కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాట వారసులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ పిలుపు తాడూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ రెండో రోజు తాడూరు మండలంలోని చెర్ల ఇటిక్యాల యత్మతాపూర్ యాదిరెడ్డిపల్లి అంతారం గుంత కోడూర్ తాడూరు మండల కేంద్రంలో ఈ బైక్ ర్యాలీ తాడూరు బస్టాండ్ దగ్గర ముగించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'నీ బాంచెన్ దొరా...నీ కాల్మొక్త అంటూ దొరలు,భూస్వాములకు ఊడిగం జేసిన తెలంగాణ పేదోడిని ఆత్మగౌరవంతో నిలబెట్టి,బందూక్ చేతబట్టించి, నిరంకుశ పాలకులైన జాగీర్‌దార్లు, భూస్వాములు,పటేల్,పట్వారీలను వారి తాబేదార్లను గ్రామాల నుండి పట్టణాలకు పరుగులెత్తించిన మహత్తర పోరాటమని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1946 సెప్టెబర్ నుండి 1951 అక్టోబర్ వరకూ ఐదేండ్ల పాటు తెలంగాణలో సాగిన ఈ పోరాటం 'భూమి సమస్య'ను భారత దేశ రాజకీయ ఎజండాలోకి చేర్చింది. అన్నారు కష్టపడి సంపాదించుకున్న భూమిని ఇతరులకు పంచటమేమిటి? అనే భావజాలంతో ఉన్న పాలకులు ఈ పోరాటంతో భూమిని మేమే పంచుతాం అని ముందుకు రాక తప్పలేదు అన్నారు .38 కౌలుదారీ చట్టాలూ,ఇందిరాగాంధీ కాలంలో తెచ్చిన భూసంస్కరణల చట్టాల నుండి ఇటీవలి కాలంలో ఎన్‌టీఆర్ పాలనలో తెలుగు మాగాణ సమారాధన,రాజశేఖర్ రెడ్డి భూపంపకాలు,కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి దాకా పాలకులందరూ అమలు చేయకపోయినా 'భూమి' గురించి మాట్లాడక తప్పలేదు. అన్నారు ఇదంతా నాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలితమే.ఆ పోరాటంలో అసువులర్పించిన నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోధుల త్యాగాల ఫలితమే.నైజాం రాచరిక ప్రభుత్వం రద్దు కావాలి కోరారు ,దున్నేవానికి భూమి ఇవ్వాలి, రైతాంగానికి భూమి హక్కులు ఇవ్వాలి, వెట్టిచాకిరీ రద్దు కావాలి, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే ప్రధాన డిమాండ్లతో ఈ పోరాటం జరిగింది.ఈ పోరాట ఫలితంగా 10లక్షల ఎకరాల భూమి పంచబడింది.3వేల గ్రామాలలో ప్రజారాజ్యం ఏర్పడింది.భూమిశిస్తులు రద్దు చేయబడినాయి.వెట్టిచాకిరీ రద్దఅయింది.అప్పటి వరకూ నిర్భందంగా అమలు జరిగిన ఉర్దూ భాషలో విధ్యాబోధన రద్దు చేయబడి తెలుగు సంస్కృతి పునరుద్దరించ బడింది.అక్రమంగా రాసుకున్న అప్పుల పత్రాలు రద్దు చేయాలని కోరారు.ఇంకా అనేక ఘన విజయాలు సాధించిన చరిత్ర తెలంగాణ పోరాటానిది.నిజాం సంస్థానమంటే నేటి తెలంగాణ ప్రాంతమేగాక మాహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలు కలిసి ఉన్న ప్రాంతంగా ఉండేది.200 సంవత్సరాలుగా నిజాం వంశస్థులే ఈ ప్రాంతాన్ని పాలించారు. చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో అధికారం చేబట్టి 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయేదాకా పాలించాడు.ఈ ప్రాంతంలో 5కోట్ల 30లక్షల ఎకరాల భూమి ఉంది.దీనిలో 3కోట్ల ఎకరాలు ప్రభుత్వానికి శిస్తు చెల్లించే దివానీ భూమిగా ఉండేది.కోటి 50లక్షల ఎకరాల భూమి జాగీర్‌దార్లు, జమీందార్లు,అగ్రహారీకుల కింద ఉండేది.ఈ భూములపై శిస్తులు విపరీతంగా ఉండేవి. దివానీ భూముల కంటే 10రెట్లు ఎక్కువగా శిస్తు వసూలు చేసేవారు. శిస్తులు కట్టలేక రైతులు భూములు వదులుకోవటం జరిగేది.ఇక మరో 45లక్షల ఎకరాల భూమి నిజాం కుటుంబ స్వంత భూమిగా ఉండేది. దీనినే సర్ఫేఖాస్ భూమి అంటారు.ఇతర పేదల జీవితం కూడా దుర్బరంగా ఉండేది.వెట్టిచాకిరీ అనేది ఆనాడు సర్వత్రా అమలు జరిగిన దోపిడీ రూపం. భూస్వాములు,దొరలు,పటేల్, పట్వారీలు ఇతర పెత్తందార్ల ఇండ్లలో దళితులు పారిశుద్యపనులు ఉచితంగా చేయాలి.చెప్పులు,తోలుతో చేసే వ్యవసాయ పరికరాలు ఉచితంగానే ఇవ్వాలి. రజకులు బట్టలు ఉతకటం,పల్లకీలు, మేనాలు మోయటం ఉచితంగా చేయాలి.నేత పనివారు ఉచితంగా బట్టలు ఇవ్వాలి.గీత పనివారు వారికి కేటాయించిన చెట్లకు కల్లుగీసి పోయాలి. ఇంకా ఇతర చేతివృత్తుల వారు కూడా ఈ ఉచిత సేవలు అందించాలి. **ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏం శ్రీనివాస్ గుంపెల్లి అశోక్ పొదిలి రామయ్య గోపాల లక్ష్మణ్ అంతటి కాశన్న నాగపూర్ మధు ఏన్ పోతుల కాశన్న ఏనుపోతుల వెంకటస్వామి రజక నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు*
కమ్యూనిస్టులే తెలంగాణ సాయుధ పోరాట వారసులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ పిలుపు తాడూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ రెండో రోజు తాడూరు మండలంలోని చెర్ల ఇటిక్యాల యత్మతాపూర్ యాదిరెడ్డిపల్లి అంతారం గుంత కోడూర్ తాడూరు మండల కేంద్రంలో ఈ బైక్ ర్యాలీ తాడూరు బస్టాండ్ దగ్గర ముగించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'నీ బాంచెన్ దొరా...నీ కాల్మొక్త అంటూ దొరలు,భూస్వాములకు ఊడిగం జేసిన తెలంగాణ పేదోడిని ఆత్మగౌరవంతో నిలబెట్టి,బందూక్ చేతబట్టించి, నిరంకుశ పాలకులైన జాగీర్‌దార్లు, భూస్వాములు,పటేల్,పట్వారీలను వారి తాబేదార్లను గ్రామాల నుండి పట్టణాలకు పరుగులెత్తించిన మహత్తర పోరాటమని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1946 సెప్టెబర్ నుండి 1951 అక్టోబర్ వరకూ ఐదేండ్ల పాటు తెలంగాణలో సాగిన ఈ పోరాటం 'భూమి సమస్య'ను భారత దేశ రాజకీయ ఎజండాలోకి చేర్చింది. అన్నారు కష్టపడి సంపాదించుకున్న భూమిని ఇతరులకు పంచటమేమిటి? అనే భావజాలంతో ఉన్న పాలకులు ఈ పోరాటంతో భూమిని మేమే పంచుతాం అని ముందుకు రాక తప్పలేదు అన్నారు .38 కౌలుదారీ చట్టాలూ,ఇందిరాగాంధీ కాలంలో తెచ్చిన భూసంస్కరణల చట్టాల నుండి ఇటీవలి కాలంలో ఎన్‌టీఆర్ పాలనలో తెలుగు మాగాణ సమారాధన,రాజశేఖర్ రెడ్డి భూపంపకాలు,కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి దాకా పాలకులందరూ అమలు చేయకపోయినా 'భూమి' గురించి మాట్లాడక తప్పలేదు. అన్నారు ఇదంతా నాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలితమే.ఆ పోరాటంలో అసువులర్పించిన నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోధుల త్యాగాల ఫలితమే.నైజాం రాచరిక ప్రభుత్వం రద్దు కావాలి కోరారు ,దున్నేవానికి భూమి ఇవ్వాలి, రైతాంగానికి భూమి హక్కులు ఇవ్వాలి, వెట్టిచాకిరీ రద్దు కావాలి, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే ప్రధాన డిమాండ్లతో ఈ పోరాటం జరిగింది.ఈ పోరాట ఫలితంగా 10లక్షల ఎకరాల భూమి పంచబడింది.3వేల గ్రామాలలో ప్రజారాజ్యం ఏర్పడింది.భూమిశిస్తులు రద్దు చేయబడినాయి.వెట్టిచాకిరీ
రద్దఅయింది.అప్పటి వరకూ నిర్భందంగా అమలు జరిగిన ఉర్దూ భాషలో విధ్యాబోధన రద్దు చేయబడి తెలుగు సంస్కృతి పునరుద్దరించ బడింది.అక్రమంగా రాసుకున్న అప్పుల పత్రాలు రద్దు చేయాలని కోరారు.ఇంకా అనేక ఘన విజయాలు సాధించిన చరిత్ర తెలంగాణ పోరాటానిది.నిజాం సంస్థానమంటే నేటి తెలంగాణ ప్రాంతమేగాక మాహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలు కలిసి ఉన్న ప్రాంతంగా ఉండేది.200 సంవత్సరాలుగా నిజాం వంశస్థులే ఈ ప్రాంతాన్ని పాలించారు. చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911లో అధికారం చేబట్టి 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యాలకు లొంగిపోయేదాకా పాలించాడు.ఈ ప్రాంతంలో 5కోట్ల 30లక్షల ఎకరాల భూమి ఉంది.దీనిలో 3కోట్ల ఎకరాలు ప్రభుత్వానికి శిస్తు చెల్లించే దివానీ భూమిగా ఉండేది.కోటి 50లక్షల ఎకరాల భూమి జాగీర్‌దార్లు, జమీందార్లు,అగ్రహారీకుల కింద ఉండేది.ఈ భూములపై శిస్తులు విపరీతంగా ఉండేవి. దివానీ భూముల కంటే 10రెట్లు ఎక్కువగా శిస్తు వసూలు చేసేవారు. శిస్తులు కట్టలేక రైతులు భూములు వదులుకోవటం జరిగేది.ఇక మరో 45లక్షల ఎకరాల భూమి నిజాం కుటుంబ స్వంత భూమిగా ఉండేది. దీనినే సర్ఫేఖాస్ భూమి అంటారు.ఇతర పేదల జీవితం కూడా దుర్బరంగా ఉండేది.వెట్టిచాకిరీ అనేది ఆనాడు సర్వత్రా అమలు జరిగిన దోపిడీ రూపం. భూస్వాములు,దొరలు,పటేల్, పట్వారీలు ఇతర పెత్తందార్ల ఇండ్లలో దళితులు పారిశుద్యపనులు ఉచితంగా చేయాలి.చెప్పులు,తోలుతో చేసే వ్యవసాయ పరికరాలు ఉచితంగానే ఇవ్వాలి. రజకులు బట్టలు ఉతకటం,పల్లకీలు, మేనాలు మోయటం ఉచితంగా చేయాలి.నేత పనివారు ఉచితంగా బట్టలు ఇవ్వాలి.గీత పనివారు వారికి కేటాయించిన చెట్లకు కల్లుగీసి పోయాలి. ఇంకా ఇతర చేతివృత్తుల వారు కూడా ఈ ఉచిత సేవలు అందించాలి. **ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఏం శ్రీనివాస్ గుంపెల్లి అశోక్ పొదిలి రామయ్య గోపాల లక్ష్మణ్ అంతటి కాశన్న నాగపూర్ మధు ఏన్ పోతుల కాశన్న ఏనుపోతుల వెంకటస్వామి రజక నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు*
- జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.1
- తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నారాయణపేట: నియోజకవర్గంలో గవినర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేసిన కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రజల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే పాంచజన్య సంకల్ప సభ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.1
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4
- దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు4
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.1