logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏపీ మంత్రి టీ జీ భరత్ సతీమణి శిల్ప ​అచ్చంపేట, సెప్టెంబర్ 16(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల కేంద్రం పరిధిలో శ్రీశైలానికి ఉత్తరముఖ ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఆహార శుద్ధి సంస్కరణల శాఖ మంత్రి టీ జీ భరత్ సతీమణి టీ జీ శిల్ప బుధవారం దర్శించుకున్నారు. స్వర్ణ గౌరీ గ్రూప్ సభ్యురాలు సోమిశెట్టి శ్రీవాణి మరియు తమ బృందంతో కలిసి దేవాలయాన్ని సందర్శించిన ఆమె, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ​ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థాన ధర్మకర్తల మం‌డలి అధ్యక్షుడు (చైర్మన్) బీరం మాధవరెడ్డి, పాలకమండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీనివాసరావు ప్రధాన అర్చకులు వీరయ్య ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి ఆలయ మర్యాదలతో శాలువా కప్పి సన్మానించారు. ​ఈ సందర్భంగా టీ జీ శిల్ప మాట్లాడుతూ... ప్రకృతి రమణీయతతో కూడిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోందని కొనియాడారు. ఆలయంలో నిరంతరం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ఆలయ వర్గాలు వారి కుటుంబానికి స్వామివారి దివ్య అనుగ్రహం కలగాలని ఆకాంక్షించాయి.

1 day ago
user_Taluka press club president:Sambu.chandra sekhar
Taluka press club president:Sambu.chandra sekhar
అచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
1 day ago
a58c8870-b148-4a22-a515-c3d99ef966cc

శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏపీ మంత్రి టీ జీ భరత్ సతీమణి శిల్ప ​అచ్చంపేట, సెప్టెంబర్ 16(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల కేంద్రం పరిధిలో శ్రీశైలానికి ఉత్తరముఖ ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఆహార శుద్ధి సంస్కరణల శాఖ మంత్రి టీ జీ భరత్ సతీమణి టీ జీ శిల్ప బుధవారం దర్శించుకున్నారు. స్వర్ణ గౌరీ గ్రూప్ సభ్యురాలు సోమిశెట్టి శ్రీవాణి మరియు తమ బృందంతో కలిసి దేవాలయాన్ని సందర్శించిన ఆమె, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ​ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థాన ధర్మకర్తల మం‌డలి అధ్యక్షుడు (చైర్మన్) బీరం మాధవరెడ్డి, పాలకమండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీనివాసరావు ప్రధాన అర్చకులు వీరయ్య ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి ఆలయ మర్యాదలతో శాలువా కప్పి సన్మానించారు. ​ఈ సందర్భంగా టీ జీ శిల్ప మాట్లాడుతూ... ప్రకృతి రమణీయతతో కూడిన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోందని కొనియాడారు. ఆలయంలో నిరంతరం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ఆలయ వర్గాలు వారి కుటుంబానికి స్వామివారి దివ్య అనుగ్రహం కలగాలని ఆకాంక్షించాయి.

More news from Nalgonda and nearby areas
  • పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
    1
    పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి
HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    1 hr ago
  • ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.
    1
    ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026.

9వ జాతీయ పోషణ మాసం 2026
ఆత్మకూరు:నంద్యాల జిల్లా.           ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21  నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు
ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి,  P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.
    1
    జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
  • అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.
    1
    అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన
నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ  మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.
    user_Khajavali
    Khajavali
    General Store ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నారాయణపేట: నియోజకవర్గం‌లో గవినర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేసిన కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రజల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే పాంచజన్య సంకల్ప సభ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
    1
    తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ 
నారాయణపేట: నియోజకవర్గం‌లో గవినర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేసిన కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్
ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రజల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే పాంచజన్య సంకల్ప సభ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ సభను విజయవంతం చేసేందుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist Gadwal, Jogulamba Gadwal•
    33 min ago
  • బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....
    4
    బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
బాసు హనుమంతు నాయుడు  గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు.
అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....
    user_Mahammad sami
    Mahammad sami
    Kaloor Thimmandoddi, Jogulamba Gadwal•
    3 hrs ago
  • దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు
    4
    దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు
విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న  బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
    1
    పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.