Shuru
Apke Nagar Ki App…
పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలి : ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి... పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృత్ పటేల్, పార్టీ మండల సెక్రటరి జిడ్డు మల్లయ్య, జనరల్ సెక్రటరీ ఢగే దిగంబర్, సెక్రటరీ రమేష్ పటేల్ ను దేగాం లోని స్వగృహం లో ఆయన సన్మానించారు. బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, నాయకులు ఉన్నారు.
RP
పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలి : ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి... పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృత్ పటేల్, పార్టీ మండల సెక్రటరి జిడ్డు మల్లయ్య, జనరల్ సెక్రటరీ ఢగే దిగంబర్, సెక్రటరీ రమేష్ పటేల్ ను దేగాం లోని స్వగృహం లో ఆయన సన్మానించారు. బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, నాయకులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలి : ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి... పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృత్ పటేల్, పార్టీ మండల సెక్రటరి జిడ్డు మల్లయ్య, జనరల్ సెక్రటరీ ఢగే దిగంబర్, సెక్రటరీ రమేష్ పటేల్ ను దేగాం లోని స్వగృహం లో ఆయన సన్మానించారు. బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, నాయకులు ఉన్నారు.1
- కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బోధన్, (సెప్టెంబర్ 2 ): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆరోపించారు.బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ అమీర్ మాట్లాడుతూ, ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని గ్యారంటీ కార్డుల్లో హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. మహిళలకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ధర్నా సందర్భంగా కార్యకర్తలు “దొంగల రాజ్యం – దోపిడీ రాజ్యం – కాంగ్రెస్ రాజ్యం” అంటూ నినాదాలు చేయడంతో అంబేద్కర్ చౌరస్తా మారుమోగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండల నాయకులు సంజీవ్, శ్రీరామ్, నర్సింగ్ రావు, అబ్బన్న, భూమారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు అశోక్ రెడ్డి, ముషీర్ భాయ్, మోబిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి! రాకాశీపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో సోదాలు.. నకిలీ ధృవపత్రాల ఆరోపణలపై ఇద్దరు అదుపులో! బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. పట్టణంలోని రాకాశీపేట్‌లో ఉన్న సహారా మీ సేవ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేసి సోదాలు నిర్వహించారు. నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ఆరోపణలపై ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బోధన్ పట్టణంలోని రాకాశీపేట్‌లో ఉన్న సహారా మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులు మరియు ఇతర వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ఆరోపణలపై వసీం, ముక్రం అనే ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ ధృవపత్రాలు ఎలా తయారయ్యాయి..? వాటి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది..? వాటిని ఏ అవసరాల కోసం ఉపయోగించారు..? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతుండగా.. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.1
- వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో విఫలం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు బీఆర్ఎస్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజం బాన్సువాడ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2,500 సాయం ఎక్కడ? మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. బాన్సువాడ బస్టాండ్ పరిసరాల్లోని దుకాణదారులు, పెళ్లయిన మహిళలు, వృద్ధులు తదితరులను కలిసి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు తెలుసుకున్నామని, పలువురు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాగోలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా హామీని విస్మరించారు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బాజిరెడ్డి విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వృద్ధుల పింఛన్ రూ.4 వేలకు పెంపు ఏమైంది? వృద్ధులకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జుబేర్ ,మోరిల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, రమేష్, రత్నకుమార్, ధర్మతేజ, నవీన్ , సాయిలు, మోచి గణేష్, బాడీ శ్రీను, చందర్, ఖలీల్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.4
- కారు మబ్బుల కనిపించనీ మేఘాలు వర్ష సూచన లేదు కప్పటాలియ్ ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు వర్షకనిపించడం లేదు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎదిరిచూపులు వర్షం రాదు పంట పండదు అన్నదాతకు అన్ని కష్టాలే వ3
- ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* *ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను వంచించే పాలన కొనసాగుతుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను చెల్లించాలని లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు.గ్రామీణ ప్రాంతాలు నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ప్రభుత్వం ఫీజుబకాయలు ఇస్తుందన్న నమ్మకంతో ఉచిత విద్యను అందజేసిన కళాశాలలకు బకాయిలను ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని గమనించి ఫీజుబకాయలను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతే రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్ లు పాల్గొనడం జరిగింది.1
- కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!1
- *ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలిరాష్ట్రస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య *ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి* *ఎస్సి, ఎస్టీ కేసుల రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి* *పౌరహక్కుల దినోత్సవాన్ని తప్పకుండా నిర్వహించాలి* ఎస్సి,ఎస్టీ ఉద్యోగులతో సానుకూలంగా వ్యవహరించాలి మానవీయ ఎకోణంలో సేవలు అందించాలి రాష్ట్రస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీలో సమీక్ష సమావేశం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు కే.లక్ష్మి నారాయణ లుజిల్లా పర్యటనకు రాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ డివి శ్రీనివాసరావు స్వాగతం పలికి.. పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ శ్రీనివాసరావు, కమిషన్ సభ్యుడు కే .లక్ష్మీ నారాయణ తో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న పథకాలు, సంక్షేమం, అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, కులాంతర వివాహాల ఆర్థిక చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ కార్డు కలిగిఉన్న ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న పని వివరాలను అధికారుల ద్వారా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఛార్జ్ షీట్ దాఖలు వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదయిన కేసుల దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేవిధంగా చూడాలని వివరించారు. ప్రతినెలా చివరి వారంలో మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ సమావేశాల్లో పాల్గొని, ప్రజల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు, చట్టాల గురించి అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజలకు మానవీయ కోణంలో సేవలు అందించాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఏవైనా అభివృద్ధికి సంబంధించి నిధులు పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల అయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్నతితో పాటు, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లోని పారిశుధ్య కార్మికులకు ఎస్ బీ ఐ బ్యాంక్ ఖాతాలు తీయించాలని, దీంతో కార్మికులకు భీమా సౌకర్యం ఉందని తెలిపారు. *జిల్లా కలెక్టర్ కు అభినందన* జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సేవలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అభినందించారు. జిల్లా కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలకు అందిస్తున్న ఉత్తమ సేవలను కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు. *కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం* ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు క్షేత్రస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పాఠశాల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ, ప్రతి రోజూ కామన్ మెనూ అమలు చేస్తూ విద్యా బోధన సాగిస్తున్నా మన్నారు. అన్ని విద్యాలయాల్లో ప్రత్యేక అధికారులను నియమించి తనిఖీ చేయిస్తూ.. విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చూస్తున్నామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటిక ప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, కులాంతర వివాహాల ఆర్థిక సహకారం, అంబేద్కర్ ఓవర్సీస్ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు తెలియజేశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. వివిధ దశల్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం కలిగేలా చూస్తామని అన్నారు. కేసుల దర్యాప్తు పారదర్శకంగా చేపడతామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంబదాసు రాజేశ్వర్ , డీఎఫ్ఓ జో జి,జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్డీఓలు రమాదేవి, బవయ్య , రామకృష్ణ లు, డీఎస్పీలు ప్రసన్నకుమార్ , నరేందర్ , వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు సింధు, విజయ లక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు,వివిధ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1