Shuru
Apke Nagar Ki App…
రైతులకు నీరు అందించాలని డిమాండ్ – డిఇతో మాట్లాడిన మాలోత్ కవిత మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకాల వాగు పరివాహక ప్రాంతంలో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఈ సమస్యపై మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిఇతో ఫోన్‌లో మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని డిఇ హామీ
M D Azizuddin
రైతులకు నీరు అందించాలని డిమాండ్ – డిఇతో మాట్లాడిన మాలోత్ కవిత మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకాల వాగు పరివాహక ప్రాంతంలో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఈ సమస్యపై మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిఇతో ఫోన్‌లో మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని డిఇ హామీ
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.3
- బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం! భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.1
- భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి ఒక వివాహిత తన 18 నెలల బిడ్డతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్వరూప అనే మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు గజఈతగాళ్లకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఈతగాడు సిమ్మర్ ప్రసాద్ నీటిలో ఉన్న తల్లి–బిడ్డను గుర్తించి చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు. స్వరూప పాల్వంచ కలెక్టర్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆమె భర్త మృతి చెందినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తల్లి–బిడ్డలను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.2
- ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.1
- ఆశ వర్కర్ల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆశా వర్కర్లను రేణికుంట టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాజీవ్ రహదారిపై ఆశావర్కర్ల నిరసన తెలిపారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. పట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాదుకు బయలుదేరి ఆశ వర్కర్లను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తేలిపితే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై ఆశ వర్కర్లతో పాటు సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.4
- ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.4