గిర్నిబావి గురుకులంలో ఘనంగా 'స్ఫూర్తి' కార్యక్రమం....... వరంగల్ జిల్లా, గిర్నిబావి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం 'స్ఫూర్తి' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా, దుగ్గొండి మండల ఎంపీడీవో లెక్కల అరుంధతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, యోగా, గ్రూప్ స్టడీ, మహనీయుల జీవిత చరిత్రల అధ్యయనంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీడీవో అరుంధతి విద్యార్థులు మార్కుల కంటే నేర్చుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, డార్మిటరీలు, ఆర్వో ప్లాంట్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, ఏటీపీ రాజు, డిప్యూటీ వార్డెన్ కృపాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిర్నిబావి గురుకులంలో ఘనంగా 'స్ఫూర్తి' కార్యక్రమం....... వరంగల్ జిల్లా, గిర్నిబావి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం 'స్ఫూర్తి' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా, దుగ్గొండి మండల ఎంపీడీవో లెక్కల అరుంధతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వ్యక్తిత్వ వికాసం,
క్రమశిక్షణ, యోగా, గ్రూప్ స్టడీ, మహనీయుల జీవిత చరిత్రల అధ్యయనంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీడీవో అరుంధతి విద్యార్థులు మార్కుల కంటే నేర్చుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, డార్మిటరీలు, ఆర్వో ప్లాంట్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, ఏటీపీ రాజు, డిప్యూటీ వార్డెన్ కృపాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- వంచనగిరిలో కోటగండి మైసమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహణ... వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంచనగిరి గ్రామం నుంచి శ్రీ శ్రీ శ్రీ కోటగండి మైసమ్మ తల్లి ఆలయం వరకు బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు హాజరై భక్తులతో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు వెయ్యి మంది భక్తులు బోనాలతో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గీసుగొండ పోలీసులు, క్యూఆర్టీ సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రిస్తూ భక్తులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీసు శాఖ, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తుల సమన్వయంతో బోనాల మహోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసినట్లు గీసుగొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపారు.1
- కాంగ్రెస్ సర్కార్ లో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు ఉరేసుకుని సచ్చే పరిస్థితి వచ్చిందని ఓ రైతు ఆందోళనతో అన్నారు. ఇది దండగ పాలన.. రేవంత్ రెడ్డి వచ్చి అడిగినా ఆయనకు ఓటేయ్యం అని నికార్స్ గా చెప్పాడు. నీళ్లు, యూరియా సరైన సమయానికి అందక, రాక, లేక పంటలే పండట్లేదు.. అంతో ఇంతో పండిన పంటను ప్రభుత్వం కొనడము లేదు, దీనికి తోడు ప్రకృతి సహకరించక, కష్టపడి అంతో ఇంతో పంటలు పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడి అట్లా... నష్టపోవడం జరుగుతుంది. మా రైతుల బాధలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీర్చలేదు తీరుస్తారో... లేదో ఆ నమ్మకము కూడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.1
- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- హైదరాబాద్ లో రేపు అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో 👌మెగా job మేళా. 100 ఉద్యోగాలు. #appolopharmacy #jobmela1
- గిర్నిబావి గురుకులంలో ఘనంగా 'స్ఫూర్తి' కార్యక్రమం....... వరంగల్ జిల్లా, గిర్నిబావి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం 'స్ఫూర్తి' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా, దుగ్గొండి మండల ఎంపీడీవో లెక్కల అరుంధతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, యోగా, గ్రూప్ స్టడీ, మహనీయుల జీవిత చరిత్రల అధ్యయనంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీడీవో అరుంధతి విద్యార్థులు మార్కుల కంటే నేర్చుకోవడంపై ఎక్కువ శ్రద్ధ చూపాలని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, డార్మిటరీలు, ఆర్వో ప్లాంట్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఓదెల మల్లయ్య, ఏటీపీ రాజు, డిప్యూటీ వార్డెన్ కృపాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.2
- ప్రియ స్నేహితులారా ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఆయనకు కృపా క్షేమము సమాధానం నెమ్మది ప్రశాంతత మీ జీవితంలో కుమ్మరించబడును గాక గాడ్ బ్లెస్స్ యు1