Shuru
Apke Nagar Ki App…
హన్మకొండ లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు... ఫుట్ పాత్ స్థకాల ఆక్రమణపై ఘర్షణ. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రహరీ గోడ వద్ద ఫుట్‌పాత్ పై డబ్బా కొట్టు కోసం జ్యోతి, శ్రీదేవి అనే మహిళల మధ్య ఘర్షణ జరిగింది.అగ్రిమెంట్ ప్రకారం స్థలం తమదంటూ ఇద్దరూ ప్రధాన రహదారిపైనే పిడిగుద్దులతో కొట్టుకున్నారు.అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని వారించబోగా, ఆయనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు.పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేయడమే నిబంధనలకు విరుద్ధం, దానిపై మళ్లీ కొట్లాట అవసరమా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ గొడవ కారణంగా ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ ఆరు నిమిషాల పాటు నిలిచిపోయింది.ఘటనపై హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జీఎంహెచ్ ఎదుట జరిగిన మహిళల మధ్య ఘర్షణ వల్ల అంబులెన్స్ కు అంతరాయం ఏర్పడింది.
Devendar
హన్మకొండ లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు... ఫుట్ పాత్ స్థకాల ఆక్రమణపై ఘర్షణ. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రహరీ గోడ వద్ద ఫుట్‌పాత్ పై డబ్బా కొట్టు కోసం జ్యోతి, శ్రీదేవి అనే మహిళల మధ్య ఘర్షణ జరిగింది.అగ్రిమెంట్ ప్రకారం స్థలం తమదంటూ ఇద్దరూ ప్రధాన రహదారిపైనే పిడిగుద్దులతో కొట్టుకున్నారు.అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని వారించబోగా, ఆయనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు.పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేయడమే నిబంధనలకు విరుద్ధం, దానిపై మళ్లీ కొట్లాట అవసరమా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ గొడవ కారణంగా ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ ఆరు నిమిషాల పాటు నిలిచిపోయింది.ఘటనపై హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జీఎంహెచ్ ఎదుట జరిగిన మహిళల మధ్య ఘర్షణ వల్ల అంబులెన్స్ కు అంతరాయం ఏర్పడింది.
More news from తెలంగాణ and nearby areas
- వైభవంగా ముగిసిన బొడ్డెమ్మ వేడుకలు..... ప్రారంభము కానున్న బతుకమ్మ సంబరాలు.... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గత తొమ్మిది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సవభరితంగా సాగిన 'బొడ్డెమ్మ' వేడుకలు ఘనంగా ముగిశాయి. కన్నెపిల్లలు, మహిళలు సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను పూజించి, ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. ఈ పూల జాతర ముగింపుతో మండలంలోని పల్లెలన్నీబతుకమ్మఅప్పుడే ముందస్తు సంతరించుకున్నాయి. పండుగశోభనుఆటపాటలతోమార్మోగిన వీధులుచివరి రోజున కన్నెపిల్లలు, మహిళలు తీరొక్క పూలైన తంగేడు, గునుగు, కట్ల పూలతో బొడ్డెమ్మలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయంత్రం వేళ వీధుల్లో "బొడ్డెమ్మా బొడ్డెమ్మా కోల్...నీ బిడ్డలు ఎందరే కోల్" అంటూ సాగే సంప్రదాయ జానపద గేయాలకు అనుగుణంగా చప్పట్లు, కోలాటాలతో సందడి చేశారు. గౌరీదేవి స్వరూపమైన బొడ్డెమ్మను తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. వేడుకల్లో భాగంగా అమ్మవారికి బియ్యంతో ప్రత్యేకంగా తయారు చేసిన తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అలాగే పెసర్లు, నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. చీకటి పడే సమయానికి మంగళహారతులు పాడుతూ ఊరేగింపుగా ఊరి చివరన ఉన్న చెరువులు, వాగులు, బావుల వద్దకు చేరుకుని పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిభావంతో బొడ్డెమ్మలను నిమజ్జనం చేశారు. బొడ్డెమ్మ పండుగ ముగియడంతో, రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలు 'ఎంగిలిపూల బతుకమ్మ'తో ఘనంగా ప్రారంభం కానున్నాయి.2
- సముద్రాలలో ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు – ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన పంచాయతీ జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో బతుకమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్ బత్తుల యాదగిరి మరియు పంచాయతీ సెక్రెటరీ సోమేష్‌ల ప్రత్యేక చొరవతో గ్రామంలోని బతుకమ్మ వేడుకల ప్రాంగణంలో నూతన విద్యుత్ దీపాలను (లైట్లు) ఏర్పాటు చేశారు. పండుగ వేళ మహిళలకు రాత్రి సమయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చీకటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఈ లైటింగ్ ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ బత్తుల యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ సోమేష్ మాట్లాడుతూ.. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు ప్రశాంతంగా మరియు ఆనందంగా జరిగేలా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలి: బీజేపీ డిమాండ్ తిమ్మాపురం ఎక్స్ రోడ్ సబ్‌స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా తిమ్మాపురం (9.10.2026) వ్యవసాయ పనుల సమయంలో రైతులకు ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపురం ఎక్స్ రోడ్ వద్ద ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ స్థానిక నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటల సాగు కీలక దశలో ఉన్న తరుణంలో అప్రకటిత విద్యుత్ కోతల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను గుర్తించి వ్యవసాయ రంగానికి సరిపడా నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే అధికారులు స్పందించి సరఫరాను మెరుగుపరచకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్నదాతలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేశారు.2
- ముత్తోజిపేటలో ఘనంగా బొడ్డెమ్మ చివరి వేడుకలు............ నర్సంపేట: మున్సిపల్ పరిధిలోని ముత్తోజిపేటలో బొడ్డెమ్మ చివరి వేడుకలను మహిళలు కోలాటాలు, ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. బొడ్డెమ్మ చరిత్ర, విశిష్టతను వివరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇటువంటి ఆచారాలను కొనసాగించడం అభినందనీయమని మహిళలు పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ సంప్రదాయాలను కొనసాగిస్తామని తెలిపారు.2
- ములుగు: దసరా సెలవులతో బస్టాండ్లలో పెరుగుతున్న రద్దీ... దసరా సెలవుల నేపథ్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. నర్సంపేట, హనుమకొండ, ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు అధికమవుతున్నాయి. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.2
- కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో.. బతుకమ్మ వేడుకలు..! ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కార్మేల్ కాన్వెంట్ హై-స్కూల్ లో, పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ ఎలిజబెత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.. తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి, రంగు రంగు పూలను అల్లి తెలంగాణ సంప్రదాయంతో అందంగా ముస్తాబు చేసి బతుకమ్మ ను ఆడిపాడుకున్నారు... ఈ వేడుకలలో పాఠశాల యజమాన్యం,ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు పాఠశాల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు..1
- తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...పలు పాఠశాలలో ఆడిపాడిన విద్యార్థులతో పాటు టీచర్లు తెలంగాణ పల్లెల్లో పూల పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి ప్రారంభమవుతుండగా శుక్రవారం పలు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఉండడంతో కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వైభవోపేతంగా విద్యార్థులు టీచర్లు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిగురు మామిడి మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో కన్నుల పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు టీచర్లు పలు రకాల పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడారు. చప్పట్లు కొడుతూ కోలాటం ఆడుతూ బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో వైభవంగా జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. పకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండుగ బతుకమ్మ వేడుక అని మహిళలు అభిప్రాయపడుతున్నారు. రామంచ స్కూల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీచర్ల పద్మ, శోభారాణితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.3
- హన్మకొండ లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు... ఫుట్ పాత్ స్థకాల ఆక్రమణపై ఘర్షణ. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రహరీ గోడ వద్ద ఫుట్‌పాత్ పై డబ్బా కొట్టు కోసం జ్యోతి, శ్రీదేవి అనే మహిళల మధ్య ఘర్షణ జరిగింది.అగ్రిమెంట్ ప్రకారం స్థలం తమదంటూ ఇద్దరూ ప్రధాన రహదారిపైనే పిడిగుద్దులతో కొట్టుకున్నారు.అక్కడే ఉన్న కానిస్టేబుల్ వారిని వారించబోగా, ఆయనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు.పబ్లిక్ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేయడమే నిబంధనలకు విరుద్ధం, దానిపై మళ్లీ కొట్లాట అవసరమా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ గొడవ కారణంగా ఆసుపత్రికి వెళ్తున్న అంబులెన్స్ ఆరు నిమిషాల పాటు నిలిచిపోయింది.ఘటనపై హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జీఎంహెచ్ ఎదుట జరిగిన మహిళల మధ్య ఘర్షణ వల్ల అంబులెన్స్ కు అంతరాయం ఏర్పడింది.1