Shuru
Apke Nagar Ki App…
వరంగల్ జిల్లాలోని ఇటకాలపల్లి మేడిపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుల్లపాడుకు చెందిన రవికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పోసిన వడ్లు, వాటి చుట్టూ పెట్టిన రాళ్లను బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Chetty:Ramesh
వరంగల్ జిల్లాలోని ఇటకాలపల్లి మేడిపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుల్లపాడుకు చెందిన రవికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పోసిన వడ్లు, వాటి చుట్టూ పెట్టిన రాళ్లను బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లాలోని ఇటకాలపల్లి మేడిపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుల్లపాడుకు చెందిన రవికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పోసిన వడ్లు, వాటి చుట్టూ పెట్టిన రాళ్లను బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.2
- ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లికి వెళ్లిన కుటుంబం ఇంట్లో తాళాలు పగలగొట్టి 3 తులాల బంగారం, ₹1 లక్షకు పైగా నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కేయూ విద్యార్థుల భారీ నిరసన.. వరంగల్ కమిషనరేట్ ముట్టడి.. హన్మకొండ నగరంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ను ముట్టడించారు. “బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా?” అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ భాస్కర్ మద్దతు తెలిపారు.1
- వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో 'జై శ్రీరామ్' నామస్మరణ మారుమోగుతూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.1
- హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో వేలమంది భక్తులతో హిందూ ఏక్తా యాత్ర కన్నుల పండువగా సాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రతో నగరం కాషాయమయంగా మారింది. కులాల పేరుతో చీల్చుతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ పేర్కొన్నారు.2
- కొత్తగూడెం పట్టణంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసి చిట్టీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపిస్తూ సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గత 20 ఏళ్లుగా ఇళ్ల నిర్మాణం జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పాత లబ్ధిదారులను పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తయిన 300 ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.2
- ఖమ్మం లో ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతు రిజిస్ట్రీ పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్1
- భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం – హనుమకొండ నగరంలో హనుమజ్జయంతి వేడుకలు హనుమకొండ నగరంలోని నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్న వికాస తరంగణి భవనంలో హనుమజ్జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం విద్యార్థులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల సంగీత, ఆధ్యాత్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాలబాలికలకు హనుమంతుడి భక్తి భావం, ఆధ్యాత్మిక విలువలపై బోధనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చు రాధాకృష్ణ, దయాకర్ రెడ్డి, తనూజ, ఉమ తదితరులు పాల్గొన్నారు.1