బాన్సువాడ : నస్రుల్లాబాద్ రాముల గుట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని రాముల గుట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం సీతారాముల దివ్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు జాతరను నిర్వహించనున్నారు. భక్తుల కోసం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని రామయ్యను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగు చర్యలు తీసుకున్నమన్నారు ఆలయ చైర్మన్ పటోళ్ల మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
బాన్సువాడ : నస్రుల్లాబాద్ రాముల గుట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అర్చకులు బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని రాముల గుట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం సీతారాముల దివ్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు జాతరను నిర్వహించనున్నారు. భక్తుల కోసం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని రామయ్యను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగు చర్యలు తీసుకున్నమన్నారు ఆలయ చైర్మన్ పటోళ్ల మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
- మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.1
- నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- నిజామాబాద్ హమాల్వాడిలో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో DJ వినియోగానికి అనుమతి లేదంటూ పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన MLA.. స్వయంగా DJ వాహనం స్టీరింగ్ పట్టి ముందుకు నడిపించడం చర్చనీయాంశమైంది.1
- కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా . కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి. ఆ సీతారాములవారి కళ్యాణం కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు జనగణనీయంగా నిర్వహించినారు.2
- బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- సిరిసిల్ల పట్టణంలోని స్థానిక నెహ్రు నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంను ప్రారంభించారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ లోకానికి ఆదర్శ దంపతులైన శ్రీసీతారాముల దంపతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక నెహ్రు నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించి ఉత్సవ దేవత విగ్రహాలతో ఘనంగా పురవీధుల గుండ ఊరేగిస్తూ నిర్వహిస్తున్న రథోత్సవ కార్యక్రమాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవటం లేదని ఈ రథోత్సవంలో ప్రతి ఒక్కరి మదిలో శ్రీ సీతారాముల వారిని స్మరించుకుంటూ పలుకుతున్న రామనామ స్మరణతో పరిసరాలన్నీ మారుమోగుతూ ఒక కొత్త ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందని అన్నారు.భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవుడిగా నిత్యం ప్రజలచే పూజనందుకుంటున్నారని శ్రీ సీతారామాంజనేయుల చల్లని దీవెనలతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ప్రజలందరూ వారి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెంది సంతోషంగా ఉండేలా చూడాల్సిందిగా శ్రీ సీతారామాంజనేయ స్వామి వారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజిని శ్రీనివాస్ ఎర్ర వెంకట రాజం గారు, బొద్దుల శ్రీనివాస్ , మెరుగు మంజుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుండ్లపళ్లి రామానుజన్, పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి కళ్యాణ భావన అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ గారు, పుర ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1