logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు. ​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

6 hrs ago
user_Akhil Katla
Akhil Katla
Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
6 hrs ago

సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు. ​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు. ​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    1
    సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు.
​పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_Akhil Katla
    Akhil Katla
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • వైభవంగా ముగిసిన బొడ్డెమ్మ వేడుకలు..... ప్రారంభము కానున్న బతుకమ్మ సంబరాలు.... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సవభరితంగా సాగిన 'బొడ్డెమ్మ' వేడుకలు ఘనంగా ముగిశాయి. కన్నెపిల్లలు, మహిళలు సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను పూజించి, ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. ఈ పూల జాతర ముగింపుతో మండలంలోని పల్లెలన్నీబతుకమ్మఅప్పుడే ముందస్తు సంతరించుకున్నాయి. పండుగశోభనుఆటపాటలతోమార్మోగిన వీధులుచివరి రోజున కన్నెపిల్లలు, మహిళలు తీరొక్క పూలైన తంగేడు, గునుగు, కట్ల పూలతో బొడ్డెమ్మలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం వేళ వీధుల్లో "బొడ్డెమ్మా బొడ్డెమ్మా కోల్...నీ బిడ్డలు ఎందరే కోల్" అంటూ సాగే సంప్రదాయ జానపద గేయాలకు అనుగుణంగా చప్పట్లు, కోలాటాలతో సందడి చేశారు. గౌరీదేవి స్వరూపమైన బొడ్డెమ్మను తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి బియ్యంతో ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అలాగే పెసర్లు, నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. చీకటి పడే సమయానికి మంగళహారతులు పాడుతూ ఊరేగింపుగా ఊరి చివరన ఉన్న చెరువులు, వాగులు, బావుల వద్దకు చేరుకుని పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిభావంతో బొడ్డెమ్మలను నిమజ్జనం చేశారు. బొడ్డెమ్మ పండుగ ముగియడంతో, రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలు 'ఎంగిలిపూల బతుకమ్మ'తో ఘనంగా ప్రారంభం కానున్నాయి.
    2
    వైభవంగా ముగిసిన బొడ్డెమ్మ వేడుకలు.....
ప్రారంభము కానున్న బతుకమ్మ సంబరాలు....
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సవభరితంగా సాగిన 'బొడ్డెమ్మ' వేడుకలు ఘనంగా ముగిశాయి. కన్నెపిల్లలు, మహిళలు సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను పూజించి, ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. ఈ పూల జాతర ముగింపుతో మండలంలోని పల్లెలన్నీబతుకమ్మఅప్పుడే ముందస్తు సంతరించుకున్నాయి.
పండుగశోభనుఆటపాటలతోమార్మోగిన వీధులుచివరి రోజున కన్నెపిల్లలు, మహిళలు తీరొక్క పూలైన తంగేడు, గునుగు, కట్ల పూలతో బొడ్డెమ్మలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం వేళ వీధుల్లో "బొడ్డెమ్మా బొడ్డెమ్మా కోల్...నీ బిడ్డలు ఎందరే కోల్" అంటూ సాగే సంప్రదాయ జానపద గేయాలకు అనుగుణంగా చప్పట్లు, కోలాటాలతో సందడి చేశారు. గౌరీదేవి స్వరూపమైన బొడ్డెమ్మను తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి బియ్యంతో ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అలాగే పెసర్లు, నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. చీకటి పడే సమయానికి మంగళహారతులు పాడుతూ ఊరేగింపుగా ఊరి చివరన ఉన్న చెరువులు, వాగులు, బావుల వద్దకు చేరుకుని పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిభావంతో బొడ్డెమ్మలను నిమజ్జనం చేశారు. బొడ్డెమ్మ పండుగ ముగియడంతో, రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలు 'ఎంగిలిపూల బతుకమ్మ'తో ఘనంగా ప్రారంభం కానున్నాయి.
    user_Devendar
    Devendar
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    4 hrs ago
  • రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలి: బీజేపీ డిమాండ్ తిమ్మాపురం ఎక్స్ రోడ్ సబ్‌స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా తిమ్మాపురం (9.10.2026) వ్యవసాయ పనుల సమయంలో రైతులకు ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపురం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ​ఈ సందర్భంగా బీజేపీ స్థానిక నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటల సాగు కీలక దశలో ఉన్న తరుణంలో అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయ రంగానికి సరిపడా నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే అధికారులు స్పందించి సరఫరాను మెరుగుపరచకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నదాతలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ​ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.
    2
    రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలి: బీజేపీ డిమాండ్
తిమ్మాపురం ఎక్స్ రోడ్ సబ్‌స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
తిమ్మాపురం (9.10.2026)
వ్యవసాయ పనుల సమయంలో రైతులకు ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపురం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
​ఈ సందర్భంగా బీజేపీ స్థానిక నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటల సాగు కీలక దశలో ఉన్న తరుణంలో అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయ రంగానికి సరిపడా నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే అధికారులు స్పందించి సరఫరాను మెరుగుపరచకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నదాతలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
​ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. పేద విద్యార్థులకు సాయం చేయడంలో.. ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు. విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు. కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.
    1
    పేద విద్యార్థులకు సాయం చేయడంలో..
ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న

నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు.

విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు.

కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.

పేద విద్యార్థులకు సాయం చేయడంలో..
ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు రామన్న
నీట్‌లో ర్యాంక్ సాధించి, నిజామాబాద్‌‌ కాలేజ్‌లో సీటు సంపాదించినా.. అడ్మిషన్ ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వేములవాడ విద్యార్థినికి అండగా నిలబడ్డడు.
విద్యార్థిని తరఫున సాయం కోరుతూ చేసిన ట్వీట్‌కు వెంటనే స్పందించిన కేటీఆర్.. అవసరమైన ఫీజు మొత్తాన్ని చెల్లించి, ఏ అవసరమొచ్చినా తానున్నానని భరోసా ఇచ్చిండు.
కష్టకాలంలో కన్నీళ్లను తుడిచి, తన కలలకు రెక్కలు తొడిగిన రామన్న రుణం తీర్చుకోలేనంటూ విద్యార్థిని గ్లోరి ఈ వీడియో ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    సరిపడా కరెంటు ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో కరెంటు కోసం రైతులు కన్నెర్ర చేశారు. కోతలు లేకుండా వ్యవసాయనికి సరిపడా కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మరుమాముల, సలాకపూర్, లద్దునూర్, ధర్మారం గ్రామాలకు చెందిన సుమారు 200 మందిక పైగా రైతులు మరుమాముల విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు గంటల విద్యుత్తు మాత్రమే అందడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. గతంలో వ్యవసాయానికి సరిపడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని విమర్శించారు. వర్షాకాలంలో పంటలు ఎండిపోయిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవని ప్రస్తుతం కరెంటు వల్లనే పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ రైతులకు రుణాలు కరెంటు అందించినట్లు గుర్తు చేశారు. అప్పుడు వచ్చిన కరెంటు ఇప్పుడు ఎందుకు రాదని రైతులు ప్రశ్నించారు. నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అందించే వరకు రైతులమంతా ఉద్యమించనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని చేర్యాల ఏడిఈ వెంకట్ గౌడ్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. 
ఈ కార్యక్రమంలో సర్పంచులు కాసర్ల రేణుక కనకరాజు, జక్కుల కనకమ్మ లింగయ్య, గడిపే మౌనిక అనిల్ కుమార్, మాజీ సర్పంచులు సుందరగిరి స్రవంతి పరశురాములగౌడ్, వంగ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఉత్కం మల్లేశం ,నాయకులు పశుపతి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Mallanna
    Mallanna
    Insurance Agent మద్దూర్, సిద్దిపేట, తెలంగాణ•
    12 hrs ago
  • కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో.. బతుకమ్మ వేడుకలు..! ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ఎలిజబెత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, రంగు రంగు పూలను అల్లి తెలంగాణ సంప్రదాయంతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ ను ఆడిపాడుకున్నారు... ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..
    1
    కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో.. బతుకమ్మ వేడుకలు..!

ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..
జనగామ జిల్లా
పాలకుర్తి మండల కేంద్రంలో కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ఎలిజబెత్  ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు..
తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, రంగు రంగు పూలను అల్లి తెలంగాణ సంప్రదాయంతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ ను ఆడిపాడుకున్నారు...
ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..
    user_Bollam Ashok
    Bollam Ashok
    Social worker తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • లారీ ఢీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వృద్ధుడిని డీ కొట్టిన లారీ . ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రగాయాలతో ఉన్న వృద్ధుడిని అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వృద్ధుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, ఈపి తండా వాసిగా గుర్తించారు.
    1
    లారీ ఢీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వృద్ధుడికి తీవ్రగాయాలు
జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై రోడ్డును క్రాస్ చేస్తున్న వృద్ధుడిని డీ కొట్టిన లారీ . ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రగాయాలతో ఉన్న వృద్ధుడిని అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వృద్ధుడు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, ఈపి తండా వాసిగా గుర్తించారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • హన్మకొండ లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు... ఫుట్ పాత్ స్థకాల ఆక్రమణపై ఘర్షణ. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రహరీ గోడ వద్ద ఫుట్‌పాత్ పై డబ్బా కొట్టు కోసం జ్యోతి, శ్రీదేవి అనే మహిళల మధ్య ఘర్షణ జరిగింది.అగ్రిమెంట్ ప్రకారం స్థలం తమదంటూ ఇద్దరూ ప్రధాన రహదారిపైనే పిడిగుద్దులతో కొట్టుకున్నారు.అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని వారించబోగా, ఆయనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు.పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేయడమే నిబంధనలకు విరుద్ధం, దానిపై మళ్లీ కొట్లాట అవసరమా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ గొడవ కారణంగా ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ ఆరు నిమిషాల పాటు నిలిచిపోయింది.ఘటనపై హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జీఎంహెచ్ ఎదుట జరిగిన మహిళల మధ్య ఘర్షణ వల్ల అంబులెన్స్ కు అంతరాయం ఏర్పడింది.
    1
    హన్మకొండ లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు...
ఫుట్ పాత్ స్థకాల ఆక్రమణపై ఘర్షణ.
హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రహరీ గోడ వద్ద ఫుట్‌పాత్ పై డబ్బా కొట్టు కోసం జ్యోతి, శ్రీదేవి అనే మహిళల మధ్య ఘర్షణ జరిగింది.అగ్రిమెంట్ ప్రకారం స్థలం తమదంటూ ఇద్దరూ ప్రధాన రహదారిపైనే పిడిగుద్దులతో కొట్టుకున్నారు.అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని వారించబోగా, ఆయనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు.పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేయడమే నిబంధనలకు విరుద్ధం, దానిపై మళ్లీ కొట్లాట అవసరమా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ గొడవ కారణంగా ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ ఆరు నిమిషాల పాటు నిలిచిపోయింది.ఘటనపై హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జీఎంహెచ్ ఎదుట జరిగిన మహిళల మధ్య ఘర్షణ వల్ల అంబులెన్స్ కు అంతరాయం ఏర్పడింది.
    user_Devendar
    Devendar
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.