రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య – వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాన్ని డిమాండ్ రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రతిరోజూ నలుగురు వైద్యులు విధుల్లో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆరోపించారు. ఉదయం ఓపీ సమయం పూర్తయిన తర్వాత వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాము కాటు, కుక్క కాటు బాధితులు, గర్భిణీ స్త్రీలు వంటి అత్యవసర కేసులకు కూడా సరైన మందులు, సౌకర్యాలు లేవనే కారణంతో నల్గొండ, హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని విమర్శించారు. దీంతో పేద ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించి, వైద్యులను నియమించి, గర్భిణీ స్త్రీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రూ.13 వేల ఆర్థిక సాయం అందించి ఇంటి వరకు చేర్చే ఏర్పాట్లు చేసేవారని గుర్తు చేశారు. అలాగే రూ.11 కోట్లతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఇటీవల రామన్నపేట పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఫొటోలను హరీష్ రావుకు పంపిస్తానని హామీ ఇచ్చారని, ఆ గడువులో ఇప్పటికే ఒక నెల పూర్తయిందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మిగిలిన రెండు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చిరుమర్తి లింగయ్య కోరారు.
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య – వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాన్ని డిమాండ్ రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రతిరోజూ నలుగురు వైద్యులు విధుల్లో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆరోపించారు. ఉదయం ఓపీ సమయం పూర్తయిన తర్వాత వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాము కాటు, కుక్క కాటు బాధితులు, గర్భిణీ స్త్రీలు వంటి అత్యవసర కేసులకు కూడా సరైన మందులు, సౌకర్యాలు లేవనే కారణంతో నల్గొండ, హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని విమర్శించారు. దీంతో పేద ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించి, వైద్యులను నియమించి, గర్భిణీ స్త్రీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రూ.13 వేల ఆర్థిక సాయం అందించి ఇంటి వరకు చేర్చే ఏర్పాట్లు చేసేవారని గుర్తు చేశారు. అలాగే రూ.11 కోట్లతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన
విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఇటీవల రామన్నపేట పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఫొటోలను హరీష్ రావుకు పంపిస్తానని హామీ ఇచ్చారని, ఆ గడువులో ఇప్పటికే ఒక నెల పూర్తయిందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మిగిలిన రెండు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చిరుమర్తి లింగయ్య కోరారు.
- వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.1
- కుక్కల గుంపులు.. దోమల దండయాత్ర! నేలకొండపల్లి మండల ప్రజలకు తప్పని తిప్పలు అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ, ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి వీధి కుక్కలు, దోమల బెడదతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి నేలకొండపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కలు, దోమల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు దోమల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దోమల నివారణకు సరైన చర్యలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు, దోమల నివారణ కోసం ఫాగింగ్, పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.1
- పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది4
- గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.1
- పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే దూషించిన ఎస్సై బాధితుల ఆవేదన మేము బాత్రూమ్‌కు వెళ్తున్న వీడియోలు తీసి వేధిస్తున్నాడు.నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా మేము స్కూల్లో పని చేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూమ్‌కు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశాము.ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని ఘోరంగా దూషిస్తూ అవమానపరిచాడు. మమ్మల్ని అవమానించిన ఎస్ఐపైన, మమ్మల్ని వేధించిన నరేష్ అనే వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్న బాధితులు.1
- తెలంగాణలో ఇంటింటికి ఉద్యోగాల హామీ ఏమైంది? బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడితే ఇంటింటికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యోగ నియామకాల అపాయింట్‌మెంట్ లేఖల వివరాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు, మాయమాటలను నమ్మవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.1
- ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేతో అనుసంధానం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారితో TG, APరాష్ట్రాల తోపాటు దక్షిణాది- ఉత్తరాది ప్రాంతాలు అనుసంధానమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభమైన సందర్భంగా ఆయన రహదారిపై ప్రయాణించగా, ధంసలాపురం వద్ద సమావేశంలో మాట్లాడారు. నాగ్ పూర్-అమరావతి రోడ్డు అనుసంధాన పనులు, రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.1
- సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. జైలు అధికారులపై బంధువుల ఆరోపణలు మహబూబాబాద్ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వెంకన్న ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2017 హత్య కేసులో నిందితుడైన అతడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే జైలు అధికారులు కొట్టడం వల్లే వెంకన్న మృతి చెందిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.1