*ముధోల్ నియోజకవర్గానికి 70 కోట్ల నిధుల మంజూరు* *సి. సి. రోడ్లు డ్రైనేజీ కి 17 కోట్ల నిధులు* *గ్రామ గ్రామ న సర్పంచ్ లకు, నాయకులకు ఒకే సారి ప్రొసీడింగ్స్ అందజేత* *వివరాలు వెల్లడించిన పవార్ రామరావ్ పటేల్ గారు...* ముధోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తన కోటాలో 70 కోట్ల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. శనివారం బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గం లోని ఆయా గ్రామాల సర్పంచులకు కుంటాల 20 లక్షలు, బుజ్జూర్ 45 లక్షలు, మలేగం 22 లక్షలు, కరెగాం 6 లక్షలు , కనకపుర్ 12 లక్షలు, , సుంక్లీ 9 లక్షలు cc రోడ్డు, పొలం బాటలో 15 లక్షలు, కిస్టాపుర్ 19 లక్షలు, ఓలా 5 లక్షలు, చింతల బోరి 1కోటి , దేగం 15 లక్షలు, మంజీరీ 12 లక్షలు, అంతర్ణి 5 లక్షలు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది అన్నారు. పొలం బాట ద్వారా 8 కోట్ల రూపాయల నిధులు, మహిళా సమైక్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలకు, అంగన్వాడి భవనాలకు 45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే సమస్యల పరిష్కారం అవుతుందన్నారు. సర్పంచులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా పలుమార్లు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తామని ఈసారి బడ్జెట్లో తెలియజేయడం శుభ సూచకమన్నారు. 28ప్యాకేజీ పనులు పూర్తయితే నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత సంవత్సరం గ్రామాల అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగిందని, ఈసారి 70 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సర్పంచుల సంఘం అధ్యక్షులు పండితరావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచుల సంఘం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
*ముధోల్ నియోజకవర్గానికి 70 కోట్ల నిధుల మంజూరు* *సి. సి. రోడ్లు డ్రైనేజీ కి 17 కోట్ల నిధులు* *గ్రామ గ్రామ న సర్పంచ్ లకు, నాయకులకు ఒకే సారి ప్రొసీడింగ్స్ అందజేత* *వివరాలు వెల్లడించిన పవార్ రామరావ్ పటేల్ గారు...* ముధోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తన కోటాలో 70 కోట్ల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. శనివారం బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గం లోని ఆయా గ్రామాల
సర్పంచులకు కుంటాల 20 లక్షలు, బుజ్జూర్ 45 లక్షలు, మలేగం 22 లక్షలు, కరెగాం 6 లక్షలు , కనకపుర్ 12 లక్షలు, , సుంక్లీ 9 లక్షలు cc రోడ్డు, పొలం బాటలో 15 లక్షలు, కిస్టాపుర్ 19 లక్షలు, ఓలా 5 లక్షలు, చింతల బోరి 1కోటి , దేగం 15 లక్షలు, మంజీరీ 12 లక్షలు, అంతర్ణి 5 లక్షలు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు నిధులు
మంజూరు చేయడం జరిగింది అన్నారు. పొలం బాట ద్వారా 8 కోట్ల రూపాయల నిధులు, మహిళా సమైక్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలకు, అంగన్వాడి భవనాలకు 45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే సమస్యల పరిష్కారం అవుతుందన్నారు. సర్పంచులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా పలుమార్లు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తామని ఈసారి బడ్జెట్లో తెలియజేయడం శుభ సూచకమన్నారు. 28ప్యాకేజీ పనులు పూర్తయితే నియోజకవర్గంలో 50 వేల
ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత సంవత్సరం గ్రామాల అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగిందని, ఈసారి 70 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సర్పంచుల సంఘం అధ్యక్షులు పండితరావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచుల సంఘం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
- Post by Solanke Ravi4
- Post by KR NEWS 3691
- తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం : *విద్యాకు 8% శాతం బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులను మరియు తెలంగాణ ఏర్పాటుకు కోసం ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం* *విద్యార్థుల సమస్యల పై మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ నూతన తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థులు కీలకపాత్ర అప్ పోషించి ఎంతో మంది విద్యార్థుల బలిదలన పై తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు కేటాయించింది కేవలం 8% మాత్రమే ఈ ఇది విద్యార్థులను అవమాన చేస్తూ తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి అని భావించిన శ్రీకాంతాచార్య లాంటి త్యాగ మూర్తులకు అవమాన పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్,కౌశిక్ తదితరులు పాల్గొనడం జరిగింది1
- Post by Venu Gopal1
- భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సంస్థాగత బలోపేతమే ధ్యేయం ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.1
- వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- Post by Solanke Ravi1