జగిత్యాల జిల్లా ప్రేమ జంట అదృశ్యం...గుమ్లాపూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రియుడి మృతదేహం లభ్యం.. అమ్మాయి ఆచూకి లేక సర్వత్రా ఆందోళన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల జిల్లా ప్రేమ జంట అదృశ్యం...గుమ్లాపూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రియుడి మృతదేహం లభ్యం.. అమ్మాయి ఆచూకి లేక సర్వత్రా ఆందోళన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- వరంగల్ జిల్లాలో:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ పక్కనున్న బాత్రూంలో పామును గుర్తించిన ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనతో కొంతసేపు కార్యాలయంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్నాక్ క్యాచర్‌ను అక్కడికి చేరుకొని పామును పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరిపించుకున్నారు.1
- బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- Post by Venu Gopal1
- మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని, స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించి అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి దర్శనం కోసం అనేకమంది భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఆలయ అభివృద్ధి పై వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఇతర ఆలయ అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆచార సాప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ బృందం, దేవాదాయ శాఖ డి ఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు2
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.3