logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

త్వరిత గతిన హత్య కేసును చేదించినధర్మవరం పోలీసులు... ముగ్గురు అరెస్ట్ ధర్మవరం మండలం ఓబులనయనిపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు ఈ నెల 7న చెరువు కట్ట వద్ద హత్యకు గురయ్యారని డీఎస్పీ జగన్నాథ్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ నేత గంగాధర్ నాయుడు, చరణ్, జి. గంగాధర్ కలిసి బోయ శ్రీనివాసులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి మహేంద్ర వాహనం, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

14 hrs ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

త్వరిత గతిన హత్య కేసును చేదించినధర్మవరం పోలీసులు... ముగ్గురు అరెస్ట్ ధర్మవరం మండలం ఓబులనయనిపల్లికి చెందిన బోయ శ్రీనివాసులు ఈ నెల 7న చెరువు కట్ట వద్ద హత్యకు గురయ్యారని డీఎస్పీ జగన్నాథ్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. వైసీపీ నేత గంగాధర్ నాయుడు, చరణ్, జి. గంగాధర్ కలిసి బోయ శ్రీనివాసులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి మహేంద్ర వాహనం, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఓటర్ల అభ్యర్థనలు, అభ్యంతరాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏ ఈ ఆర్ ఓ శంకర్ రెడ్డి కణేకల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) ప్రక్రియలో భాగంగా 148–రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కణేకల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, హియరింగ్‌లు, అభ్యర్థనలు, అభ్యంతరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఏఈఆర్‌ఓ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఓటర్ల జాబితాలో పేర్లకు సంబంధించి వచ్చిన అభ్యర్థనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై చేపట్టిన హియరింగ్ ప్రక్రియ, అందిన అభ్యంతరాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని,ప్రతి అభ్యర్థనను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఏఈఆర్‌ఓ శంకర్‌రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా,అనర్హులైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల మేరకు సరిదిద్దేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ఓటర్ల అభ్యర్థనలు, అభ్యంతరాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఏ ఈ ఆర్ ఓ శంకర్ రెడ్డి
కణేకల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) ప్రక్రియలో భాగంగా 148–రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కణేకల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, హియరింగ్‌లు, అభ్యర్థనలు, అభ్యంతరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఏఈఆర్‌ఓ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఓటర్ల జాబితాలో పేర్లకు సంబంధించి వచ్చిన అభ్యర్థనలు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై చేపట్టిన హియరింగ్ ప్రక్రియ, అందిన అభ్యంతరాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని,ప్రతి అభ్యర్థనను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని ఏఈఆర్‌ఓ శంకర్‌రెడ్డి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా,అనర్హులైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల మేరకు సరిదిద్దేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 🙏 శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు. శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. “కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు.
    1
    శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 🙏
శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
“కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు. 
శ్రీవారి నిత్య కైంకర్యాలలో తొలి సేవ “సుప్రభాత సేవ” 
శ్రీవారి నమూనాలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మేల్కొలిపే ఈ పవిత్ర సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
“కౌసల్యా సుప్రజా రామా…” అంటూ స్వామివారికి సుప్రభాతం సమర్పించి, నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుడతారు.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనారోగ్య ఓటరు ఇంటికి వెళ్లి విచారించిన బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు. బద్వేలు, ఆగస్టు 12: ఓటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన సర్ కార్యక్రమంలో ప్రస్తుతం ఓటు హక్కుకలిగిన వ్యక్తి 2002 ఓటు సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల ఆదేశాల మేరకు సమర్పించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి ఓటు హక్కు కోల్పోకూడదు అనే దృఢ సంకల్పంతో"సర్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు మానవత్వం చాటుకున్నారు.బద్వేలు పట్టణంలోని 179 రాజుగారి వీధి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఓటర్లకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ హియరింగ్‌కు అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమైన ఒక ఓటరు హాజరుకాలేకపోయారు. విషయం తెలుసుకున్న తహశీల్దారు తిరుమల బాబు స్వయంగా ఆ ఓటరు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని ఓటర్లకు సైతం న్యాయం జరిగేలా అధికారే స్వయంగా ఇంటికి వెళ్లి విచారించడం బద్వేలులో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సందర్భంగా ఓటరు కుటుంబ సభ్యులు, స్థానికులు తహశీల్దారు చొరవను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. "ప్రభుత్వం, అధికారులు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ఓటరు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    అనారోగ్య ఓటరు ఇంటికి వెళ్లి విచారించిన బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు.
బద్వేలు, ఆగస్టు 12: ఓటర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన సర్ కార్యక్రమంలో  ప్రస్తుతం ఓటు హక్కుకలిగిన వ్యక్తి 2002 ఓటు సమాచారాన్ని అందజేయాలని ఎన్నికల ఆదేశాల మేరకు సమర్పించని వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి ఓటు హక్కు కోల్పోకూడదు అనే దృఢ సంకల్పంతో"సర్" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బద్వేలు తహశీల్దారు తిరుమల బాబు మానవత్వం చాటుకున్నారు.బద్వేలు పట్టణంలోని 179 రాజుగారి వీధి పోలింగ్ కేంద్రంలో ఈరోజు ఓటర్లకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ హియరింగ్‌కు అనారోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితమైన ఒక ఓటరు హాజరుకాలేకపోయారు. 
విషయం తెలుసుకున్న తహశీల్దారు తిరుమల బాబు స్వయంగా ఆ ఓటరు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని ఓటర్లకు సైతం న్యాయం జరిగేలా అధికారే స్వయంగా ఇంటికి వెళ్లి విచారించడం బద్వేలులో ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సందర్భంగా ఓటరు కుటుంబ సభ్యులు, స్థానికులు తహశీల్దారు చొరవను అభినందించి ధన్యవాదాలు తెలిపారు. "ప్రభుత్వం, అధికారులు మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ఓటరు కృతజ్ఞతలు తెలిపారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
    2
    * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు

* కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం

* పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి
 
* ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ

సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది.
​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ  గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు.
​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు
    1
    అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు
నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    10 hrs ago
  • కనేకల్ బస్టాండ్ వద్ద జనావాసాల నడుమ చేతబడి సామాగ్రి కలకలం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులోని RTC బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర బంధనం చేసి, వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
    1
    కనేకల్ బస్టాండ్ వద్ద జనావాసాల నడుమ చేతబడి సామాగ్రి కలకలం
రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులోని RTC బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర బంధనం చేసి, వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పగిడ్యాలలో రైతన్నకు గుండె కోత పది ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఈ ఏడాది వర్షాలు అన్నదాతలకు గుండె కోతలను మిగిల్చాయనే చెప్పాలి. పగిడ్యాలకు చెందిన భాను ప్రసాద్ రెడ్డి పది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఐదు ఎకరాలు తన సొంత భూమి, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2,50,000 పెట్టుబడి పెట్టానని అయితే సరైన వర్షాలు లేక పంటలలో ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయిందని వాపోయాడు. అధికారులు , ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.
    1
    పగిడ్యాలలో రైతన్నకు గుండె కోత పది ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట
ఈ ఏడాది వర్షాలు అన్నదాతలకు గుండె కోతలను మిగిల్చాయనే చెప్పాలి. పగిడ్యాలకు చెందిన భాను ప్రసాద్ రెడ్డి పది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఐదు ఎకరాలు తన సొంత భూమి, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2,50,000 పెట్టుబడి పెట్టానని అయితే సరైన వర్షాలు లేక పంటలలో ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయిందని వాపోయాడు. అధికారులు , ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.