Shuru
Apke Nagar Ki App…
కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!
MD. YOUSUF ALI KHAN
కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!
More news from తెలంగాణ and nearby areas
- “పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”1
- కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థుల బస్ సమస్యకు పరిష్కారం చూపిన కోరుట్ల ఏమ్మెల్యే రెండు రోజుల క్రితం బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ వెంటనే స్పందించారు. కోరుట్ల ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో మాట్లాడి విద్యార్థుల కోసం అదనంగా బస్‌ను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు… ఈ మేరకు ఈరోజు అదనపు బస్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా విద్యార్థులతో కలిసి కోరుట్ల నుంచి కల్లూరు మోడల్ స్కూల్ వరకు బస్‌లో ప్రయాణించారు… విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే సంజయ్ గారికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ గారు తెలిపారు..1
- రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు.దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు.భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. చిత్తశుద్ధితో పనులు చేయాలి రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- *రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- గూడెం దేవాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, యజ్ఞ హోమాలు...... దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాలు నిర్వహించారు. కాగా గురువారంతో దేవాలయంలో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయని ఈవో శ్రీనివాస్ తెలిపారు.1
- సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.1
- కారు మబ్బుల కనిపించనీ మేఘాలు వర్ష సూచన లేదు కప్పటాలియ్ ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు వర్షకనిపించడం లేదు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎదిరిచూపులు వర్షం రాదు పంట పండదు అన్నదాతకు అన్ని కష్టాలే వ3
- కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!1