బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి! రాకాశీపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో సోదాలు.. నకిలీ ధృవపత్రాల ఆరోపణలపై ఇద్దరు అదుపులో! బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. పట్టణంలోని రాకాశీపేట్‌లో ఉన్న సహారా మీ సేవ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేసి సోదాలు నిర్వహించారు. నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ఆరోపణలపై ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బోధన్ పట్టణంలోని రాకాశీపేట్‌లో ఉన్న సహారా మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులు మరియు ఇతర వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ఆరోపణలపై వసీం, ముక్రం అనే ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ ధృవపత్రాలు ఎలా తయారయ్యాయి..? వాటి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది..? వాటిని ఏ అవసరాల కోసం ఉపయోగించారు..? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతుండగా.. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి! రాకాశీపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో సోదాలు.. నకిలీ ధృవపత్రాల ఆరోపణలపై ఇద్దరు అదుపులో! బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. పట్టణంలోని రాకాశీపేట్‌లో ఉన్న సహారా మీ సేవ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేసి సోదాలు నిర్వహించారు. నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ఆరోపణలపై ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బోధన్ పట్టణంలోని రాకాశీపేట్‌లో ఉన్న సహారా మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులు మరియు ఇతర వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ఆరోపణలపై వసీం, ముక్రం అనే ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నకిలీ ధృవపత్రాలు ఎలా తయారయ్యాయి..? వాటి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది..? వాటిని ఏ అవసరాల కోసం ఉపయోగించారు..? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతుండగా.. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. బోధన్‌లో మీ సేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
- రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు.దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు.భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. చిత్తశుద్ధితో పనులు చేయాలి రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- *రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థుల బస్ సమస్యకు పరిష్కారం చూపిన కోరుట్ల ఏమ్మెల్యే రెండు రోజుల క్రితం బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ వెంటనే స్పందించారు. కోరుట్ల ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో మాట్లాడి విద్యార్థుల కోసం అదనంగా బస్‌ను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు… ఈ మేరకు ఈరోజు అదనపు బస్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా విద్యార్థులతో కలిసి కోరుట్ల నుంచి కల్లూరు మోడల్ స్కూల్ వరకు బస్‌లో ప్రయాణించారు… విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే సంజయ్ గారికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ గారు తెలిపారు..1
- సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.1
- రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన మెదక్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పార్టీ పిలుపులో భాగంగా రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- 1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2
- ఈరోజు ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం ఆలయ ఈవో మెదక్ జిల్లాలో స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం వెకువ జమున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జిల్లాలతో. అభిషేకం నిర్వహించారు పట్టు వస్త్రాలంకరణ పసుపు కుంకుమల అందంగా అలంకరించారు వివిధ రకాల పుష్పాలచే పూల మాలలు ధరింపజేశారు కుంకుమార్చన సహస్రనామార్చన అనంతరం మంగళహారతి చారు నిత్య నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు దివ్యదర్శనం కలిగించారు1
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై 420 హామీల కు సంబంధించి 420 ఫీట్ల ప్లేక్షిని ముద్రించి నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలను అమలు చేయడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 420 ఫీట్ల ప్లెక్సీ పై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్లెక్సీ పై ముద్రించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ కొరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని అలవికాని హామీలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కుటుంబ సభ్యుల ఎదుగుదల ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.4
- జన్న సిరిసిల్ల జిల్లా. *సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.* *సైబర్ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.* *సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. *వినాయకుడి బోధనలతో సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. *జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.* విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. *ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...* “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.4