికతో ఘన, ద్రవపదార్థంగా తయారుచేసి ఉగాది పచ్చడిని తింటారు. దీనిని తింటే పూర్ణాయుష్ణు, దేహదారుడ్యం కలుగుతుందని విశ్వాసం. ప్రాచీన సాంప్రదాయాల వెనక గొప్ప ఆరోగ్య సూత్రాలే కాదు వైద్య, ఔషధ విలువ దాగివున్నాయని చెప్పడానికి ఆంధ్రుల ఉగాది పచ్చడిని ఒక చక్కటి నిదర్శనంగా చూపవచ్చు.వేప పువ్వు, కొత్త బెల్లం, మామిడి కాయలు మొక్కలు,చింతపండు, ఉప్పు,మిరప వంటి వాటితో పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచుల సమ్మిళితమైన ఈ పచ్చడితో సుఖదుఃఖాలను ఆనాడే రుచి చూడడం ఆరంభిస్తారని దీని భావం. ఈ పచ్చడిని ఉదయం పూట తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.అందుకే వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఈ ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్యం కాపాడుకోవడానికి పూర్వీకులు నియమం చేసారు.నాటి నుండి నేటి వరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తోంది.1
- Post by SS NEWS1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంజిల్లాపరిషత్ఉన్నతపాఠశాల దండుగోపాలపురము లో గురు వారం నాడు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలుఘనంగా నిర్వహించారు. మొదటగా పురోహితులతో సరస్వతి మాత విగ్రహము వద్ద ఉగాది పూజ చేయించి, పంచాంగ శ్రవణము గావించి, విద్యార్థులకు ఉగాది పచ్చడినీ వేదపండితుల ఆశీర్వచనాలనూ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట.గంగన్న మాట్లాడుతూ ఉగాది అనేది మన తెలుగువారికి సంబంధించిన ప్రత్యేకమైన పండగనీ, తెలుగువారి నూతనసంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందనీ, ఇది ఋతువులతో, కాలచక్రంతో ముడిపడి ఉంటుందని, ఉగాది అనగా పంచాంగశ్రవణం, ఉగాదిపచ్చడి, ఏరువాక కార్యక్రమాలు ప్రధానమైన విషయాలనియు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు మనము అనుసరించాలని,తెలిపారు.2
- Post by వేముల నాగరాజు1
- మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకొని అందులో తరలిస్తున్న 70క్వింటాల్ నల్లబెల్లం,10 క్వింటల్ పట్టిక స్వాధీనం చేసుకొని బాద్యులైన గుగులోత్ సుమన్ మహబూబాబాద్, ఆరెపల్లి మధు మరియు బొల్లా విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ Ci హతీరామ్, Si తాహేర్ బాబా, మరియు కురవి Si గండ్రాతి సతీష్, Si జయకుమార్, Pc సమ్మయ్య, Pc హరిబాబు,pc నరేష్, Pc బద్రు, Pc బాబు పాల్గొన్నారు.1