logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నెల్లూరు రూరల్ నరసింహకొండ వద్ద వెలసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 వతేదీ నుండి మే – 6 వతేదీ వరకు నిర్వహించనున్న నేపధ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగా కుండా నిర్వహించాలని రెవిన్యూ డివిజినల్ అధికారి అనుషా, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం నరసింహ కొండలోని సమావేశ హాలులో బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహణ సమయములో వచ్చిన లోటుపాట్లను పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండా కాలం ద్రష్ట్యా వేసవి తాపం తగలకుండా చలువ పందిళ్ళు, మంచినీరు, ఓ.ఆర్.యస్ ప్యాకెట్లు , మజ్జిగ అందచేశాల చర్యలు తీసుకోవాలాన్నారు. క్యూ లైన్లు క్రమ పద్దతిలో భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా ఏర్పాటుచేయాలన్నారు. నిరంతర విధ్యుత్ సరఫరా చేసేలా అవసరమైన చోట ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధమ చికిత్సా కేంద్రాలు, అత్యవసర మందులు, అంబులెన్సు లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా పారిశుద్ద్యపనులు చేపట్టాలని సంబంధిత పంచాయతి అధికారులకు సూచించారు. ఆలయ చైర్మన్ అచ్యుత శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ సిబ్బంది, ధర్మకర్తల మండలి సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలును విజయవంతం అందరు కృషి చేయాలన్నారు. క్యూ లైన్లు పకడ్బందిగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహణను దృష్టిలో పెట్టుకొని అనందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి గోపి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు నిర్వహణకు తీసుకొన్న ఏర్పాట్ల గురించి వివరించారు. చలువ పందిళ్ళు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు , క్యూ లైన్ల ఏర్పాటు తదితరములు గురించి వివరించారు. ఈ కార్యక్రమములో వివిధ శాఖ అధికారులు, ఆలయ ధర్మ కర్తలు తదితరులు పాల్గొన్నారు.

16 hrs ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago
3c2d84a2-c699-42b7-82f2-0a0651ac54e7

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
    4
    ఊటుకూరు లో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
పార్లమెంటులో ఆంధ్రుల రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    17 hrs ago
  • బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.
    2
    బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని  ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో  రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న,
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ  వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు.
నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    12 min ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    2 hrs ago
  • పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ  విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది.
వెంకటే గౌడ  మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. 
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ  భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్  మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    21 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.