logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాల్వంచ గాంధీనగర్‌లో తాగునీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలి – బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయం లో గాంధీనగర్ మంచి నీళ్ల పైపు లైను వెయ్యాలని మేనేజర్ సత్యనారాయణ గారికి గాంధీనగర్ వాసులతో కలసి వినతి పత్రం ఇచ్చిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని 44వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విసంపల్లి దుర్గాభవాని ఇల్లు నం. 11-3-21 నుండి బానోత్ నాగమణి ఇల్లు నం. 11-3-24 వరకు, అలాగే చింతల చెరువు భాగ్యలక్ష్మి ఇల్లు నం. 11-3-24 నుండి నూనావత్ శారద గారి ఖాళీ స్థలం వరకు గల రెండు బజార్లలో అనేక సంవత్సరాలుగా తాగునీటి సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానిక అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలందరూ రోజువారీ కూలి పనులు చేసుకొని జీవించే సాధారణ కుటుంబాలకు చెందినవారని, తాగునీటిని కొనుగోలు చేసి వినియోగించుకునే పరిస్థితి లేదని తెలిపారు. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి కొరత మరింత తీవ్రంగా మారుతోందని అన్నారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గాంధీనగర్ ప్రాంతంలో తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, అప్పటివరకు తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

1 hr ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago
297e6d84-2790-4b8e-ac7c-3cebe4eb9993

పాల్వంచ గాంధీనగర్‌లో తాగునీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలి – బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయం లో గాంధీనగర్ మంచి నీళ్ల పైపు లైను వెయ్యాలని మేనేజర్ సత్యనారాయణ గారికి గాంధీనగర్ వాసులతో కలసి వినతి పత్రం ఇచ్చిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని 44వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విసంపల్లి దుర్గాభవాని ఇల్లు నం. 11-3-21 నుండి బానోత్ నాగమణి ఇల్లు నం. 11-3-24 వరకు, అలాగే చింతల చెరువు భాగ్యలక్ష్మి ఇల్లు

44b8a1a8-df76-4d16-9850-c0ef22f08803

నం. 11-3-24 నుండి నూనావత్ శారద గారి ఖాళీ స్థలం వరకు గల రెండు బజార్లలో అనేక సంవత్సరాలుగా తాగునీటి సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానిక అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలందరూ రోజువారీ కూలి పనులు చేసుకొని జీవించే సాధారణ కుటుంబాలకు చెందినవారని, తాగునీటిని కొనుగోలు చేసి వినియోగించుకునే పరిస్థితి లేదని తెలిపారు. ముఖ్యంగా ఎండాకాలంలో నీటి కొరత మరింత తీవ్రంగా మారుతోందని అన్నారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గాంధీనగర్ ప్రాంతంలో తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని, అప్పటివరకు తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    4
    ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆశ వర్కర్ల డిమాండ్లు: 1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. 2. ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    4
    ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ  అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం.  హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే  ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు.
ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. 
ఆశ వర్కర్ల డిమాండ్లు:
1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి.
2.   ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    21 hrs ago
  • కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణశోబితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి మూడు రోజులపాటు నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే కొనసాగించబడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4 నుండి అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆలయ పూజారులు కపీంద్రశర్మ స్పష్టం చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా వెయ్యి మంది పోలీసులతో పకడ్బందీ చర్యలు చేపట్టారు.
    4
    కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణశోబితంగా మారి, రామనామ స్మరణతో మారుమోగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడక నా పాదయాత్రతో కొండగట్టుకు తరలివస్తున్నారు. మాలవిరమణతోపాటు మాలధారణ కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలను రద్దు చేసి మూడు రోజులపాటు నిరంతరయంగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.  భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే కొనసాగించబడుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4 నుండి అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆలయ పూజారులు కపీంద్రశర్మ స్పష్టం చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా వెయ్యి మంది పోలీసులతో పకడ్బందీ చర్యలు చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    29 min ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    16 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ నిబంధనపై పోలీసులు, మున్సిపల్ కౌన్సిలర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎస్సై గడ్డం ఉమా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పట్టణంలోని పలు కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని, అలాంటి వాహనదారులకు పట్టణంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ నిబంధనపై పోలీసులు, మున్సిపల్ కౌన్సిలర్లు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎస్సై గడ్డం ఉమా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
పట్టణంలోని పలు కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని, అలాంటి వాహనదారులకు పట్టణంలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • కొండగట్టు లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల కోసం వేసిన తడకల పందిరి కూలిపోయింది. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పలువురు భక్తులు, నాయి బ్రాహ్మణులు ఉండగా ఐదారుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పందిరి కూలడంతో నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా అటు భక్తులను ఇటు నాయి బ్రాహ్మణులను ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన పందిరిని అధికారులు తొలగించి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. గాలి వల్ల పందిరి కూలిందని భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
    4
    కొండగట్టు లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల కోసం వేసిన తడకల పందిరి కూలిపోయింది. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పలువురు భక్తులు, నాయి బ్రాహ్మణులు ఉండగా ఐదారుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పందిరి కూలడంతో నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా అటు భక్తులను ఇటు నాయి బ్రాహ్మణులను ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన పందిరిని అధికారులు తొలగించి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. గాలి వల్ల పందిరి కూలిందని భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    38 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.