logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇవ్వకపోతే కాంగ్రెస్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తావా? సీఎం రేవంత్‌కు జోగు రామన్న సవాల్ ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.500 గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా అమలు చేసి చూపిస్తే మాజీ మంత్రిగా తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదే విధంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించే బాధ్యత తీసుకుంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ‘420 అడుగుల కాంగ్రెస్ 420 హామీలు’ అనే ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడని అన్నారు. అలాంటి ఉద్యమ నాయకుడిపై దొంగ సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు పెన్షన్లు, విద్యార్థులకు స్కూటీలు, రూ.4 వేల పెన్షన్, వికలాంగుల పెన్షన్లు తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 13 గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను జోగు రామన్న వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, సాజి తోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్ అన్నెలా, ప్రమోద్ రెడ్డి, బోడగం మమత, పర్వీన్ నిఖిలేష్, సేవ్వా జగదీష్, ఫెరోజ్, దమ్మపాల్ వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.

11 hrs ago
user_Musku Rajkiran Reddy
Musku Rajkiran Reddy
ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
11 hrs ago

రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇవ్వకపోతే కాంగ్రెస్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తావా? సీఎం రేవంత్‌కు జోగు రామన్న సవాల్ ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.500 గ్యాస్ సిలిండర్ హామీని రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా అమలు చేసి చూపిస్తే మాజీ మంత్రిగా తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అదే విధంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయించే బాధ్యత తీసుకుంటావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ‘420 అడుగుల కాంగ్రెస్ 420 హామీలు’ అనే ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడని అన్నారు. అలాంటి ఉద్యమ నాయకుడిపై దొంగ సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జోగు రామన్న విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు పెన్షన్లు, విద్యార్థులకు స్కూటీలు, రూ.4 వేల పెన్షన్, వికలాంగుల పెన్షన్లు తదితర హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 13 గ్యారెంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను జోగు రామన్న వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, సాజి తోద్దీన్, యూనిస్ అక్బాని, వసంత్ అన్నెలా, ప్రమోద్ రెడ్డి, బోడగం మమత, పర్వీన్ నిఖిలేష్, సేవ్వా జగదీష్, ఫెరోజ్, దమ్మపాల్ వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • *2️⃣ days. 4️⃣ strategic gains. 1️⃣ bigger vision for India. 🇮🇳🤝🇺🇿* PM Modi’s visit to Uzbekistan went beyond diplomacy . It advanced India’s long-term energy security, economic interests and strategic partnerships. 🔹 $1.3 billion — India-Uzbekistan trade last year, up 33% in one year 🔹 $5 billion — trade target set for 2030 🔹 Long-term uranium supply secured for India’s expanding nuclear energy programme 🔹 Cooperation expanded across gold, copper, uranium and rare earths 🔹 UPI connectivity with Uzbekistan’s national payments system 🔹 Partnership upgraded to a Comprehensive Strategic Partnership 🔹 12 agreements signed in a single day 🔹 30-day visa-free travel announced for Indian citizens *Watch how PM Modi’s Uzbekistan visit advances the larger vision of a stronger, more connected and more self-reliant India. 🇮🇳*
    1
    *2️⃣ days. 4️⃣ strategic gains. 1️⃣ bigger vision for India. 🇮🇳🤝🇺🇿*

PM Modi’s visit to Uzbekistan went beyond diplomacy
. It advanced India’s long-term energy security, economic interests and strategic partnerships.
🔹 $1.3 billion — India-Uzbekistan trade last year, up 33% in one year
🔹 $5 billion — trade target set for 2030
🔹 Long-term uranium supply secured for India’s expanding nuclear energy programme
🔹 Cooperation expanded across gold, copper, uranium and rare earths
🔹 UPI connectivity with Uzbekistan’s national payments system
🔹 Partnership upgraded to a Comprehensive Strategic Partnership
🔹 12 agreements signed in a single day
🔹 30-day visa-free travel announced for Indian citizens
*Watch how PM Modi’s Uzbekistan visit advances the larger vision of a stronger, more connected and more self-reliant India. 🇮🇳*
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం. ఆదిలాబాద్: సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేస్తం ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, వంశి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు, నిరుపేదలకు భోజనాలు వడ్డించి వారి ఆకలి తీర్చారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేస్తం ఫౌండేషన్ సామాజిక సేవలను అభినందించారు
    1
    పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు: రిమ్స్ ఆసుపత్రిలో ‘నేస్తం ఫౌండేషన్’ అన్నదానం.
ఆదిలాబాద్:
సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేస్తం ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్, వంశి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు, నిరుపేదలకు భోజనాలు వడ్డించి వారి ఆకలి తీర్చారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేస్తం ఫౌండేషన్ సామాజిక సేవలను అభినందించారు
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    7 hrs ago
  • వైఎస్సార్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : అనిల్‌కుమార్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు తెలంగాణ బెజ్జంకి అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద 17వ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీనవర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.
    1
    వైఎస్సార్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : అనిల్‌కుమార్‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు తెలంగాణ బెజ్జంకి అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద 17వ వర్ధంతి సందర్భంగా ఆయన వైఎస్సార్‌కు నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బలహీనవర్గాల సంక్షేమానికి వైఎస్సార్‌ అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    11 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల పాలన పై ధర్నా. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందింది మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి. 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ ఆర్టిసి బస్ స్టాండ్ లో ప్రయాణికులకు వివరించిన బాజీ రెడ్డి.
    1
    కామారెడ్డి జిల్లా

బాన్సువాడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు 1000 రోజుల పాలన  పై ధర్నా.

ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందింది మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి.

6 గ్యారెంటీల అమలు పై ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ ఆర్టిసి బస్ స్టాండ్ లో ప్రయాణికులకు వివరించిన బాజీ రెడ్డి.
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుదాం ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బోథ్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మాట్లాడారు. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించి, 'బాకీ కార్డు'తో నిరసన తెలిపారు.
    2
    కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుదాం
ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బోథ్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మాట్లాడారు. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించి, 'బాకీ కార్డు'తో నిరసన తెలిపారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • గూడెం దేవాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, యజ్ఞ హోమాలు...... దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాలు నిర్వహించారు. కాగా గురువారంతో దేవాలయంలో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయని ఈవో శ్రీనివాస్ తెలిపారు.
    1
    గూడెం దేవాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు, యజ్ఞ హోమాలు......
దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు యజ్ఞ హోమాలు నిర్వహించారు. కాగా గురువారంతో దేవాలయంలో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయని ఈవో శ్రీనివాస్ తెలిపారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • “పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”
    1
    “పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 02 :– *అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్* *ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు *పత్రికా ప్రకటన* * *దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం* *ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం* *నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం* *సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు సంప్రదించాలి* *ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. *వివరాలలో* ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ (25) S/o హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్‌పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్‌లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో syedsameer4780 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా Raj Led Mumbai పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, Majisa Air Express ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు. ఆగస్టు 22న సమీపంలోని Majisa Air Express కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది . బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది. *అరెస్ట్ చేసిన నిందితుడు:* ప్రకాశ్ కుమార్ (22) S/o హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. స్వాధీనం చేసుకున్న ఆస్తి: 🔹 రూ 1 లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు, ఈరోజు స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా,
సెప్టెంబర్ 02 :–

*అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్*

*ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు
*పత్రికా ప్రకటన*
*
*దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం*
*ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం*
*నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం*
*సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు సంప్రదించాలి*
*ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా  పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
*వివరాలలో*
ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ (25) S/o హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్‌పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్‌లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు.
గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో syedsameer4780 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా Raj Led Mumbai పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు.
వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, Majisa Air Express ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు.
ఆగస్టు 22న సమీపంలోని Majisa Air Express కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది .
బాధితుడి ఫిర్యాదు మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
*అరెస్ట్ చేసిన నిందితుడు:* 
ప్రకాశ్ కుమార్ (22) S/o హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
స్వాధీనం చేసుకున్న ఆస్తి:
🔹 రూ 1 లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు,
ఈరోజు స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.