ధర్మవరంలో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ: 15 నిరుపేద కుటుంబాలకు బాసట. * మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆశీస్సులతో సేవా కార్యక్రమం: మైనారిటీ కుటుంబాలకు తోఫా అందజేత. * పేద ముస్లిం సోదరులకు అండగా ధర్మవరం బీజేపీ నేతలు: రంజాన్ కానుకల పంపిణీ. ధర్మవరం, మార్చి 07: మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో, ధర్మవరం మైనారిటీ మోర్చా పట్టణ కార్యదర్శి ఎస్. దాదాపీర్ తన సహృదయంతో రంజాన్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని 15 నిరుపేద మరియు వికలాంగ మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు జింక చంద్ర ముఖ్య అతిథులుగా హాజరై, తమ చేతుల మీదుగా ఈ తోఫాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగ పూట నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నబిరసూల్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఓంప్రకాష్ గౌడ్, పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్షవలి, పట్టణ మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. ఖలీం పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు చెన్నా ఆదినారాయణ, భూషణ ఆచారి, సయ్యద్ రోషన్ జమీర్, మాలిక్ బాషా, బిళ్లే చంద్ర తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. .

- కదిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. క స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం విద్యార్థుల లో ఉన్న ప్రతిభను కనపరిచారు. ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు ఎస్.ఓ లక్ష్మీ , అన్నపూర్ణ , పి.ఇ.టి కోమల హాజరైయారు. కరాటే శిక్షణ పొందితే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు.1
- యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar1
- బద్వేలు అర్బన్, ఏప్రిల్ 03 : బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్ ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ సీఐ సీతారామిరెడ్డి,బద్వేల్ అర్బన్ ఎస్సై కొండారెడ్డి డాక్టర్ వాసుదేవా రెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్, ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రారంభించారు,ఈ ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులకు శాలువాలతో ఘనంగా వార్త స్టాప్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్,అర్బన్ రిపోర్టర్ వల్లo కొండు వెంకటరమణ మరియు కె.వి సుబ్బారావు సి,వి నాగేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది, ఈ సందర్భంగా సీఐ సీతారామి రెడ్డి,ఎస్ఐ కొండారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఎస్సై సతీష్ కుమార్,వాసుదేవా హాస్పిటల్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, ప్రసాద్ దంత వైద్యశాల నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ లు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో గత ఏడు సంవత్సరాలుగా మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషకరమన్నారు, ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బాటసారులకు, విద్యార్థులకు, డైలీ కూలీలకు, తోపుడు బండ్లు వ్యాపారస్తులకు, ఆటో వారికి దాహర్తిని తీర్చడం కన్నా గొప్ప పుణ్యకాలం మరొకటి లేదన్నారు, ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల సమాజంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎంతో కీలకమన్నారు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు, ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్న చలివేంద్రాలు ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రకు దృష్టి సామాన్య ప్రజలకు తాగునీరు అనేది అత్యవసరంగా మారిందన్నారు, మార్కెట్లో లీటర్ దాదాపు పది రూపాయలు విలువ ఉందని ఇటువంటి తరుణంలో రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛమైన మినరల్ వాటర్ కూల్ వాటర్ ద్వారా ప్రజల దాహార్తి చేర్చడం ఎంతో గొప్ప విషయం అన్నారు, ఈ ఉచిత చలివేంద్రాలు వారి దాహర్తిని తీర్చడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఆసరాగా నిలుస్తాయని పలువురు కోరారు, మరికొందరు కూడా ముందుకు వచ్చి మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తి తీర్చుట కొరకు కృషి చేయాలని వారు కోరారు, వేసవికాలంలో చలివేంద్రాల వద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉండే విధంగా చలివేంద్ర నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ ఆర్యవైశ్య వర్తక సంగం అధ్యక్షులు కే,వీ సుబ్బారావు, ఆవోపా సెక్రటరీ సీ,వీ నాగేశ్వరరావు, వల్లం కొండు రాఘవేంద్ర, అనిత్, ఖాదర్ భాషా, ఆవులేటి శేఖర్ రాయల్,ఓబులేష్, బ్రహ్మయ్య, శీలం శంకర్, తో పాటు పలువురు సహకరించిన దాతలు ఎక్సైజ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు3
- Post by K AMPAIAH ACHARI1
- పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, కారులో ఇరుకున్న నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు1
- కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.1