Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా..... మెట్టుపల్లి మండలం మేడిపల్లి గ్రామశివారులో RTC బస్ కారు డీ.... అదుపుతప్పి బస్సును డికొట్టిన కారు..... 12 మందికి గాయాలు.... నలుగురి పరిస్థితి విషమం.... నిజామాబాద్, జగిత్యాల ఆసుపత్రులకు తరలింపు..... కారులో ప్రయాణిస్తున్న వారు కోరుట్ల పట్టణవాసులు..... కర్ణాటకలోని గానుగాపూర్ క్షేత్ర దర్శనానికి వెళ్లి వస్తున్న కోరుట్ల వాసులు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
జగిత్యాల జిల్లా..... మెట్టుపల్లి మండలం మేడిపల్లి గ్రామశివారులో RTC బస్ కారు డీ.... అదుపుతప్పి బస్సును డికొట్టిన కారు..... 12 మందికి గాయాలు.... నలుగురి పరిస్థితి విషమం.... నిజామాబాద్, జగిత్యాల ఆసుపత్రులకు తరలింపు..... కారులో ప్రయాణిస్తున్న వారు కోరుట్ల పట్టణవాసులు..... కర్ణాటకలోని గానుగాపూర్ క్షేత్ర దర్శనానికి వెళ్లి వస్తున్న కోరుట్ల వాసులు.
- User10010Dilawarpur😡10 hrs ago
More news from Hanumakonda and nearby areas
- CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి., ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, సీతక్క ఆదివారం పర్యటించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, క్యూ లైన్లు, భక్తుల కోసం తాత్కాలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేసి, లక్షలాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.1
- సర్పంచులకు సన్మానం1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం- కంటాయపాలెం గ్రామాల మధ్య గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, కూలీలు, వాహనదారులు వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.1
- ధర్మాన్ని కాపాడండి.... ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.. మహిళల కోలాటాలు, మంగళ హారతులతో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజుకు ఘన స్వాగతం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం బాన్సువాడ ప్రతినిధి ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటూ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వెల్లడించారు. శ్రీరామ గురు వందనం అనే కార్యక్రమానికి బాన్సువాడ మండలం బోర్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి అతిథిగా హాజరైన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోచమ్మ ఆలయం నుంచి ఆ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు మహిళల కోలాటాలు, మహిళల నృత్యాలు, జైశ్రీరామ్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో మారి మోగిపోయాయి. ఊహించని విధంగా మహిళలు, భక్తులు, చిన్నారులు తరలి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు భక్తులతో నిండిపోయింది. ఇంజనీరింగ్ కళాశాల వేదికపై చేరుకున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు ప్రజాప్రతినిధులు కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ఆయనకు ఘన సన్మానం చేశారు. అనంతరం శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మన హిందూ సంప్రదాయాలను కు దూరంగా ఉంటూ ప్రాచాత్య పోకడలకు పోతూ హిందూ సంస్కృతిని కొంతమంది సద్గురు మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత దేశ సంస్కృతిని ఎంతో కొనియాడుతుంటే కొంతమంది భారతీయులు హిందూ సంస్కృతిని మర్చిపోయి దేశాన్ని పాలించి వెళ్లిపోయిన బ్రిటిష్ వారి సంస్కృతిని మన దేశంలో కొంతమంది పాటించడం అది ఎంతో బాధాకరమని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం చదవాలని పిల్లలు కూడా రామాయణం, భగత్గీత శ్లోకాలను నేర్పించాలంటూ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంస్కృతికి ప్రపంచంలోనే ఒక గొప్ప గా చూస్తారని అలాంటిది మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత గాని, రామాయణం పుస్తకం కానీ తప్పకుండా ఉండాలని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వీలైన శ్లోకాలు చదవాలని, వాటిని అర్థం చేసుకుంటే ఎంతో దాంట్లో తీయదనం కనిపిస్తుందని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ, శ్రీరామ నామస్మరణం ఉండాలని ఆయన హిత బోధ చేశారు. దేవాలయాలకు వెళితే ముఖ్యంగా మహిళలు, యువత, యువతులు సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకునే బాధ్యత అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. అవసరమైతే పదిమందికి ఆపదలో ఉంటే అండగా ఉండండి.... లేకుంటే వారికి అన్యాయం చేయకండి అంటూ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్త జనానికి హిత బోధ చేశారు. శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ప్రవచనం వినడానికి బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణం అతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ మధ్య మారి మోగిపోయింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత పట్లోళ్ల పర్వారెడ్డి పూర్తిగా బాద్యతలు చేపట్టారు. అవసరమైన ఖర్చులు ఆయనే భరించారు. పర్వ రెడ్డి చేస్తున్న కృషికి బోర్లం యువత, మహిళలు ఆయనకు చేదుడు వాదోడుగా ఉంటూ ఈ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆధ్యాత్మిక సభ విజయవంతం కావడానికి కారకులయ్యారు.1
- *ఎర్రవల్లిలోని*... *కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన* *డిసిసి అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా* 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ప్రజా తెలంగాణ న్యూస్/ *ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు అసెంబ్లీలో నిలదీసి సాధించాలని డిమాండ్* *గజ్వేల్ ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు* *ప్రతిపక్షనేతగా సకల వసతులు పొందుతున్న కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్* సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం మెరుపు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిసిసి అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల కన్నుగప్పి ఎర్రవల్లి కేసీఆర్ ఫాoహౌజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు ముందు ఎర్ర తివాచి పరిచి పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకు పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఫాoహౌజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కెసిఆర్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో వారిమధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కెసిఆర్ నుండి అనుమతి లేనిదే కాంగ్రెస్ నేతలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండడంతో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శాంతింపజేశారు. అయితే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనం, ఇతర సదుపాయాలు పొందడం సిగ్గుచేటని డిసిసి అధ్యక్షులు అoక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయ మోహన్, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్త, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.4
- కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశం1
- హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.2
- సర్పంచులకు సన్మానం1