ముఖ్యమంత్రి సహాయానిధి ద్వారా మంజూరైన 11 చెక్కులు ₹5,40,617/- లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన - ధూళిపాళ్ళ... పొన్నూరు మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 4 చెక్కులను ₹ 219374/- రూపాయలు మరియు పొన్నూరు పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 7 చెక్కులను ₹ 321243 రూపాయల మొత్తాన్ని పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంనందు లబ్ధిదారులకు పంపిణీ చేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు సంగం డెయిరి చైర్మన్ *శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు* , *పొన్నూరు మండలంలోని* మునిపల్లె - 1.దాసరి నాగేశ్వరరావు గారికి ₹60100/- కట్టెంపూడి 2. ఉప్పు లక్ష్మితిరుపతమ్మ గారికి ₹36819/- ములుకుదురు 3. కంతేటి మరియమ్మ గారికి ₹37205/- నండూరు 4. వేల్పూరీ హర్షవర్ధన్ గారికి ₹85250/- *పొన్నూరు పట్టణంలో* 6వార్డు 1.రాచపూడి మల్లిఖార్జున రావు గారికి ₹32884/- 12వార్డు 2. దేవరకొండ శ్రావణి గారికి ₹31544/- 15వార్డు 3.కొప్పినేడి విజయ హరిత గారికి ₹21991/- 19వార్డు 4.పానురి ధరణి గారికి ₹30900/- 20వార్డు 5. ఇండ్ల కుమారి గారికి ₹36084/- 6.కాలి జాన్ రవి చంద్ర గారికి ₹130381/- 28 వార్డు 7.సాక నాగలక్ష్మి గారికి ₹37459/- చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు,పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ గార్కిబాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ మరియు మండల నాయకులు పాల్గొనడం జరిగింది.

- సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1
- బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం: సుభాషిని నల్గొండ జిల్లాలో బత్తాయి తోటల అభివృద్ధి కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన & పట్టు పరిశ్రమల శాఖ అధికారి సుభాషిని తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బత్తాయి తోటలో దిగుబడి తక్కువగా వచ్చి నష్టపోతున్నామని అనేక మంది రైతులు చెబుతున్నారని, భూమి సారం కోల్పోవడం ద్వారా దిగుబడి తగ్గుతుందని అధికారులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో బత్తాయికి రేటు ఉందని తెలిపారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.2
- శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఓంకార జపం, శివ భజనలు. . అమరావతి: శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “సోమనాథ స్వాభిమాన పర్వ్ – 1000 సంవత్సరాల అచంచల విశ్వాసం” కార్యక్రమంలో భాగంగా శివాలయంలో ఓంకార జపం,శివ భజనలు,భక్తి గీతాలు చేపట్టారు. “సోమనాథ సంకల్పం” కార్యక్రమం నిర్వహించి భక్తులతో సంకల్పం చేయించారు. మహిళల భాగస్వామ్యంతో కళశ యాత్రలు చేపట్టారు1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.1
- మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1