logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట* * ఇది తెలంగాణ ప్రజల విజయం * *_గజ్వేల్ నియోజకవర్గం BRS పార్టీ జిల్లా నాయకులు ఎన్.సి. సంతోష్_* గజ్వేల్, సిద్దిపేట జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు గౌరవ హైకోర్టులో ఊరట లభించడం పట్ల *బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎన్.సి. సంతోష్ హర్షం వ్యక్తం చేశారు*. ఈ సందర్భంగా వారు🎤మాట్లాడుతూ ఈ విజయం కేవలం పార్టీది మాత్రమే కాదని, మొత్తం తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్పందించిన హైకోర్టు, ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. *పీసీ ఘోష్ కమిషన్ తన విచారణలో ఎలాంటి కనీస నిబంధనలు పాటించలేదని* ఆయన విమర్శించారు. 2025 జూలైలో ప్రభుత్వం సమర్పించిన ఈ రిపోర్ట్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, *బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లేందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు*. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను *ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయ కక్షతో ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి* చెబుతారన్నారు. సత్యం ఎప్పుడూ జయిస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సాధించిన ప్రగతిని ఎవరూ చెరిపివేయలేరన్నారు. *జై తెలంగాణ జై జై కేసీఆర్*

5 hrs ago
user_GOUSE BEURO REPORTER
GOUSE BEURO REPORTER
రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
5 hrs ago

*కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట* * ఇది తెలంగాణ ప్రజల విజయం * *_గజ్వేల్ నియోజకవర్గం BRS పార్టీ జిల్లా నాయకులు ఎన్.సి. సంతోష్_* గజ్వేల్, సిద్దిపేట జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు గౌరవ హైకోర్టులో ఊరట లభించడం పట్ల *బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఎన్.సి. సంతోష్ హర్షం వ్యక్తం చేశారు*. ఈ సందర్భంగా వారు🎤మాట్లాడుతూ ఈ విజయం కేవలం పార్టీది మాత్రమే కాదని, మొత్తం తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్పందించిన హైకోర్టు, ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. *పీసీ ఘోష్ కమిషన్ తన విచారణలో ఎలాంటి కనీస నిబంధనలు పాటించలేదని* ఆయన విమర్శించారు. 2025 జూలైలో ప్రభుత్వం సమర్పించిన ఈ రిపోర్ట్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, *బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లేందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు*. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను *ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయ కక్షతో ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి* చెబుతారన్నారు. సత్యం ఎప్పుడూ జయిస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సాధించిన ప్రగతిని ఎవరూ చెరిపివేయలేరన్నారు. *జై తెలంగాణ జై జై కేసీఆర్*

More news from తెలంగాణ and nearby areas
  • Post by 24 NEWS HAQ KI AWAZ
    1
    Post by 24 NEWS HAQ KI AWAZ
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఆర్టీసీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగాలి ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు ఐపీఎస్ టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడిన ఎస్పీ, ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులను తెలుసుకున్నారు. సమ్మె ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సహించబోమని హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట డియస్పీ ప్రసన్న కుమార్, డిపో మేనేజర్ సురేఖ, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    బస్టాండ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్
ఆర్టీసీ సేవలు అంతరాయం లేకుండా కొనసాగాలి
ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు ఐపీఎస్ 
టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రజా రవాణా సేవలు నిరంతరంగా కొనసాగేందుకు భద్రతా చర్యలను బలోపేతం చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. డిపో మేనేజర్ సురేఖతో మాట్లాడిన ఎస్పీ, ప్రస్తుతం నడుస్తున్న బస్సుల సంఖ్య, సేవల స్థితిగతులను తెలుసుకున్నారు. సమ్మె ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ డ్రైవర్లు, సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే చర్యలు, బస్సులకు నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని సహించబోమని హెచ్చరించారు. అటువంటి ఘటనలు జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ వెంట డియస్పీ ప్రసన్న కుమార్, డిపో మేనేజర్ సురేఖ, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    9 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్ మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు
    1
    బ్రేకింగ్ న్యూస్ 
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం
నల్గొండ బస్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న, అడ్డుకున్న తోటి కార్మికులు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • ఆర్టీసీ కార్మికులపై నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్
    1
    ఆర్టీసీ కార్మికులపై  నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కేసీఆర్
    user_India news 24/7
    India news 24/7
    ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి
    1
    ఇంగ్లీష్ తోనే భవిష్యత్తు, కొండాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవరెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    12 hrs ago
  • రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
    1
    రంగారెడ్డి జిల్లా:పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు.
ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. 
రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు.
గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • ​రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ​రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ​తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. ​వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం ​ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ​సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. ​దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010. పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. ​సహకార సంఘాల పాత్రపై సూచనలు ​సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు. ​మెదక్ జిల్లా సాగు అంచనాలు ​మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ​ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    ​రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
​రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు.
గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు (FPOs) మరియు ఏఆర్‌ఎస్‌కే (ARSK) కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి నిర్వహించారు. 
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ​తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు.  దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు.
​వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం
​ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
​సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638.
​దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010.
పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. 
పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.
​సహకార సంఘాల పాత్రపై సూచనలు
​సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు.
​మెదక్ జిల్లా సాగు అంచనాలు
​మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. 
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు
​ఈ సమావేశంలో  జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    10 hrs ago
  • కాళేశ్వరం ప్రాజెక్టులో మేడారం ఉందట ఇది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలివి
    1
    కాళేశ్వరం ప్రాజెక్టులో మేడారం ఉందట
ఇది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలివి
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • Privue |India Pharma Exp 2026|Hitex Exhibition Centre Hyderabad.
    1
    Privue |India Pharma Exp 2026|Hitex Exhibition Centre Hyderabad.
    user_India news 24/7
    India news 24/7
    ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.