Shuru
Apke Nagar Ki App…
మిరియాల తోటలో విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి..... డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని తన మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
Nava surya
మిరియాల తోటలో విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి..... డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని తన మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని తన మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.1
- విజయనగరం జిల్లా గుర్ల స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ప్రజలు ఎస్ ఎస్ ఆర్ పేటగ్రామం రైతు పెట్టుబడి సాయం సభకు వచ్చిన స్థానిక MLA కళా వెంకటరావు ను సోమవారం అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.1
- ఈరోజు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఒక విద్యార్థిని చిన్న పొరపాటు కారణంగా ఆందోళనకు గురైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రాన్ని సరిగా చూసుకోకపోవడంతో ఆమె గాజువాక హై స్కూల్ నే తన ఎగ్జామ్ సెంటర్‌గా భావించి అక్కడికి చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు కూడా అదే కేంద్రం అనుకుని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే పరీక్షా హాల్లోకి వెళ్లిన తర్వాత ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా, అది గాజువాక హై స్కూల్ సెంటర్ కాదని, అసలు పరీక్షా కేంద్రం కనితి హై స్కూల్ అని తెలియజేశారు. దీంతో విద్యార్థిని ఒక్కసారిగా కంగారు పడుతూ భయభ్రాంతులకు గురైంది. అప్పటికే పరీక్ష సమయం దగ్గర పడడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థినిని పోలీస్ వాహనంలో సరైన పరీక్షా కేంద్రం అయిన కనితి హై స్కూల్‌కు సకాలంలో తరలించారు. దీంతో ఆమె సమయానికి పరీక్షకు హాజరయ్యే అవకాశం లభించింది.3
- శ్రీకాకుళం, మార్చి 16: ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కు వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో విచారించి అర్జిదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ దొనక పృథ్వీ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎన్.కిరణ్ కుమార్, జెడ్పీ సి ఈ ఓ పి.సత్యనారాయణ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.అర్జీదారుల సమస్యలు సావధానంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నందున జాప్యంలేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జె సీ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 117 వినతులు నమోదయ్యాయి. అధికంగా రెవెన్యూ కి సంబంధించి 23 వినతులు, పంచాయతీ రాజ్ - 13, వ్యవసాయ శాఖ -13, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన)-12 దరఖాస్తులు అందాయి. *రెవెన్యూ క్లినిక్ ను సందర్శించిన జెసి* ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించిన అనంతరం జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించారు. ప్రజల నుండి వచ్చిన భూ సంబంధిత సమస్యల పరిష్కార స్థితిగతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డైరెక్టర్ బి. లవరాజ్, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ డి.పద్మావతి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి వి ఎస్ ఎస్ ఎల్ ప్రసన్న, జిల్లా పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్ కె.వి.నాయుడు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పి.సుధాకర్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి గోపి బాల, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.త్రినాథ రావు, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు సి.మోహన్ రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా,అనిత, సర్వశిక్షా అభియాన్ ఏ పి సి పి.వేణుగోపాల్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. సుధా, మెప్మా పథక సంచాలకులు ఎస్.వెంకట రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె.సూర్య ప్రకాష్, ఎస్.సి కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి.వినాయకం, జిల్లా కార్మిక శాఖ అధికారి కె.అజయ్ కార్తికేయ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యాన వన శాఖ సహాయ సంచాలకులు వర ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.4
- నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య శాఖ అధికారి కాకర్ల గౌరీ శంకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం గంగువారిసిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటూ నోటు నుంచి స్వర్గ కారుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.9
- కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అన్నదాతల సమస్యలు పరిష్కారానికి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు కావాలి... పంచ సూత్రాలు ప్రణాళిక ను ఎమ్మెల్యే ఆవిష్కరించారుమాట్లాడుతూ అన్నదాతలు నూతన యాజమాన్య పద్ధతులను పాటించి అధిక ఆదాయాలు పొందాలన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది అన్నారు. మార్చి నెలలో బరువులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, రైతులు ,పాల్గొన్నారు1
- శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈరోజు(మార్చి -17)ఉదయం 5గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ ఫెడరేషన్(సీఐటీయూ )శ్రీకాకుళం నగరకమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు. తొలగించిన అధికారుల్ని వెంటనే విధులకు తీసుకునేంతవరకు ఇలానే ఆందోళన చేపడతామని హెచ్చరించారు3
- పాడేరు మండలం లోచలిపుట్టు గ్రామంలో సోమవారం “రైతన్న సేవలో ప్రభుత్వం – ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీటీడీసీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా మూడవ విడత నగదు పంపిణీ కార్యక్రమం గురించి ఆయన రైతులకు వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు.1