Shuru
Apke Nagar Ki App…
రేపు జరగబోయే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీఎం ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోరడమైనది. వెన్యూ.. ఏకాంత బ్లెస్ హోటల్ సమయం.. 6 గంటల నుంచి 9 గంటల వరకు
RAVI KUMAR
రేపు జరగబోయే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీఎం ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోరడమైనది. వెన్యూ.. ఏకాంత బ్లెస్ హోటల్ సమయం.. 6 గంటల నుంచి 9 గంటల వరకు
More news from Y.S.R. (Kadapa) and nearby areas
- ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.1
- అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.1
- అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.1
- లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..1
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.1
- చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండలంలో రెండు అక్రమ క్వారీల పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు.. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, రెండు అక్రమ క్వారీల్లో లారీ మరియు రెండు హిటాచీ వాహనాలను సీజ్ చేశాం.. సుమారు 30 బ్లాక్ లకు స్వాధీనం చేసుకొని మైనింగ్ అధికారులకు అప్పజెప్పాం.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.. అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం..1
- హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.2
- నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.1