చలో హైదరాబాద్ చేపట్టిన ఆశా వర్కర్లు అరెస్టు చేసిన పోలీసులు....ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసుల తీరును నిరసిస్తూ ఆశ వర్కర్లు ఆందోళన ఆశ వర్కర్ల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆశా వర్కర్లను రేణికుంట టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాజీవ్ రహదారిపై ఆశావర్కర్ల నిరసన తెలిపారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. పట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హైదరాబాదుకు బయలుదేరి ఆశ వర్కర్లను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తేలిపితే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై ఆశ వర్కర్లతో పాటు సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
చలో హైదరాబాద్ చేపట్టిన ఆశా వర్కర్లు అరెస్టు చేసిన పోలీసులు....ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసుల తీరును నిరసిస్తూ ఆశ వర్కర్లు ఆందోళన ఆశ వర్కర్ల ఆందోళన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని
ఆశా వర్కర్లు చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆశా వర్కర్లను రేణికుంట టోల్ గేట్ వద్ద
పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాజీవ్ రహదారిపై ఆశావర్కర్ల నిరసన తెలిపారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. పట్టు రాజన్న సిరిసిల్ల
జిల్లా నుంచి హైదరాబాదుకు బయలుదేరి ఆశ వర్కర్లను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తేలిపితే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై ఆశ వర్కర్లతో పాటు సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో వైభవంగా సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కొంటెబోయిన నాగలక్ష్మి నరసింహులు ముదిరాజ్ హనుమాన్ దేవాలయ కమిటీ గ్రామ పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణం వేదమంత్రోత్సవాలతో వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ సీతారామచంద్రుని దర్శనం చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.1
- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకాల వాగు పరివాహక ప్రాంతంలో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఈ సమస్యపై మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిఇతో ఫోన్‌లో మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని డిఇ హామీ1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పాలకమండలి సభ్యులు, యువకులు మరియు గ్రామస్తుల సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం పోచమ్మ తల్లి గుడి వద్ద బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.4
- Post by Venu Gopal1
- ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ శివారులో రెండు రోజుల క్రితం ప్రేమ జంట అదృశ్యంకాగ ప్రియుడి మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్ లో లభించడంతో కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన యువతి, మహారాష్ట్ర కు చెందిన వలస కూలీ అంకుశ్ ప్రేమించుకున్నారు. యువతికి బైక్ నేర్పే క్రమంలో బైక్ తో సహా ఇద్దరు కెనాల్ లో పడినట్లు భావిస్తున్నారు. కోరుట్ల మండలం గుమ్లాపూర్ శివారులో అంకుస్ మృతదేహం లభించింది. మృతదేహంతో పాటు బైక్ ను వెలికి తీశారు. యువతి ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కోసం గాలిస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం బైక్ పై ఒక్కడే వెళ్లాడని చెబుతుండగా యువతి ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.3