*నీట్ పరీక్ష నిర్వహకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షిషా పత్రికా ప్రకటన ఏప్రిల్ 30, 2026_ఆదిలాబాదు: * వచ్చే నెల(మే 3, 2026)వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నదని, ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, తగినంత వెలుతురు, ఫర్నిచర్ ఉండేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని, అక్కడ ఏఎన్ఎంలతో పాటు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించే ప్రసక్తి లేదని, విద్యార్థులు ఈ నిబంధనను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఇతర అధికారులు, విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*నీట్ పరీక్ష నిర్వహకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షిషా పత్రికా ప్రకటన ఏప్రిల్ 30, 2026_ఆదిలాబాదు: * వచ్చే నెల(మే 3, 2026)వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నదని, ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, తగినంత వెలుతురు, ఫర్నిచర్ ఉండేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో
ఉంచుకుని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని, అక్కడ ఏఎన్ఎంలతో పాటు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అదనపు ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించే ప్రసక్తి లేదని, విద్యార్థులు ఈ నిబంధనను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ఇతర అధికారులు, విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- ఆదిలాబాద్ జిల్లా : ఇచ్చోడ మండలంలోని గుబ్బగ్రామంలో సిడం వంశీయూల ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా వచ్చిన బోథ్ ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న సతి సావిత్రి బాయి ఆలయంలో నిర్వాహంచిన సిడం వంశీయూల దర్భార్ (కొత్త కోడళ్ల ములకత్) కార్యక్రమం పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులను ఈ కాలంలో కూడా ఆచరించడం ఒక గొప్ప ఐకత్యకు నిదర్శనం అని అన్నారు.. గ్రామస్థులు గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికీతీసుకోనివచ్చారు బోథ్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గుబ్బ గ్రామానికి అన్నివిధాలుగా అభిహృద్ధి చేస్తాననిన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement. She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.1
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1
- రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి. తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.2
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1906 కోట్ల కాంట్రాక్టు కేటాయింపుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత మేర భాగస్వామ్యం కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.1
- Post by Solanke Ravi1
- జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.1
- , DRDO and the Indian Navy ace the first salvo test of NASM-SR. The Indian Ocean just got safer for us, riskier for others.1