logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కనేకల్ బస్టాండ్ వద్ద జనావాసాల నడుమ చేతబడి సామాగ్రి కలకలం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులోని RTC బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర బంధనం చేసి, వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

17 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago

కనేకల్ బస్టాండ్ వద్ద జనావాసాల నడుమ చేతబడి సామాగ్రి కలకలం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులోని RTC బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర బంధనం చేసి, వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కదిరి ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు
    1
    వన్యాప్రాణులను వేటాడిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు 
కదిరి
ముదిగుబ్బ మండలం దొరిగల్లు రిజర్వ్ అడవిలో అలువ వేటాడి తరలించాడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు రిమాండ్ కి తరలింపు
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు * కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం * పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి * ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది. ​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు. ​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
    2
    * 40 ఏళ్ల సాగు భూములపై దళితులకే సర్వహక్కులు

* కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఐ సమర శంఖారావం

* పేదలందరికీ 3 సెంట్ల స్థలం, రూ.5 లక్షల సాయం అందించాలి
 
* ‘మార్పు కోసం సీపీఐ’ పాదయాత్రకు విశేష ప్రజాదరణ

సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహానంది మండల కార్యదర్శి సామెల్ సారథ్యంలో చేపట్టిన 'మార్పు కోసం సీపీఐ' ప్రచార పాదయాత్ర పార్టీ శ్రేణుల కోలాహలం నడుమ మిన్నంటింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పాల్గొన్నారు. మహానంది మండల కేంద్రం నుండి ప్రారంభమైన ఈ యాత్ర అయ్యన్న నగర్, అల్లినగరం, శ్రీనగరం, బుక్కాపురం, తిమ్మాపురం, అబ్బీపురం చెంచుకాలనీల మీదుగా సాగి పుట్టుపల్లె గ్రామం వద్ద ముగిసింది. దారి పొడవునా గ్రామీణ ప్రజలు, మహిళలు సీపీఐ నాయకులకు ఘనస్వాగతం పలికి, తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను ఆవేదనతో విన్నవించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలకు గ్రామాల్లో అత్యంత ప్రజాదరణ లభించింది.
​ఈ సందర్భంగా రంగా నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అసమర్థ, నిరంకుశ పాలన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసి నిరుపేద ప్రజలను తీవ్రంగా దగా చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు దానిపై స్పందించలేదన్నారు. అలాగే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయస్సు గల మహిళలకు నెలకు రూ. 1,500 ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. పుట్టుపల్లె గ్రామంలో దళితులు గత 40 సంవత్సరాలుగా స్వేదమొర్చి సాగు చేసుకుంటున్న సుమారు 84 ఎకరాల భూములను, అగ్రవర్ణ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అటవీశాఖ అధికారులు లాక్కోవడానికి ప్రయత్నించడం, దళితులను ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. దళితుల భూముల హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ, పేద దళితులకు కేటాయించిన భూములపై వారికే పూర్తి సర్వహక్కులు కల్పించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
​అలాగే అబ్బీపురం చెంచుకాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని, ఐటీడీఏ  గుర్తింపు లేకపోవడం వల్ల చెంచు గిరిజనులు అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీని తక్షణమే ఐటీడీఏ పరిధిలోకి తీసుకువచ్చి, గిరిజనులకు వర్తించే సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని స్పష్టం చేశారు. మరోవైపు బుక్కాపురంతో పాటు మండలవ్యాప్తంగా ఇల్లు లేక నిరుపేదలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయకపోతే అధికారులను, ప్రజాప్రతినిధులను రోడ్లపై నిలదీస్తామని హెచ్చరించారు.
​ఈ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 17వ తేదీన తలపెట్టిన ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిరుపేదలు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాసు, కోయాలకొండ నాగరాజు తమ ప్రజా పాటలతో కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టగా, వారి ఆటపాటలు ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. ఈ నిరసన పాదయాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగ రాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సహాయ కార్యదర్శి రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రజిత, లక్ష్మి దేవి, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరినాథ్‌, సిపిఐ సీనియర్ నాయకులు రాజేశ్వరయ్య, మధు, లక్ష్మణ్, దస్తగిరి, తుపాకుల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి, లక్ష్మయ్య, బలరాముడు, జయన్న, జయరాముడులతో పాటు సీపీఐ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు
    1
    అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో క్రీడా పోటీలు
నంద్యాల: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యం.డి.ఎన్. రాజా తెలిపారు
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    10 hrs ago
  • వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు....

మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట
మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అందమైన పాము 🐍 దాని వెనుక డేంజర్ ❌🤢 అందం వెనుక దాగున్న డేంజర్.. ఇలాంటి పామును చూశారా? వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.
    1
    అందమైన పాము 🐍 

దాని వెనుక డేంజర్ ❌🤢

అందం వెనుక దాగున్న డేంజర్.. 

ఇలాంటి పామును చూశారా?
వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కనేకల్ బస్టాండ్ వద్ద జనావాసాల నడుమ చేతబడి సామాగ్రి కలకలం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులోని RTC బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర బంధనం చేసి, వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
    1
    కనేకల్ బస్టాండ్ వద్ద జనావాసాల నడుమ చేతబడి సామాగ్రి కలకలం
రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులోని RTC బస్టాండ్ పక్కన జనావాసాల మధ్య చేతబడి సామగ్రి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నల్ల మేక తల, నల్ల కోడి తలతో యంత్ర బంధనం చేసి, వాటితో పాటు నిమ్మకాయలు, కుంకుమను ఒక కవర్లో ఉంచి అక్కడ వదిలేశారు. అమావాస్య వేళ ఇలా చేయడం గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పగిడ్యాలలో రైతన్నకు గుండె కోత పది ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఈ ఏడాది వర్షాలు అన్నదాతలకు గుండె కోతలను మిగిల్చాయనే చెప్పాలి. పగిడ్యాలకు చెందిన భాను ప్రసాద్ రెడ్డి పది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఐదు ఎకరాలు తన సొంత భూమి, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2,50,000 పెట్టుబడి పెట్టానని అయితే సరైన వర్షాలు లేక పంటలలో ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయిందని వాపోయాడు. అధికారులు , ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.
    1
    పగిడ్యాలలో రైతన్నకు గుండె కోత పది ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట
ఈ ఏడాది వర్షాలు అన్నదాతలకు గుండె కోతలను మిగిల్చాయనే చెప్పాలి. పగిడ్యాలకు చెందిన భాను ప్రసాద్ రెడ్డి పది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఐదు ఎకరాలు తన సొంత భూమి, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.2,50,000 పెట్టుబడి పెట్టానని అయితే సరైన వర్షాలు లేక పంటలలో ఎదుగుదల తీవ్రంగా తగ్గిపోయిందని వాపోయాడు. అధికారులు , ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరాడు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.