Shuru
Apke Nagar Ki App…
నా జనం కోసం జనంలోనే మీ తీన్మార్ మల్లన్న రాజేంద్రనగర్ బాధితులారా మీరు ధైర్యంగా ఉండండి *నా జనం కోసం.. జనంలోనే.. మీ మల్లన్న..!* రాజేంద్రనగర్ బాధితులారా..మీరు ధైర్యంగా ఉండండి..! మీ ముఖంలో చిరు నవ్వు చూడటమే ఈ మల్లన్న ఆశయం.. ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఒంటిగంటైనా, రెండైనా సరే. క్షణాల్లో మీ చెంతకు చేరతా..! మీ కష్టాన్ని నా కష్టంగా భావించి పోరాడతా...నా చివరి శ్వాస వరకు తోడుంటా.! మీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రానివ్వను... మీకు మల్లన్న ఉన్నడు...
SIRIPATI ARUNKUMAR
నా జనం కోసం జనంలోనే మీ తీన్మార్ మల్లన్న రాజేంద్రనగర్ బాధితులారా మీరు ధైర్యంగా ఉండండి *నా జనం కోసం.. జనంలోనే.. మీ మల్లన్న..!* రాజేంద్రనగర్ బాధితులారా..మీరు ధైర్యంగా ఉండండి..! మీ ముఖంలో చిరు నవ్వు చూడటమే ఈ మల్లన్న ఆశయం.. ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ఒంటిగంటైనా, రెండైనా సరే. క్షణాల్లో మీ చెంతకు చేరతా..! మీ కష్టాన్ని నా కష్టంగా భావించి పోరాడతా...నా చివరి శ్వాస వరకు తోడుంటా.! మీ ప్రాణాలకు ఎలాంటి ఆపద రానివ్వను... మీకు మల్లన్న ఉన్నడు...
More news from తెలంగాణ and nearby areas
- గుప్తనిధుల పేరుతో క్షుద్ర పూజ చేస్తామంటూ కలరింగ్ గుప్తనిధుల పేరుతో మోసం పాల్పడుతున్న ముఠాగట్టురట్టు నలుగురు నిందితుల అరెస్టు *గుప్తనిధుల పేరుతో క్షుద్రపూజ చేస్తానంటూ కలరింగ్..!* శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ – 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్* *స్వాధీనం చేసుకున్న సొత్తు: 02 కార్లు, 01 ఆటో, 02 మోటార్ సైకిళ్లు, 04 సెల్ ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు మరియు బొగ్గు.* హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. *అరెస్టయిన నిందితుల వివరాలు:* మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్. సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. *స్వాధీనం చేసుకున్న వస్తువులు:* 02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) 01 ఆటో రిక్షా 02 మోటార్ సైకిళ్లు 04 సెల్ ఫోన్లు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు 6 కేజీల బొగ్గు 4 కేజీల మట్టి పూజా సామగ్రి ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు. *నేరం చేసిన తీరు (Modus Operandi):* ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది. హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. (కె.ఎస్. రావు) అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్‌ఫోర్స్, రాజేంద్రనగర్ & శంషాబాద్ జోన్స్, హైదరాబాద్ సిటీ.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం మంగళవారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా కొనసాగుతోంది. ఆలయంలో రద్దీ తక్కువగా ఉన్నందున సర్వదర్శనాలకు గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.1
- అమ్మో 80 ఏళ్ల కింద నాటి బావి వైరల్ వీడియో చూసి తరించండి జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని అతి పురాతనమైన బావి ఉంది. ఇది దగ్గర దగ్గర 7 గోళల లోతు ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. వీలుంటే మీరు కూడా అటు పక్కకు పోయినప్పుడు చూసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి.1
- తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.2
- కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. 1
- బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ1
- ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన తన అమ్మానాన్నల బాటలోనే ప్రయాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్న ములుగు ప్రజల ఆశాజ్యోతి శ్రీమతి బడే నాగజ్యోతి ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన తన అమ్మ -నాన్న ల బాటలో పయనిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగుతున్న అడవి తల్లి ముద్దు బిడ్డ సమ్మక్క -సారక్కతల్లుల పోరాట వారసురాలు, ములుగు ప్రజల ఆశజ్యోతి *శ్రీమతి బడే నాగజ్యోతి* గారు జయహో *నాగజ్యోతి అక్క*1
- కమలాపూర్‌లో గంజాయి మత్తులో నలుగురి వీరంగం.. నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి! హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద గంజాయి మత్తులో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంజాయి మత్తులో బహిరంగంగా దాడికి పాల్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు కార్మికులు తరచూ గొడవలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమలాపూర్‌లో గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.1