Shuru
Apke Nagar Ki App…
నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఏడో వాడు బొడ్రాయి దగ్గర క్లీన్ చేయాలనుకుంటున్నాం
M Swamy
నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఏడో వాడు బొడ్రాయి దగ్గర క్లీన్ చేయాలనుకుంటున్నాం
More news from తెలంగాణ and nearby areas
- భువనగిరికి చేరుకున్న కల్లుగీత కార్మిక సంఘం బస్సు యాత్ర రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బస్సు యాత్ర ఆదివారం భువనగిరి పట్టణానికి చేరుకుంది. కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లాలోని మండలాధ్యక్షులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.1
- దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దెను కూల్చివేసినట్లుతెలుస్తోంది. ఆదివారం రాత్రి విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేసినట్లుగా స్థానికులు తెలిపారు.ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా కూల్చివేసారంటూ అధికారులపై బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- ముమ్మాటికి డబుల్ బెడ్ రూములు మా కెసిఆర్ కట్టినవే ఇద్దరు మంత్రులను ఒక ఆట ఆడుకున్న : హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో కౌశిక్ రెడ్డి వాగ్వాదం2
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1
- Hyderabad’s Ganga-Jamuni Tehzeeb Shines During Bonalu Celebrations Hyderabad: Bonalu celebrations in Kumarwadi Colony, Edi Bazar, once again showcased the city’s famous Ganga-Jamuni tehzeeb, where people from Hindu and Muslim communities were seen coming together and participating in the festive atmosphere with mutual respect and harmony. During the Bonalu festival, local residents gathered in the area as devotees took part in traditional celebrations and religious rituals. The presence and support of people from different communities reflected Hyderabad’s long-standing culture of peace, brotherhood and communal harmony. The scenes from Kumarwadi Colony are a reminder that festivals can bring people closer and strengthen the bond between communities. Despite differences in religion and traditions, residents stood together and shared the spirit of celebration. Hyderabad has historically been known for its Ganga-Jamuni tehzeeb, where different communities live together, respect each other’s traditions and stand by one another during important occasions. The Bonalu celebrations at Edi Bazar gave a positive message of unity — Hindu aur Muslim jab ek saath khade hote hain, toh Hyderabad ki asli khoobsurti nazar aati hai. Such moments of communal harmony deserve to be highlighted and encouraged, especially at a time when society needs more messages of peace, understanding and brotherhood.1
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మీయ విందులో ఎంపీ ఈటల రాజేందర్ ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు రాంనగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. స్నేహబంధాలు, మానవ సంబంధాలను పెంపొందించే ఇటువంటి ఆత్మీయ కలయికలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.1
- సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్.1
- పరామర్శించిన సమయంలో కంటతడి పెట్టుకున్న కేసీఆర్....... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం ఆయన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను అందించి కుటుంబ సభ్యులను ఓదార్చి,భవిష్యత్ లో పిల్లల చదువులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు జనగామ జిల్లా నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్ పదవి సిరిపాటి వేణుకు ఇవ్వాలి : తెలంగాణ బేడ బుడగ జంగాల ఐక్యవేదిక వరంగల్ బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య అందరికి నమస్కారం🙏 బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు మోతే కనకయ్య మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య గార్ల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతు పలుకుతున్న వివిధ జిల్లాల నాయకులకు నమస్కరిస్తున్నాను ఇలా మనమందరం: ఐక్యతతో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు మద్దతు తెలుపుతున్న వివిధ జిల్లాల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. మీ సిరిపాటి వేణు. బేడ బుడగ జంగం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు✊✊✊✊✊✊✊1