పెద్ది నాయకత్వంలో కొమ్మాల జాతరకు గులాబీ ప్రభ బండ్లు సిద్ధం... నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. గ్రామాలన్నింటిలో గులాబీ ప్రభ బండ్లు ముస్తాబవుతూ జాతర వాతావరణాన్ని ముందుగానే తీసుకొస్తున్నాయి. నేటి సాయంత్రం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి గులాబీ శ్రేణులు ప్రభ బండ్లతో బయలుదేరనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే కార్యకర్తలతో జాతర సందడి నెలకొననుంది. కేసీఆర్ పాటలు, డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్స్, కోలాటాల నృత్యాలతో జాతర ప్రాంతం మారుమోగనుంది. గ్రామాల్లో గులాబీ ప్రభ బండ్ల ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు గిర్ని బావి వద్ద ప్రభ బండ్లను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.1
- Post by వేణు విలేకరి1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కాముని పౌర్ణమి రోజున స్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉండడంతో రథోత్సవాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. సోమవారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన రథోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొంటారు.1
- జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ గీతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోలీస్ సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుంటూ, డాన్స్ చేస్తూ ఎస్పీ మహేష్ గీతే సందడి చేశారు. అధికారులతో కలిసి స్టెప్పులు వేస్తూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే పోలీస్ శాఖలోనూ ఇలాంటి వేడుకలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం పోలీస్ కార్యాలయం రంగుల మయంగా మారి హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి.1
- నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు1
- మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ లోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణ లో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బంది తో కలిసిఎస్పీ శబరిష్ ,డీఎస్పీ తిరుపతి రావు.. జిల్లా పోలీస్ అధికారులు. అదిరి పొయో స్టెప్పులు వేసి అలరించారు..1
- ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.1
- Post by వేణు విలేకరి1