logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గూడెం దేవాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, యజ్ఞ హోమాలు...... దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాలు నిర్వహించారు. కాగా గురువారంతో దేవాలయంలో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయని ఈవో శ్రీనివాస్ తెలిపారు.

9 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
9 hrs ago

గూడెం దేవాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, యజ్ఞ హోమాలు...... దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాలు నిర్వహించారు. కాగా గురువారంతో దేవాలయంలో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయని ఈవో శ్రీనివాస్ తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!
    1
    కల్వగడ్డ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? | ఉడకని అన్నం.. మెనూలో వున్నా కూర లైవ్ లో మాయం!
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    46 min ago
  • రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పాఠశాలల్లో పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష **పెండింగ్ పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి** **కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి** **అల్లూరు ,యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పెంచాలి** **లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలి**.. రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. బుధవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన *జిల్లా కలెక్టర్* పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను పరిశీలించారు. *రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, సంజయ్ నగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, అల్లూరు ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ నరసింహపురం (న్యూ మారేడుపాక), వీర్లపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, చైతన్యపురి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, 46వ డివిజన్ శాంతినగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలను* పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, పాఠశాల భవనాల పరిస్థితి, మరమ్మతు పనులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న కిచెన్ షెడ్లు, ఇతర మరమ్మతు పనులు, మరుగుదొడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెల రోజుల్లోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం *రామగుండం మండలంలోని అల్లూరు యూపీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న ఓపీ సేవలు, వైద్యుల అందుబాటు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకొని స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం *లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను* పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వివరించారు. రహదారి పనుల పురోగతిని పరిశీలించిన పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్‌సీ డా.దివేన, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
    1
    రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష
పాఠశాలల్లో పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
**పెండింగ్ పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి**
**కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలి**
**అల్లూరు ,యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను పెంచాలి**
**లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలి**..
రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు. 
బుధవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన *జిల్లా కలెక్టర్* పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు యూపీహెచ్‌సీ, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పనులను పరిశీలించారు.
*రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, సంజయ్ నగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, అల్లూరు ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ నరసింహపురం (న్యూ మారేడుపాక), వీర్లపల్లి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, చైతన్యపురి ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల, 46వ డివిజన్ శాంతినగర్ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలను* పరిశీలించారు.
ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,*  పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, పాఠశాల భవనాల పరిస్థితి, మరమ్మతు పనులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని  ప్రారంభించారు.
పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్న కిచెన్ షెడ్లు, ఇతర మరమ్మతు పనులు, మరుగుదొడ్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నెల రోజుల్లోగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.
అనంతరం *రామగుండం మండలంలోని అల్లూరు యూపీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న ఓపీ సేవలు, వైద్యుల అందుబాటు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఎన్‌సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకొని స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం *లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను* పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను  వివరించారు. రహదారి పనుల పురోగతిని పరిశీలించిన పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని  సూచించారు.
పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.
ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్‌సీ డా.దివేన, ఆర్‌అండ్‌బీ ఏఈ జావిద్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • *రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్‌ చైర్మన్‌ హోదాలో జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్‌ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    2
    *రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి*

*ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్*

*ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ,  వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు.
ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. 
ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. 
తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
*రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి*
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు.
దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు.
ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు.  బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. 
ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్‌ చైర్మన్‌ హోదాలో జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు.
భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్‌ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. 
ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు.
*చిత్తశుద్ధితో పనులు చేయాలి*
రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. 
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. 
అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. 
త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు.
*ఉన్నతాధికారుల సూచనల మేరకు..*
.
ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.
సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 02 :– *అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్* *ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు *పత్రికా ప్రకటన* * *దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం* *ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం* *నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం* *సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు సంప్రదించాలి* *ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. *వివరాలలో* ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ (25) S/o హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్‌పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్‌లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో syedsameer4780 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా Raj Led Mumbai పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, Majisa Air Express ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు. ఆగస్టు 22న సమీపంలోని Majisa Air Express కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది . బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది. *అరెస్ట్ చేసిన నిందితుడు:* ప్రకాశ్ కుమార్ (22) S/o హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. స్వాధీనం చేసుకున్న ఆస్తి: 🔹 రూ 1 లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు, ఈరోజు స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా,
సెప్టెంబర్ 02 :–

*అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్*

*ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు
*పత్రికా ప్రకటన*
*
*దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం*
*ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం*
*నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం*
*సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు సంప్రదించాలి*
*ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా  పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
*వివరాలలో*
ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ (25) S/o హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్‌పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్‌లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు.
గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో syedsameer4780 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా Raj Led Mumbai పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు.
వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, Majisa Air Express ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు.
ఆగస్టు 22న సమీపంలోని Majisa Air Express కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది .
బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
*అరెస్ట్ చేసిన నిందితుడు:* 
ప్రకాశ్ కుమార్ (22) S/o హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
స్వాధీనం చేసుకున్న ఆస్తి:
🔹 రూ 1 లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు,
ఈరోజు స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • కవితమ్మ మీద సోషల్ మీడియా లో అనుచిత పోస్టలు పెట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలి.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ పెట్టిన వారిమీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ లోని ఒకటోవ పోలిస్ స్టేషన్ లో జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో పోలిసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని కవితమ్మ మీద సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, మరియు X (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపులలో అత్యంత అసభ్యకరమైన, అవమానకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె అనిల్ మీద తక్షణమే చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ‌చేయడం జరిగిందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళ నాయకురాలి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి కవితమ్మ గౌరవాన్ని ప్రతిష్టను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళలోకానికి జరిగిన అవమానంగా భావించాలని. కానిస్టేబుల్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు అన్నారు. పవిత్రమైన పోలిస్ ఉద్యోగంలో ఉన్న అనిల్ ప్రజలకు చట్టపరంగా రక్షణ, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఈ విధంగా ఒక మహిళా రాజకీయ నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం పైన అతడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవ్వరూ అనేది కూడ తేల్చాలి. పోలీస్ శాఖ కూడ అతడి మీద శాఖాపరమైన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, మనకోండుర్ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా పార్టీ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, యండి హుస్సేన్, యండి రాజీ, మడిపల్లి వినీత్, బాండారి అభిరామ్, జిల్లా మహిళ నాయకురాలు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ అకాష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కవితమ్మ మీద సోషల్ మీడియా లో అనుచిత పోస్టలు పెట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలి.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ పెట్టిన వారిమీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ లోని ఒకటోవ పోలిస్ స్టేషన్ లో జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్  ఆద్వర్యంలో పోలిసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని కవితమ్మ మీద సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, మరియు X (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపులలో అత్యంత అసభ్యకరమైన, అవమానకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె అనిల్ మీద తక్షణమే చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ‌చేయడం జరిగిందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్  అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళ నాయకురాలి మీద  అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి కవితమ్మ గౌరవాన్ని ప్రతిష్టను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళలోకానికి జరిగిన అవమానంగా భావించాలని. కానిస్టేబుల్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు అన్నారు. పవిత్రమైన పోలిస్ ఉద్యోగంలో ఉన్న అనిల్ ప్రజలకు  చట్టపరంగా రక్షణ, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఈ విధంగా ఒక మహిళా రాజకీయ నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం పైన అతడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవ్వరూ అనేది కూడ తేల్చాలి. పోలీస్ శాఖ కూడ అతడి మీద శాఖాపరమైన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు
గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ  ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, మనకోండుర్  నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా పార్టీ నాయకులు  రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, యండి హుస్సేన్, యండి రాజీ, మడిపల్లి వినీత్, బాండారి అభిరామ్, జిల్లా మహిళ నాయకురాలు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ అకాష్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • వైఎస్సార్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : అనిల్‌కుమార్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు తెలంగాణ బెజ్జంకి అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద 17వ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీనవర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.
    1
    వైఎస్సార్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : అనిల్‌కుమార్‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు తెలంగాణ బెజ్జంకి అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద 17వ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీనవర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    10 hrs ago
  • ప్రశ్నిస్తున్న రామగుండం., కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య ?*బీజేపీ వారం రోజుల కార్యచరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి *సోమారపు లావణ్య* గారి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం 8 ఇంక్లైన్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన 14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప- రాములు గారికి,18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి గారికి 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల గారికి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని సరైన రీతిలో అమలు చేయలేదని ఆరోపించారు. 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన అసలైన 420 కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికే *ప్రశ్నిస్తున్నరామగుండం* పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు &మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, -సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్ ,కొమ్మ శ్రీనివాస్ యాదవ్,అరిగేలా శ్రావణ్ యాదవ్ ,పొట్ల వెంకటేష్,మారేపెల్లి శ్రీనివాస్,అంకం కుమార్, పంగ రవి,బోటుకు మల్లేష్ ,పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్ ,రాజేష్ నాయక్,నాగేందర్,ఎడ్లపురం రమేష్, నారీ,కుందరపు సత్యనారాయణ,ఇల్లందులా మహేష్, భాస్కర్,క్రాంతి,పొట్ల సాయితేజ,శాంతిరాజ్, వివేక్,సాయికుమార్,మహిళా నాయకురాళ్లు,పానుగంటి అంజలి,కరుపాకుల మాధవి గార్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రశ్నిస్తున్న రామగుండం., 
కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి సోమారపు లావణ్య
?*బీజేపీ వారం రోజుల కార్యచరణలో భాగంగా
కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యలపై నిలదీసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి *సోమారపు లావణ్య* గారి ఆధ్వర్యంలో
రామగుండం నియోజకవర్గం 8 ఇంక్లైన్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన     14వ డివిజన్ కార్పొరేటర్ బడావాత్ శంకర్ నాయక్ గారికి, 17వ డివిజన్ కార్పొరేటర్ అనుము స్వరూప- రాములు గారికి,18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి గారికి 19వ డివిజన్ కార్పొరేటర్ మారెల్లి సుశీల గారికి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు ₹2,500 మహాలక్ష్మి పథకం, తులం బంగారం, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు వంటి ఏ ఒక్క హామీని సరైన రీతిలో అమలు చేయలేదని ఆరోపించారు. 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన అసలైన 420 కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికే *ప్రశ్నిస్తున్నరామగుండం* పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని, 8 ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాతంగి రేణుక, సీనియర్ నాయకులు &మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, -సుశీల, నాయకులు కన్నూరి భాస్కర్ ,కొమ్మ శ్రీనివాస్ యాదవ్,అరిగేలా శ్రావణ్ యాదవ్ ,పొట్ల వెంకటేష్,మారేపెల్లి శ్రీనివాస్,అంకం కుమార్, పంగ రవి,బోటుకు మల్లేష్ ,పొట్ల శశాంక్, మెరుగు శ్రీనివాస్ ,రాజేష్ నాయక్,నాగేందర్,ఎడ్లపురం రమేష్, నారీ,కుందరపు సత్యనారాయణ,ఇల్లందులా మహేష్, భాస్కర్,క్రాంతి,పొట్ల సాయితేజ,శాంతిరాజ్, వివేక్,సాయికుమార్,మహిళా నాయకురాళ్లు,పానుగంటి అంజలి,కరుపాకుల మాధవి గార్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • జన్న సిరిసిల్ల జిల్లా. *సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.* *సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.* *సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్‌ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. *వినాయకుడి బోధనలతో సైబర్‌ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.* తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్‌ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్‌ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. *జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.* విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. *ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...* “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్‌ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    జన్న సిరిసిల్ల జిల్లా.

*సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.*

*సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.*

*సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.*
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు.
అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు.
సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. 
అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్‌ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు.
సైబర్‌ మోసానికి గురైన వెంటనే  భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
*వినాయకుడి బోధనలతో సైబర్‌ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.*
తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్‌ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్‌ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు.
*జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.*
విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు  అవగాహన కల్పించారు.
*ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...*
“Prevention is Better than Cure” అనే విధంగా సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్‌ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్,  కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇవ్వకపోతే కాంగ్రెస్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తావా? సీఎం రేవంత్‌కు జోగు రామన్న సవాల్ ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.500 గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా అమలు చేసి చూపిస్తే మాజీ మంత్రిగా తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదే విధంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించే బాధ్యత తీసుకుంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ‘420 అడుగుల కాంగ్రెస్ 420 హామీలు’ అనే ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడని అన్నారు. అలాంటి ఉద్యమ నాయకుడిపై దొంగ సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు పెన్షన్లు, విద్యార్థులకు స్కూటీలు, రూ.4 వేల పెన్షన్, వికలాంగుల పెన్షన్లు తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 13 గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను జోగు రామన్న వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, సాజి తోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్ అన్నెలా, ప్రమోద్ రెడ్డి, బోడగం మమత, పర్వీన్ నిఖిలేష్, సేవ్వా జగదీష్, ఫెరోజ్, దమ్మపాల్ వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.
    1
    రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

ఇవ్వకపోతే కాంగ్రెస్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తావా? సీఎం రేవంత్‌కు జోగు రామన్న సవాల్

ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.500 గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా అమలు చేసి చూపిస్తే మాజీ మంత్రిగా తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదే విధంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించే బాధ్యత తీసుకుంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ‘420 అడుగుల కాంగ్రెస్ 420 హామీలు’ అనే ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడని అన్నారు. అలాంటి ఉద్యమ నాయకుడిపై దొంగ సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు పెన్షన్లు, విద్యార్థులకు స్కూటీలు, రూ.4 వేల పెన్షన్, వికలాంగుల పెన్షన్లు తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 13 గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారని విమర్శించారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను జోగు రామన్న వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, సాజి తోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్ అన్నెలా, ప్రమోద్ రెడ్డి, బోడగం మమత, పర్వీన్ నిఖిలేష్, సేవ్వా జగదీష్, ఫెరోజ్, దమ్మపాల్ వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.